Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Monday, December 12, 2011

షాపింగ్ పంచ్


హే ...మన షాపులో (ఎప్పుడు కొనే )50% "discount పెట్టారు త్వరగా వెళ్ళు ..స్నేహితురాలి ఫోను రాగానే ...
why should boys have all the fun ...అనుకుంటూ మేఘాల్లో తేలుతూ వెళ్ళింది ...
పార్క్ చేసి అన్ని చెక్ చేసి మొబైల్ డిక్కి లో పెట్టి ..షాపులో వేగంగా దూసుకు వెళ్ళింది ..
నచ్చినవి తీసుకుంది ...బిల్ పే చేయాలిగా ...మరి పర్సేది ..తెచ్చానే ..మరి ..హా గుర్తొచ్చింది ..మొబైల్ తో పాటు
డిక్కీలో ఉంది ...పార్క్ చేసిన చోటుకివస్తే తాళాలు మాయం ..మరి అవేవి ...హు ..
అవి కూడా సేఫ్ గా డిక్కిలో ..అన్నమాట..తక్షణ కర్తవ్యం ...
ఫోను చేయాలి ఎవరికి .???(భర్తకి మాత్రం కాదు )..ఫోను లేదు ....పైసాలేదు ..కానీ దగ్గరలో మెకానిక్ షెడ్ ఉంది ..
అతని ని పిల్చుకువచ్చి ..ఇద్దరు కలసి సాయం పట్టి తీసుకు (మోసుకు )పోతున్నారు ..దారిలో అందరి సహజమైన ఆరా...
ఒకరేమో డూప్లికేటు చేసేవాణ్ణి పిలవచ్చుకదా???
అవును పిలవచ్చు కానీ నా అందమైన బండి రెండో రోజే మాయమవుతుందేమో ...
ఇంకొకరేమో ఇంటికి వెళ్ళి స్పేరు తాళం తెచ్చుకోవచ్చు కదా ??/
తేవచ్చు కాని ఇంటి తాళాలు కూడా చక్కగా బండి తాళాలతో పాటు ....
మరొకరు పగలగొట్టేయండి హాయిగా ...హమ్మో ...ఇంకా నయం ...మొత్తానికి ఎలాగో కష్టపడి తాళం తీసాడు ..
బతుకు జీవుడా అనుకుంటూ దారి పట్టింది ..షాపు కేసి కాదు ఇంటికేసి ...
ఇంత జరిగిందిగా ఊరుకోవచ్చు గా ..."facbook లో వాల్ మీద రాసింది ...ఇంక ఏం జరుగుతుంది ...



2 comments: