Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Sunday, January 1, 2012

వందనం ...అభివందనం

నాకు పాటలంటే చాలా చాలా ఇష్టం ...

పని చేస్తున్నా, ఖాళీ గా ఉన్నా .......  నా చెవులు ఎప్పుడు పాటలు వింటూ బిజీగానే ఉంటాయ్ .నాలా చాలా మంది మీలో ఉండేఉంటారు కదా.మరి ఇలాంటి వాళ్ళందరూ  ఒకే చోట చేరి ఆడుకుంటూ , పాడుకుంటూ ఉంటే ఎంతో సరదాగా,ఆనందంగా, అల్లరి అల్లరిగా ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది కదూ .మరి ఇలాంటి  గ్రూపుని ఒకే తాటి పై నడపాలంటే ఎంతో సహనం, ఓర్పు నిస్పక్షపాత వైఖరి,  ఉండాలి ..ఏ విషయమైనా సూటిగా,సున్నితంగా,ఎదుటివారికి బాధ కలిగించకుండా (నొప్పింపక, తానొవ్వక అన్నట్టు ) తెలిపే మాట తీరు ఉండాలి ...అందరినీ ఆకట్టుకునే స్నేహ భావముండాలి .ఆ ఇవన్నీ ఒకే వ్యక్తిలో ఉండాలంటే మాటలా....ఓ నలుగురిని కలిపితే ఒక్కకరిలో ఈ క్వాలిటీ  కనిపిస్తాయ్ అని ఇది చదివిన వారు అనే అవకాశం ఉంది ,కాని నేను అలాంటి వ్యక్తిని కలిసాను (చూడలేదు ).

ఆ వ్యక్తి ఎవరబ్బా????

నాచరణం -మీ పల్లవి అనే పాటల గ్రూపును ఫేస్బుక్ ద్వారా మొదలు పెట్టి  నాలాంటి  పాటల పిచ్చోళ్ళకి ,ఇంకా పాటల పిపాశు లకు  ఆనందాన్ని పంచుతున్న రచయిత, కార్టునిస్టు అయిన  శ్రీ రామకృష్ణ పుక్కళ్ళ గారే ఆ వ్యక్తి...



రామకృష్ణ గారు ఈ గ్రూపు ఒక్కటే కాదు ఇలాంటి చాలా గ్రూపులను ఎంతో విజయవంతంగా నడుపుతున్నారు ...ఒక విధంగా బహుముఖప్రజ్ఞాశాలి అనే చెప్పాలి ,

నేను నా బ్లాగు మొదలు పెట్టడానికి పరోక్షంగా వీరే కారణం ....ఈ గ్రూపు ద్వారా నాకు ఎంతో మంది స్నేహితులు పరిచయమయ్యారు ....

మరి ఇలాంటి మహోన్నత వ్యక్తికి ఏమిస్తే ఋణం తీరుతుంది ...అందుకే వారినే అడిగి వారికి నచ్చి,మెచ్చిన పాటలను నేను ఈ నూతన సంవత్సర కానుకగా ...............(జ్యోతి గారి అవిడియా ఇది  )



శ్రీ రామకృష్ణ పుక్కళ్ళ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో









tellavaarakamunde palle lechindi


gaalikadupu ledu 

2 comments:

  1. వామ్మో...జ్యోతి వలబోజు గారితో కలసి మీరు ఇంత గూడుపుఠాణి చేస్తారని అసలు వూహించలేకపోయాను ప్రియ వేదాంతం గారు. నా కిష్టమైన పాటల వీడియోలతో ఓ బ్లాగ్ పోస్ట్ నూతన సంవత్సర కానుకగా అంది౦చడం చాల అమూల్యమైనది. నా ఆనందం అనిర్వచనీయమయింది. అంతే కాకుండా ఆశ్చర్యపోయాను కూడా.

    ఏదో నా సరదా తీర్చుకోవడం కోసం ఫేస్ బుక్ గ్రూపులు క్రియేట్ చేసుకున్నాను. మీలాంటి కళాహృదయం ఉన్నవారు ఆయా గ్రూపుల్లోకి వచ్చి చేరడం, మీ అభిమానం మిత్రులకు పంచి ఇవ్వడం నిజానికి నా అదృష్టంగా భావి౦చాలి.

    మీరు చూపిస్తున్న ఈ అభిమానం ఆనందం ఇవ్వడమే కాకుండా నా బాధ్యతలను కూడా పెంచుతున్నాయి. మీ అమూల్యమైన సమయంలో కొంత వెచ్చించి గ్రూపులలో ఎంతో స్నేహభావంతో మీ ఆలోచనలను మిత్రులతో పంచుకోవడం మీకు తెలిసిన విషయాలు చర్చించడం ద్వారా మీరంతా గ్రూపులకో అర్థాన్ని ఆపాదించారు.అందుకు నేను మీ అందరికి పేరుపేరునా కృతఙ్ఞతలు తెలియజేసుకోవాలి.

    నా మీద చాల ప్రశంసలు కురిపించేసారు. నేను మీ ప్రశంసలు అందుకునేందుకు అర్హుడినేనా అని నా మీద నాకే అనుమానం కలుగుతోంది. ప్రశంసలు భాధ్యతలు పెంచుతాయి. మునుపు కంటే ఇంకొంత మెరుగు పడమని ఓ హెచ్చరికను జారీ చేస్తాయి. నాలో ఏవైనా బలహీనతలు ఉంటే వాటినుండి దూరంగా పారిపోమ్మనే ప్రభోధ కూడా చేస్తాయి.

    నూతన సంవత్సరంలో నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిన మీ ఈ బ్లాగ్ పోస్ట్ కి శతకోటి వందనాలు అర్పిస్తూ మీకు కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రియ వేదాంతం గారు. :)

    ReplyDelete
  2. ఇందులో నేను అతిశయోక్తి రాయలేదు ,మిమ్మల్ని పొగడలేదు సర్ ...నేను మీ గురించి కాస్త చెప్పాను అంతే ...మన గ్రూపులో వాళ్ళందరు స్నేహశీలురు కనుకే నేను ఇలా రాయగలిగాను ...ఈ ధైర్యాన్ని మీవల్ల , జ్యోతి గారి సహకారం వల్లనే పొందగలిగాను ....నేనే మీకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను

    ReplyDelete