Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Friday, December 30, 2011

గతం లోంచి భవిష్యత్తులోకి


న్యూ ఇయర్ వచ్చేస్తోంది కదా..ఏమైనా కొత్త పోస్టులు రాస్తున్నావా అని నా ఫ్రెండుశైల నన్ను అడిగింది ,ఏం రాయాలబ్బా అనుకున్నాను ..ఏదో రాయడం ఎందుకు ..ఈ సంవత్సరం లో జరిగినవన్నీ రాసేస్తే బెటర్ కదా అని 


ఎన్నొ రోజులుగా మా ఇంటికి ఎవరూ రాకపోవడం వల్ల ..




2011


జనవరి 1 న దేవుడిని మొక్కేసుకున్నాను ఈ సారి నా ఇల్లు ఖాళీగా ఉంటే మాత్రం నేనస్సలు ఒప్పుకోను అని.


అంతే ఏ కళనున్నాడో పది రోజుల తర్వాత నుంచి తన వరాలను కురిపించడం మొదలు పెట్టాడు , మొట్టమొదటగా మా ఫ్లాట్ కింద ఫ్లాట్ లో ఉంటున్న ..నా ఫ్రెండ్ ని పిలిచాను ...విచిత్రంగా ఎప్పుడు రానిది ఒకసారి పిలవగాని సపరివార సమేతంగా వచ్చి నన్ను హేపీస్ చేసేసింది . హమ్మయ్య దేవుడు నా మాట విన్నాడన్నమాట అనుకున్నాను .
తర్వాత పది రోజులకి మాకెంతో ప్రియమైన ..మా పెద్ద తోటికోడలు ..వాళ్ళ పిల్లలు,మా బావగారు వచ్చారు ..వాళ్ళతో కొత్త సం|| లోని  మొదటి నెల సరదాగా గడిచిపోయింది .
ఫిబ్రవరి వచ్చింది ..మా వాడి పుట్టిన రోజు హడావుడి మొదలైంది ..ఏం చేయాలి ?ఎవరి ని పిలవాలి ? ఎంత అవుతుంది అని నేను మా వారు బేరీజు వేసుకుంటూ ఒక నాలుగు రోజులు , తర్వాత షాపింగులు , రిటర్న్ గిఫ్టులు అంటూ ఉండగానే మా బాబు గాడి పుట్టిన రోజు ఘనంగా (ద్రవం , ఘనం కాదు ) ..సరదాగా జరిగి పోయింది . ఆ తర్వాత ఎంతైంది , ఏమేమి వచ్చాయ్ ,అందరి రెస్పాన్స్ ఏమిటి అని ఒక నాలుగురోజులు మా వారు ఆలోచిస్తూ ,మాట్లాడేస్తూ ఉండగానే ..మా ఊరికి వెళ్ళేపని పడింది ..రెండురోజుల్లో వచ్చేస్తా అని తను బయలుదేరి వెళ్ళి ..వస్తూ 


మార్చి తో పాటు , సర్ప్రైజ్ చేస్తూ నా చిన్న తోటికోడలి ని కూడా తీసుకు వచ్చారు ..తనకి నాకు స్నేహ బంధం ఎక్కువ ..కాసేపు కబుర్లు చెప్పుకుంటూ మా వాడికి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేస్తూ ..మధ్య మధ్యలో బయటకి తిరుగుతూ ...వాళ్ళ అమ్మాయిని ఆడిస్తూ ..గడిపేసాము ...తను ఉన్న పది రోజులు ఎలా గడిచాయో అస్సలు తెలియలేదు .ఆ తర్వాత ఆ మెమొరీలతో కొన్ని రోజులు ..మళ్ళీ ఏప్రిల్ వస్తోంది ..సెలవులు వస్తాయిగా ..మళ్ళీ కలవచ్చు అని ఆరాటంతో ఆ నెల ఎలాగోలా గడిపేసాను .


