Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Friday, November 22, 2013

చలొరె చలొరె చల్ చల్ ...

ఎప్పటినంచో మార్నింగ్ వాక్ వాయిదా వేస్తూ 3 రోజులు క్రితం నించి మార్నింగ్ వాక్ స్టార్ట్ చేసాను ..

కానీ ఒంటరిగా వాకింగ్ బోర్ బోర్ బోర్ అని ....

పాటలు వింటూ కానిద్దాం అనుకుని ఈ రోజు వాక్ స్టార్ట్ ...ఈ రోజు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా పాడు ..ఆన్... ప్లేయర్ లో ఫస్ట్ పాట ...
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడకా , తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనకా ...బాలూగారు గొంతెత్తి మరీ ఓదారుస్తున్నారు ..
ఛత్ ..స్టార్టింగ్ స్టార్టింగ్ ఏంటీ అపశకునం ...
సాంగ్ ఛేంజ్ ...
ఆకాశగంగా ....దూకావే పెంకితనంగా ...ఇప్పుడేమో కార్తీకు ...
సాంగ్ ఛేంజ్ ...
అరె ఏమైందీ ...ఒక మనసుకు రెక్కలొచ్చి ... జానకీ మేడం మీరు కూడానా ...

సాంగ్ ఛేంజ్ ...షఫిల్ ఆన్

నిన్న చూసినా ఉదయం కాదిది ..కొత్తగా ఉంది ..

నెక్స్ట్

ఈనాడే ఏదో అయ్యింది ...

నాకేం కాలేదు జస్ట్ వాకింగ్ అంతే

నెక్స్ట్ ...

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా ...

నేననుకున్నానే ...నేననుకున్నా ...నోర్ముయ్ ..పాట మార్చు

జానకి కలగనలేదు ... ....నేను కన్నాను ..

హమ్ హై ఇస్ పల్ యహా ...

రేపు కూడా ఇక్కడే ఉంటాను ...

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ...


ఇదేలే తరతరాల చరితం ... ఇది నా తరం తోనే మొదలు ...మూసుకుని మార్చు ..

కరిగేలోగా ఈ క్షణం ...

కరగటానికి ఇదేమన్నా ఐసా ..నీ బొంద ..

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే ....

ఛేంజ్

కన్యాకుమారీ కనపడదా దారీ ....హుం గుర్ర్ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ర్


కొత్త కొత్తగా ఉన్నదీ ...చెత్తలా ఉంది

కొత్తగా రెక్కలొచ్చేనా ...రెక్కలు కాదు షూస్ వచ్చాయ్ ...నోర్మూసుకుని పని చూడు

నిజంగా నేనేనా ...ఇలా నీ జతలో ఉన్నా...

రేపటికి నువ్వుండవ్ అది గ్యారంటీ

నీ జతగా నేనుండాలి ..నీ ఎదలో నేనిండాలీ ...నీ కథగా నేనే మారాలీ

ఏమక్కర్లేదు ..

కథగా కల్పనగా కనిపించెను ...

మాషల్లా మాషల్లా ...

చుక్కలు చూపిస్తోంది రా దేవుడా ...

మెరిసేతారలదే రూపం .... నీకెందుకసలూ

మిలే సుర్ మేరా తుంహారా ...చచ్చినా పాడను ఆయాసం వస్తోంది

పరువమా చిలిపి పరుగు తీయకు ...పరుగులో ...ఒసేయ్ ఆపు ..

నమ్మక తప్పని నిజమైనా ....

ఒ మనసా తొందర పడకే ... హుం హుం మార్చు ...

ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా ...

ఈ రోజు చచ్చావ్ నా చేతిలో

ప్రియా ప్రియా చంపొద్దే ...

మన్నించవా మాటాడవా .....

పరవాలేదూ పరవాలేదూ .....


పిల్లా నువ్వులేని జీవితం ...నల్లరంగు ...

నీ మొహం చూడను రేపటి నించి ...

ప్రియా నిను చూడలేకా ...

నీ బొంద

పున్నమి లాగా వచ్చిపొమ్మనీ జాబిల్లడిగిందీ ...ఒసేయ్ ..నా వల్లకాదే నీతో

ఇకనించీ ఈవినింగ్ వాక్ తప్పదు ...

సంధ్యారాగపు సరిగమలో ....

నెక్స్ట్ ...

రేగుతున్నదొక రాగం ...ఎదలో సొదలా ...