ఏప్రిల్  లో మా పెద్దక్క ఫోను చేసింది (తోటికోడలు) వాళ్ళ రెండోవాడికి ఉపనయనం చేస్తున్నాం , త్వరగా వచ్చేయాలని చెప్పడానికి ..హమ్మయ్య దొరికింది వంక మా వాళ్ళందరిని మళ్ళీ కలుసు కోవచ్చు అని తెగ షాపింగులు చేసేసి , రిజర్వేషనులు చేయించుకుని , మా వాడి చేత స్కూలు డుమ్మాకొట్టించేసి నేను మా ఊరి రైలు ఎక్కేసాను . మా అత్తగారు ,మావగారు అందరూ నా కోసమే ఎదురుచూస్తూ ఉన్నారు ..తర్వాత రోజు అందరం కలిసి మా అక్క వాళ్ళ ఊరు పొలోమంటూ వెళ్ళిపోయాము ... కోలాహలంగా, చుట్టాలతో , పిల్లలతో , పెద్దలతో , ముఖ్యంగా మేమందరం కలిసిన ఆనందంతో  ఏప్రిల్ నెల లో మా చిన్నోడి ఉపనయనంతో సరదాగా గడిచిపోయింది .






 మే,జూన్‌ నెలలు రెండూ మాకెంతో విషాదాన్ని ,బాధని ,ఆ బాధ వల్ల కలిగిన జ్ఞాపకాలనే వదిలేసి వెళ్ళాయి ...


జూలై ని కూడా వదిలేసాను అందులోనే ఉండిపోతే పిచ్చి వాళ్ళుయ్యేట్లు ఉన్నామని ..మా అమ్మని, నాన్నని మా ఊరు రమ్మని గొడవ చేసాను ...వాళ్ళు ఇదిగో వస్తాం , అదిగో వస్తాం అంటూ ...


ఆగస్టు లో మా అమ్మ ,నాన్న వచ్చారు ...పూజలు,శ్రావణ మాసాలు మొదలయ్యాయి  ..ఇంక నేను,  మావాడు హాయిగా మా అమ్మవాళ్ళతో కాలాన్ని గడిపేసాము ..


సెప్టెంబరు వినాయకుని ఇంటికి తెచ్చే హడావుడి తో మా అమ్మ తో సహా అందరం బిజీ అయిపోయాము ...ప్రతీ వినాయక చవితికి మా అమ్మ చేసిన నైవేద్యం తినే దేవుడు ..ఎందుకో ఈ సారి అమ్మాయ్ ఎలాగైనా ఈ సారి నీదే అన్నాడు , అంతే హుషారుగా నేను నైవేద్యాలు రెడీ చేసేస్తుంటే ..మా అమ్మ , నాన్న పోటా పోటీ గా మా వారి చేత , మా వాడి చేతా పూజలు చేయించేసారు . తర్వాత రోజు అలవాటు ప్రకారం మా ఫ్రెండ్సంతా కలిసి రాత్రంతా రక , రకాలా వినాయకులని చూడటానికి వెళ్ళు మా సిటీ అంతా చుట్టేసి వచ్చాము , ఆ తర్వాత రోజుకో ప్లేసు చొప్పున కావలిసి నన్ని వినాయకులని మా అమ్మకి చూపించేసాము .ఆ సరదాలోనే మా వారు వినాయక నిమజ్జనం రోజున కొల్హాపూర్ తీసుకువెళ్ళి పద్మవ్యూహం చూపించి అందులోంచి దాటించి (బహుశా ఛేదించి అనాలేమో) తీసుకువచ్చారు .ఈ దేవతలందరి దీవెనలతో నాకు మంచి పాటల గ్రూపు దొరికింది ...ఆ గ్రూపు ద్వారా నాకు అన్నయ్యలు , ఫ్రెండ్సు తెగ పరిచయమయ్యారు ....నా ఆనందం మరింత పెరిగింది .


అక్టోబర్  లో దసరా వచ్చింది ...మాకు అందరికి బట్టలు , కొత్త వస్తువులు , టీవీ లు వచ్చాయ్ ...మా మరిది ,తోటికోడలు వాళ్ళ  బుల్లి యువరాణి గారితో వచ్చారు ,మా ఇల్లు మళ్ళి సందడి సందడి అయిపోయింది , ఉన్న నాలుగు రోజులు మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి ..ఇల్లు బోసిపోయేలాగ చేసి మా యువరాణి గారు మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది . ఈ లోగా మా వారి ఫ్రెండ్సు ఇద్దరు ముగ్గురు భోజనాలకి ,బ్రేకుఫాస్టులకి , డిన్నర్ లకి వచ్చి వెళ్ళారు ...ఈ సరదాలోనే తెలంగాణా గొడవల వల్ల మా నాన్న వాళ్ళ ప్రయాణం కూడా పోస్ట్ పోన్‌ అయింది ...


నవంబర్ హమ్మయ్య అని ఊపిరి తీసుకునేలోపు మా నాన్న చిన్నపిల్లాడిలా నేను మా ఊరికి వెళ్ళిపోవాలంతే అని పట్టు బట్టి టికెట్టు కొనుకుని ఆదరబాదరా మా ఊరి కి చెక్కేసారు ,వాళ్ళు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళూ వెళ్ళిపోయేసరికి నాతో పాటు మా బాబు ,నా ఇల్లు  కూడా బావురు మన్నాయి ...మళ్ళీ దేవుడా అని పిలిచే లోపు 
దీపావళి వచ్చింది మా ఫ్రెండ్సుతో సరదాగా హాయి హాయిగా చేసుకున్నాము ...మా సొసైటీలోని పెద్ద పిల్లలందరూ "అన్నా" కి మద్దతుగా ఏమి కాల్చడం మానేసారు ...చిన్న పిల్లలు తమవంతు కృషి చేసి దీపావళిని ఆనందపెట్టారు ......హమ్మయ్య నవంబరు అయిపోతోంది అనుకునే లోగా....మా వారు మా ఊరి టికెట్టు నా చేతిలో పెట్టి అర్జంటు పని ఉంది ఒకసారి అటుగా వెళ్ళిరా అన్నారు ఎగిరిగంతేసి తుర్రు మని మళ్ళీ మా ఊరి రైలెక్కేసి ...మా అత్త ని , మావగారిని చూసేసి వాళ్ళందరినీ హడావుడి పెట్టేసి ..నా పని నేను చూసుకుని మళ్ళి రైలు దొరకలేదు నా తొందరకి అందుకే బస్సెక్కి మా ఊరు వచ్చి ...మా వారికి గర్వంగా నా పనులన్నీ అయిపోయాయని చెప్పేసి ఒక నవ్వు విసిరేసి నా పని లోకి మళ్ళీ దూరిపోయాను ..ఇంతలో  మా ఫ్రెండ్సు వనభోజనాలు , పికినిక్కులు అన్నారు మళ్ళీ కెవ్వ్ మని కేకేలేసుకుంటూ పిన్న, (పెద్దలు లేరు ఎందుకంటే మాకు మేమే )పిల్ల ,జెల్లా అందరం కారులేసుకుని గాల్లో తేలినట్టుందే అనుకుంటూ బీచులకి  వెళ్ళి ,రైడు లకి వెళ్ళి సముద్రాల్లోకి దూకి (అంటే సేఫ్టీ జాకెట్టు ఉన్నాయ్ లేండి )  ,అక్కడున్న మట్టి ఒకళ మీదకి ఒకరు విసురుకుని ..పనిలో పనిగా మా పిల్లల ఒళ్ళంతా పట్టించేసి ...అలిసిపోయి ..గెస్ట్ హౌస్ చేరి అక్కడ వాళ్ళు పెట్టిన వింత పదార్ధాలని ఆహా ,ఓహో ,అమోఘం అని మెచ్చేసుకుని తినేసి , రాత్రుళ్ళు కబుర్లు ,కాకరకాయలు అనుకుని ..రెండు రోజుల తర్వాత అందరం నల్లగా , వింత లోకం నుంచి వాళ్ళలా ఈసురో ఇంటికి వెళ్ళాలా అనుకుంటూ మా ఇంటి దారి పట్టాము ..అందులోనించి తేరుకుని ఫోటోలు చూసుకుని మురిసి పోయి ఫేసుబుక్కుల్లోను ,మా సీక్రెటు గ్రూపుల్లోను పెట్టేసుకుని మూడు కామెంటులు, ఆరు లైకులతో ..... మెల్లగా, తొందరగా, గజిబిజిగా ,గందరగోళంగా 