అవును ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్టున్నారు ...కెవ్వ్వ్ ...నువ్వా రణబీరా నీ బిస్కుట్ నీకిచ్చా కదా
వస్తా నీ వెనుకా ఎటైనా కాదనకా ...

రావద్దు నీకెందుకీ వాకింగ్ గోలా ...అక్కడకి పోయి పడుకో ..ఫో ...

నిను వీడని నీడను నేనే .....
ఇప్పుడు నీతో మాట్లాడే టైం లేదు

ఊసులాడే ఒక జాబిలటా ...

సాయంత్రం మాట్లాడుకుందాం

ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకూ

అబ్బా ....ఫో ఇక్కడినించి ...

ఎదుట నిలిచింది చూడూ ....

అబ్బా ....వెళ్ళవే వెళ్ళూ ...

ఏ జన్మదో ...ఈ సంబంధమూ ..ఏ రాగమో ఈ సంగీతమూ ...

నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ....ఏంటి నీ మొహం నెక్స్ట్ ...ప్లే లిస్ట్ ఐపోయింది

నీ 20 రౌండ్స్ ఐపోయాయ్ ...
ఆ వాటం చూడు వాకింగ్ వంక పెట్టి ...పార్క్ లో పల్లీలు ఏరుకుతినే మొహం నువ్వూను పద ఇంటికి  ప్లేయర్ నన్ను వెక్కిరించింది ....

Thursday, November 14, 2013

పొరుగింటి ముచ్చట్లు- అద్భుతః




ఈ మధ్య మా బిల్డింగ్ లో వంటిల్లుకి ఏదో వాస్తులోపం వచ్చింది ..
రోజూ ఉ.మ .సా అనే క్రమ పద్దతిలో ప్రతి ఒక్కరు (పాల ) గిన్నెలు మాడ్చి మాడ్చి తమ అంకిత భావాన్ని వ్యక్తం చేస్తున్నారు .
పొద్దున్నే అగరుధూపాలు , కాఫీ గుభాళింపులు కోసం  కాకుండా, ఈ రోజు గిన్నె మాడ్చేపుణ్యం ఎవరు కట్టుకోబోతున్నారా అని చూసే రోజులొచ్చాయ్ .

ఒకరు నాది ఆడజన్మే సినిమాలోని సావిత్రి ని చూపిస్తే , మరొకరు మల్లెపూవులోని శోభన్ బాబు ని చూపిస్తున్నారు .
భలే భలే బాగయ్యిందిని గంతులేసి దావత్ పెట్టుకునేంతలోనే అన్ని సినిమాల్లోనూ ఒకేలా కనిపించే బాబూమోహన్‌ గారొచ్చారు మా వంటింటికి ...
మా గిన్నె మాత్రం... చూసావా పక్కింటి వాళ్ళని చూసి నవ్వితే ఇలానే ఉంటుంది బుచికి బుచికి అని పళ్ళికిలించింది  . :'( ..
ఘోరాతిఘోరమైన విషయం  ..మీసాల్లేని మిలట్రీ ఆఫీసర్ లాంటి ఆయనగారు  ఇంట్లో కంప్యూటర్ గేమ్స్ ఆడే సమయం లో జరిగింది .....

తిక్కరేగిందంటే నిన్ను ఉద్యోగం లోంచి తీసేస్తా అని అరుస్తూ మేనేజర్ ని బెదిరించే బక్క గుమాస్తా లాగ మా ఆయన తిట్టే  తెలుగు తిట్లకో ,  లేక fair & lovely రాసినా తెల్లబడని నా మాడిన గిన్నె కోసమో ..
లేక తనరంగుతో పోటిపడే ఈ గిన్నె చూసి పనిమానటమో , జీతం డబల్ చేయమనో చక్కగా శాంతంగా అడిగే మా పనమ్మాయ్ కోసమో నా బాధ కాదు .
ఇంకా ఎంతమంది నా గ్రూప్ లో బాకీ ఉన్నారా అని నా బాధ ...

అంతలోనే ఒక శుభవార్త తెలిసింది ..

క్రమబధ్ధమైన జీవితం ,ఒక పద్దతైన జీవనవిధానం దానికి కావలసిన ingredients,
మరియూ మనం చేసేదే కరెక్ట్ అని ఇతరులను ఒప్పించే విధంబెట్టిదనిన అంటూ ..
చెంగల్‌పట్ట్ శాంతారం లాంటి భర్త తో ఎలా నెగ్గుకు రావాలి ...
కనిపించినప్పుడల్లా కొత్తగా స్కూల్లో చేరిన వాచ్ మెన్ కొట్టే స్కూల్ గంట లాంటి నా ఫ్రెండ్ ని చూస్తే మేమే కాదు ..

మేము , మా బిల్డింగ్ పిల్లలు ఎంతో ప్రేమగా పెంచుకునే మా బిల్డింగ్ కుక్క రణ్‌బీర్  కూడా రాష్ట్ర విభజన మీటింగ్ కి తనని ఎవరో  పిలిచినట్టు పరుగులంగించుకుంటాడు .
అలాంటి రణ్‌బీర్ ఈ మధ్య మన్ను తిన్న పాములా పడుకోవడమే కాదు , పాపం రంగు తగ్గిన నల్లప్యాంట్ లా తయారయ్యాడు .
ఇది శుభవార్తా ...నీ బొంద ...అనకండి అసలు శుభవార్త ఇప్పుడు చెప్తా ..
మా సదరు క్లాస్ టీచర్ కాంతామణి గారు కూడా మా కోవలోకి వచ్చే ప్రయత్నం లో
 చక్కగా పేదరాశి పెద్దమ్మ టైప్ లో ..
కిటికీలు కడుగుతూ పొయ్యిమీద రెండు లీటర్ల పాయసం పెట్టి మర్చిపోయింది ..
(కొడుకు పుట్టినరోజు సందర్భంగా మా అందరకీ ఇద్దామనుకుందిట పాపం )
కిటికీలని తెల్లగా చేసింది కానీ ....పాపం గిన్నెని నల్లగా చేసింది ..
ఆ పాయసం మా ఇంటి పాత పనిమనిషి జుట్టులా నల్లగా నిగ నిగలాడుతోంది ...(మొన్న వాళ్ళింటికి వెళ్తే ఆ పాయసం గిన్నె చూపించింది) .
చూస్తూ చూస్తూ పాడేయలేక ..ఫ్రిజ్  లో దాచి రోజూ కొంచం కొంచం తింటూ , మా రణ్‌బీర్ కి కూడా పెడుతోందిట .
భలే భలే  రణ్‌బీర్ కి బాఘా తిక్క కుదిరిందనిపించింది ..
లేదంటే ఏదైనా పెడ్తే ...ఛీ నువ్వు నీ తొక్క లో తోటకూర పులుసు , ముద్ద పప్పు  వంటలు యక్ నాకొద్దు అని ముఖం , ముక్కు వంకర్లు తిప్పే గురుడు పార్లే -జి పెట్టినా ఆవురావురు మంటూ తింటున్నాడు . ...
అదీ శుభవార్త ...
పాలు స్టవ్ మీద పెట్టి 3-4 గంటలు షాపింగ్ చేసొచ్చే అ(మాయ)క డాక్టర్ అనూ నో  , పాలు స్టవ్ మీద పెట్టి మాడినా వాసన  రాకుండా బెడ్రూం తలుపులు వేసుకుని మరీ నిద్రపోయే సైలెంట్ (కిల్లర్ ) శైలజానో , పొయ్యి వెలిగించంగానే సిమ్‌ లోనే పెట్టాలి అనుకుంటూ హై లో పెట్టే నేనో , గిన్నె పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు ..బిగ్‌బాస్ ఐపోతే మళ్ళీ రాదు అని  తిట్టినా గుసగుస లాడినట్లుండే  మా ఛాయా నో గిన్నె మాడ్చేస్తే తప్పుకాదు కానీ ..

ఇలాంటి పద్ధతైన మనిషి చేస్తే తప్పే కాదా ....తప్పా?? కాదా?? 

నిజానికి నా ఫ్రెండ్ కాబట్టి ఆనందించకూడదు కానీ .
పొరుగిల్లు ముచ్చట్ట్లు ఎప్పుడూ అమృతప్రాయం కాబట్టి ఆనందించాలి ...తప్పదు ..
అందులోనూ "కామ్‌ గా ఉందికదా అని కోతితో కబుర్లు చెప్తే " ...
ఏం చేస్తుంది నాలానే పండగ చేస్కుంటుంది..
హుం హు ...అదిగో అప్పుడే మాడువాసన వస్తోంది ఎవరింట్లోదో కనుక్కునొస్తా ...టాటా

టిపణి (Tip ): నల్లని గిన్నెలు తెల్లబడాలంటే హార్పిక్ వాడండి ..(ఛీ యక్) ...నేను మాత్రం మట్టి , బూడిద వేసి తోమించాను. 