డిసెంబరు లోకి వచ్చేసాము  ..హమ్మయ్య ఇంక కొన్ని రోజులలో  సంవత్సరం అయిపోతుంది ..ఈ నెల (దేవుడు )ఎవరిని పంపుతాడో చూడాలి , అనుకుంటూ ఉన్నాను ...మొదట నాందిగా నా చిన్న నాటి స్నేహితురాలు వచ్చింది ..అది వెళ్ళిన కొన్ని రోజులకి ..నేను ఫేసుబుక్కులో రాసిన రాతలని ,కోతలని చదివి ..ఎంజాయ్ చేసిన మిత్రులందరూ ఒక బ్లాగు బాగు అన్నారు ...అవునా నాకంత ఉందంటారా అని హాస్చర్య పడే లోపు మన జ్యోతి  గారు ...రాయ్ రాసేయ్ అని నాకు ముందుకి దారి చూపించారు  అప్పటి నుంచి నేను మురిసిపోయి ఆవిడ సహకారంతో ఈ నెల రెండో వారం నుంచి తెగ రాయడం మొదలుపెట్టేసాను ...హమ్మయ్య ఇంక నాకు బ్లాగులోకి వచ్చే అథిదులతో సందడి సందడి అనుకునే లో....ట్రింగ్ ట్రింగ్ ..ప్రియా ఫోను తియ్ ...ప్రియా ఫోను తియ్ ...అని మా వారి నుంచి ఫోను వచ్చింది ..హేయ్ నా చిన్ననాటి స్నేహితుడు వస్తున్నాడు వాడికి రాత్రికి భోజనానికి వస్తున్నాడు నువ్వు చేసే నా కిష్టమైన వన్నీ చేసి ఉంచు అని చెప్పారు ..అప్పటికే లేట్ అయింది ఎలా అని అడిగో లోపు ఖంగారు లేదు నెమ్మదిగా చేయ్ అన్నారు , అభయ హస్తం ఆమడదూరం లో కనిపించగానే ,నేను వంట చేయడం మొదలు పెట్టాను . (ఇంతలో చెప్పుకోవలిసిందేంటంటే ఇలా అకస్మాత్తుగ అథిధులు వస్తే ఏం చేయాలో అని ఖంగారు లో నేను గిన్నెల తో , కూరలతో కలగాపులగం చేసేస్తాను ..ఆ టైం కి ఇంట్లో మావారు ఉంటే తను నాకు సాయం చేస్తారు ..తనతో పాటే వస్తున్నారు అంటే మాత్రం నెమ్మదిగా కారుని 20 స్పీడు లో తీసుకువస్తారు )..మొదట్లో నేను చేయలేనని, కూడా ఉండి తొందర పడే మా వారు ..ఇప్పుడు నా మీద నమ్మకం తో హాయిగా ,నిశ్చింతగా ఊరంతా వాళ్ళని తిప్పి తీసుకొస్తారు ,(మా వారికన్న hyd  ఆటోవాళ్ళు నయం ).


అతను రావడం తోనే మా ఇంట్లో గల గల మొదలయ్యింది వదినా వదినా అని సొంత మరిదిలా మాట్లాడుతాడు .. ఆత్మీయంగా అనిపిస్తుంది ..మా అత్తగారి కుటుంబం , వాళ్ళ కుటుంబం చాలా ఏళ్ళు పక్కపక్కనే  కలిసి ఉండటం వల్ల వాళ్ళందరూ అన్నదమ్ముల్లా పెరిగారుట . వాళ్ళ చిన్నప్పటి విషయాలు మాట్లాడుతూ ,మధ్య మధ్యలో మా వారి గురించి చెపుతూ ,అల్లరి , ఆటలు అన్ని ...మధ్యలో నేను కూడా తనతో గలగల ...మా వారు మాత్రం నిశ్శ బ్ధం గా మా మాటలు వింటూ కూర్చున్నారు ..టైం చూస్తే తేదీ దాటేలా ఉంది ...హమ్మో అని గబ గబా భోజనాలు కానిచ్చి ...అందరూ నిద్రలకి ఉపక్రమించాము. తెల్లారినతర్వాత  ఈ సారి కుటుంబం తో రావాలని మాట తీసుకుని పంపించాము . ...క్రిస్ట్ మస్  సెలవులు ఇచ్చారు ఈ నాలుగు రోజులు సరదాగా మా వాడితో ఆడుకుందామని అనుకున్నాను ..మొన్న పొద్దునే లేచి మా వారిని ఆఫీసుకి పంపిన తర్వాత , నెమ్మదిగా పనులు చేసుకుని వంట గురించి ఆలోచించే లోపు మా వాడు పిజ్జ పిజ్జా అన్నడు ..ఇంట్లోది నచ్చదుగా ...సరే అని బయటకి వెళ్ళి పార్సిల్ తెచ్చుకుని తినే లో ..టింగ్ ..టాంగ్ ... ఈ సారి కాలింగ్ బెల్..డోర్ తీసి చూస్తే మా క్రింద్ 6 వ(మాది 9)  ఫ్లోర్ లో ఉండే ఆమె తన చిన్న బాబుతో నిల్చుని చూస్తోంది ...పెద్ద పరిచయం కూడా లేదు ఎప్పుడో రెండు నెలల క్రితం గ్రౌండ్ ఫ్లోర్ లో చూసాను ... ఎందుకు వచ్చిందబ్బా అనుకుంటూ ...లోపలికి రమ్మని ఆహ్వానించి ..ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత ఇంటి తాళాలు పాడేసుకున్నాను సాయంత్రం మా వారు వచ్చేవరకు మీ  ఇంట్లో ఉంటాను అని అంది ..సరే దానికేం భాగ్యం ఉండండి అని చెప్పి వాళ్ళ బాబుకి పాలు కలిపి ఇచ్చి ..తన భోజనం గురించి అడిగాను ...లేదు తిని వచ్చాను అని చెప్పింది ..పర్వాలేదని నా దాంట్లో షేర్ చేసి ..వాళ్ళ బాబుని మా రూములో పడుకోబెట్టి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము ,ఇంతలో వాడు లేచి కెవ్వున ఏడవడం మొదలు పెట్టాడు .