Wednesday, August 14, 2013

చెప్పేదేదో సరిగా అఘోరించు

ఎవరైనా మరాఠీలో మాట్లాడటం స్టార్ట్ చేస్తే చాలు ,..
వాళ్ళ చేతులవంక , నోటి వంక మార్చిమార్చి చూస్తూ ఓ పక్క మూగగా రోదిస్తూ
నేనో బదిరురాలిననే బాధ వచ్చేస్తుంది ..
మా వాడిని తీసుకొస్తుంటే ఇప్పుడే ఒకావిడ
దారికడ్డంగా ఆపేసి ... (తెలిసున్నావిడే, ఎదురు అపార్ట్ మెంట్ )
తెగ చేతులు , తిప్పేస్తూ లొడ లొడా , బడ బడా , ఒక్క సెకన్ గేప్ ఇవ్వకుండా ..
మీకొచ్చిన డౌట్ అర్థమైంది ..ఏం చేయను ఆ పరిస్థితిలో నేను గేప్ ఇవ్వాల్సి వచ్చింది ;-)
మాఝా మోఠా ముల్గా అన్నది తప్ప ఇంక వేరేది ఒక్క ముక్క అర్థం కాలేదు
హి హి హి అని వెర్రి నవ్వు నవ్వాను ..
ఆ దొంగమొహానికి తెలుసు నాకు మరాఠీ రాదు , చెప్పిందంతా గాల్లో కే వెళ్తుంది అని ..
అయినా దొరికింది లెమ్మని తెగ ఆడేసుకుంటోంది ,
నీ భాషని బాతులెత్తుకుపోనూ ..
భాషరాని వాళ్ళని ఏడిపిస్తే నరకాలు పట్టి పోతావే .
నిన్ను కుంభీపాకం లో వేస్తారే 
నీ అఘోరామొహం తగలెయ్య 

చెప్పేదేదో సరిగా చెప్పి చావు అని తిడదామనుకుని , మరాఠీలో ఏమంటారో తెలీక
విపరీతమైన అవకాశం ఇచ్చేసాను దానికి ...
అయినా ఆపదే ఒక 5 నిమిషాలు నా ఫీలింగ్స్ తో సంబంధం లేకుండా వాగి
అప్పుడు అది గేప్ ఇచ్చింది , ఊపిరి పీల్చుకుంది ..

మళ్ళీ ఆప్ చలో బారిష్ ఆనేవాలా హై అంది ..
అదేదో ముందే చెప్పి ఏడవచ్చు కదా..
ఇంత చిన్న పదానికి అంత మరాఠీనా

తెలుగుకన్నా ఎక్కువ అక్షరాలున్నట్టున్నాయ్ అనుకుని ..

Vroom Vroom Vroom స్టార్ట్ చేసేలోగా ,

ఆ ముల్గా గాడిని తీసుకొచ్చి నా వెనుక కూర్చోబెట్టింది

వార్నీ ఇదా సంగతి ,
ఆ మేడం బండి తేలేదు , అందుకని కొడుకుకి లిఫ్ట్ ఇచ్చి ఇంటిదగ్గర దింపాలి
ఈ మాత్రానికి 5 ని || పచ్చి పచ్చిగా అచ్చ మరాఠీలో వాగడం ఎందుకు
థమ్సప్ చూపించి , లిఫ్ట్ అని అడగొచ్చుగా ...ఎంకమ్మటెంకి ..నా టైం అంతా వేస్ట్ చేసింది

లాస్ట్ లో మా వాడికో పెద్ద డౌట్ వచ్చింది , అమ్మా నీకు మరాఠీ వచ్చని చెప్పలేదే ??? నువ్వు సూపర్ అమ్మా




వాళ్ళమ్మ  "సూపర్ఉమన్ " అనే ఫీలింగ్ వచ్చేసింది మా వాడికి ....
అబ్బే దాందేముందిరా తెలుగెంతో , హిందీ అంతే ..
హింది ఎంతో , మరాఠీ అంతే ...చాలా వీజీ
డోంట్ వర్రీ నే నేర్పుతాగా ..
( దీనెంకమ్మా నన్ను ఇరికించింది ,రేపే రెపిడెక్స్ కొనాలి ,దీని బండిని పక్కింటోడు ఎత్తుకుపోనూ ..)