ఏంటంటే వాడికి ఉయ్యాల అలవాటు అని తేలింది ...సరే సరే అని నా పాత చీర ఒకటి హాల్లో వేలాడ దీసి నా బుల్లి అథిధి ని పడుకోబెట్టాము .ఏమిటో ఎప్పుడు లేనంత నిద్ర వచ్చింది నాకు కూడా ..ఆమెకేమో అలవాటు లేదుట , నేను తనని ఎలా వదిలేసి నిద్రపోను , పైగా అపరిచితురాలు"?" అలాగే జోగుతూ మధ్య మధ్యలో టి వీ చానేల్స్ మారుస్తూ కాలక్షేపం చేసాను ...మావాడు నిద్రపోవడం వల్ల నాకు పెద్ద బాధ లేకుండా పోయింది ..లేదంటే వాడి ప్రశ్నలతో ఆమెని వెంటనే తరిమేసేవాడు ...సాయంత్రం అవుతుండగా వాళ్ళాయన వచ్చి వంద ధన్యవాదాలు చెప్పి ..వెళ్ళిపోయారు ...నిన్న మాత్రం ఎట్టి పరిస్థితులలో బయటకి వెళ్ళకూడదు అని అనుకుంటే నా ఫ్రెండు ఒకామే తన పిల్లలని మా ఇంట్లో కాసేపటికి వదిలి తను పని మీద బయటకి వెళ్ళి సాయంత్రం వచ్చి తీసుకు పోయింది ...హమ్మయ్య కాసేపు ఊపిరి తీసుకుందాం అనుకుంటుండగా ...



 ఇంకో ఫ్రెండు కూతురు ఫోను చేసి నాకు ప్రోజెక్ట్ లో హెల్ప్ కావాలంది ...నాకు కూడా అంతకన్నా ఏం కావాలి అని పిలిచి కూర్చోబెట్టి నాకు తెలిసిన సబ్జెక్టే అవ్వడం వల్ల్ల వివరించి చెప్పి, కొంత నేనుకూడా మళ్ళీ గుర్తు చేసుకున్నాను ......హమ్మయ్య ఇన్నాళ్ళకి నాకో స్టూడెంట్ దొరికింది ........



నా డిసెంబరు మాత్రం నాకు సుదీర్ఘంగా జరిగింది  ఎందుకో   ...అరెరె మా ఫ్రెండ్సు పిలుస్తున్నారు 31 "celebrations కి ప్లానింగ్ చేయాలి ...ఉంటామరి ...ఈ సంవత్సరమంతా నా ఇల్లు ఇలా నిండి పోయి ఆనందించింది .


 కొన్ని గంటలలో   కొత్త సంవత్సరం ...కొత్త కొత్త ఆశలతో రాబోతోంది ...ఏమి జరుగుతుందా అని ఆత్రుత గాను ఉంది ..నాకే కాదు ...బహుశా మీ అందరికి కూడా అలానే ఉండి ఉంటుంది ... మన "countdown మొదలయింది ...నేనైతే రేపటి నుంచి బిజీ, అందుకే మీ అందరి కి ముందుగానే










                                          మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 










4 comments:

  1. post super priya
    I Wish you very very Happy new Year in advance

    ReplyDelete
  2. :( ... but anyway,super duper like for ur writing

    ReplyDelete
  3. పోస్ట్ బాగుంది .
    మీకు హపీ న్యూ ఇయర్ .

    ReplyDelete
  4. చాలా బాగుంది...హ్యాపీ న్యూఇయర్ ప్రియ గారు....

    ReplyDelete