Friday, July 5, 2013

హలో సెగట్రీ ...


ఎప్పుడు బట్టలు ఉతుకుదామన్నా ఈ నీళ్ళు ఆగిపోతాయ్.. ఖర్మ ఖర్మ ఇప్పుడు ఈ వాచిగాడిని బతిమాలుకోవాలి
హలో వాచ్ అన్నయ్యా ..
నీళ్ళాగిపోయాయి కాస్త టాంక్ నింపమ్మా ,

ఏంటీ నీళ్ళురావటం లేదా
,
మీకొక్కరికేనా ?
ఏమో నాకేంతెలుసు
..
ఓ పని చెయ్ నీ కింద
ఫ్లాట్ వాళ్ళని , ఆ పక్క వాళ్ళని , ఈ పక్కవాళ్ళనీ అడుగూ రాకపోతే అప్పుడేస్తా మోటరు ..

ఓరినీ పొగరు తగలెయ్యా
..
నీ మొహమండా, దొంగ ….నోడా అవసరం నాది

కింద
ఫ్లాట్ కి ఫోను చేస్తాను , హలో భాభీ మీ ఇంట్లో నీళొస్తున్నాయా ..

రావటంలేదండీ చాలా సేపైంది ఈ వాచ్ మెన్
ని  వేయమన్నాను ఇంకా వేయలేదు కాబోలు .

వాడి కి బాగా పొగరులా ఉందే అసలు మర్యాద
లేకుండా మాట్లాడుతున్నాడు , పైగా నన్ను ఫ్లాట్ వాళ్ళందరికీ ఫోను చేసి కనుక్కోమంటున్నాడు , ఎక్కడినించి తెచ్చారో గానీ చంపుకుతింటున్నాడు .

అవునా అలా అన్నాడా
రెండు తిట్టకపోయారా . "

ఇప్పుడు తిడతాను


హలో వాచ్ గా
..
నీళ్ళు రావటంలేదు మోటర్ వెయ్యి ,

వేస్తాగానీ అసలు కనుక్కున్నారా లేదా
?

ఆ కనుక్కున్నాను ఎవరికీ రావటంలేదు
, అయినా నీకెంత
పొగరు కాకపోతే నాకు పని చెప్తావ్, బుధ్ధిలేదా , బత్తమీజ్  కహీకా .. టప్ .. ఫోను పెట్టేసాను లేదంటే వాడు నన్ను తిరిగి తిట్టినా తిడతాడు .

One fine S
unday morning .. (అదే తెల్లారినతర్వాత …)


 
పొద్దున్నే 9. 30 కి టింగ్ ఢాం (మా కాలింగ్ బెల్ అలానే మోగుతుంది లెండి )ఎవడికో ఇంత పొద్దునే కొంపమునిగింది అనుకుంటూ తలుపుతీసి చూస్తే .. ఎదురుగా బుద్ధిమంతుడు బలరామయ్య రూపంలో బలవంతంగా ఆముదం తాగిన ఫేసుతో ఎదురుగ్గా వాచ్ బాబుతిట్లకి  మొహం వాచిన వాడిలా నాకేసి క్రూరంగా , దీనంగా , బాధగా , ఖోపంగా చూస్తున్నాడు . నా మొహం అన్ని ఆల్ఫాబెట్స్ ఆకారాలలో తిరిగి Q (?) దగ్గరకొచ్చి ఆగిపోయింది .

ఏం
మేడం నాగురించి కంప్లైంట్ చేసారు సెగట్రీ కి ..

నేనా
.. సెగట్రీ కా . ...చా గుణింతం హడావుడిగా ..లేదే ..!!!

నిన్న
రాత్రి నించి సెగట్రీ , వాళ్ళ వైఫుట్రెజరీ అందరూ ఒకరి తర్వాత ఒకరొచ్చి నన్ను తిట్టారు , నా సీట్లో నేను కూర్చోవటం లేదని ఊరంతా తిరుగుతున్నానని కూడా చెప్పారట కదా ...

ఏంటి
ఇది కూడా నేనే .... ...

ఎవరదీ
..వెనకాల నించి మా చెంగల్ పట్ శాంతారాం గారు విచ్చేసారు , ఏంటీ పొద్దున పొద్దునే వీడి నిజరూప దర్శనాలు ?

నేను
సెగట్రీకి కంప్లెంట్ ఇచ్చానని వచ్చి గొడవ చేస్తున్నాడు ...నేను సెగట్రీని చూసి 20 రోజులైంది (ఉత్తుత్తి ).

లేదు
సర్ మేడం అందరిచేతా నన్ను తిట్టిస్తున్నారు ..

లేదని
చెప్తోంది కదా అసలు సెగట్రీ ఎవరో మాకు తెలియనే తెలియదు కానీ నువ్వెళ్ళు పొద్దున్నే గోల పెట్టకు ,.

అదికాదు
సర్ నా ఉద్యోగం పోతుంది :'(

అయినా
ఇంత పొద్దున్నే గొడవకొచ్చావ్ , ఇప్పుడు పోతుంది నీ ఉద్యోగం , బుద్ధిలేదు నీకు ..బత్తమీ...

నువ్
ముయ్ ముందు ..
నేను
సెగట్రీ తో చెప్తా కానీ , నువ్వెళ్ళు

అలాగే
సర్ ..నమస్తే ..

నీకసలు
బుద్ధుందా .. నేపాలీ గాడితో నీకేంటసలు , ఎప్పుడోప్పడు కోపం వచ్చి వచ్చి నీ పీక పిసికి చంపేస్తాడు .

అరే
ఎలా కనిపెట్టారు .వాడు నేపాలీ గాడని

వాడి
50-50 కళ్ళు చూస్తే తెలియటం లేదు
..

అబ్బ
మీరు భలే తెలివైనవారండీ ..

అసలు
విషయం చెప్పు ..నువ్వు అసలు సెగట్రీ కి కంప్లెంట్ ఎందుకు చేసావ్ ?
నేనా
కంప్లైంటా ..అసలు నేను అసలు మాట్లాడందే ..ఉండండీ కిందావిడ కానీ చెప్పిందేమో అడుగుతాను , నాకీ పిచ్చి గోలేంటో అర్ధం కావటం లేదు .

హ్ల్లో
హ్లో ..భాభీ ..సారీ పొద్దునే డిస్ట్రబ్ చేసాను ..

 :) :) :)

పొద్దున్నే
వాచ్ బాబు వచ్చి గొడవ చేసాడు నేను కంప్లెంట్ ఇచ్చానని , సెగట్రీ గారిని కలవందే నేను
నేను
నిన్నకిందకి వెళ్తే వాడు లేడు , తర్వాత నేను, మావారు కలిసి బాగా తిట్టాం వాడిని , తర్వాత మన పెద్దాయన కూడా తిట్టాడు .
అవునా
..నా దగ్గరకొచ్చి గొడవ అసలు విషయం సెగట్రీ గారితో ఎలాగైనా చెప్పాలి .
నాకు
చెప్పారుగా నేను చూసుకుంటాను ..మా వారితో చెప్తాను .
మళ్ళీ
పాపం మీవారికెందుకు అనవసర గొడవ . నేనే మా వారితో చెప్తాలెండి సెగట్రీ గారితో చెప్పమని .
మళ్ళీ
మీ వారొచ్చి మా వారితో చెప్పటమెందుకు , నే చెప్తాలెండీ
మా
వారు మీ వారితో ఎందుకు చెప్తారు , సెగట్రీ కి కదా చెప్పేది ..
అదేనండీ
నేను చెప్పేది
మరి
మీ వారెందుకు మధ్యలో ..
ఎందుకంటే
సెగట్రీ మా వారే కాబట్టి ...
అయ్యా
..కెవ్వ్ ..అవునా ..నేనింకా మీ ఎదురు ఫ్లాట్ ఆయన సెగట్రీ అనుకున్నానండీ ..
హుం
..మా వారు సెగట్రీ అయ్యి 6 నెలలు అయ్యిందండీ ...
అయ్యో
అవునాండీ చారీ  :P
హేమండీ
...హి హి హి మరేమో ..నేలపైన నా గోటితో రకరకాల పిచ్చి గీతలు గీసేస్తూ (ముగ్గులు పెద్దగా రావు )...ఒక పక్క నా చీరకొంగు చింపే ప్రయత్నం చేస్తూ ...అబ్బ చిరగదేం ..దీన్నీ ...మరేమోనండీ ..

వింటున్నా ., నీ తొందర దొంగలు దొయ్యా , పోయి పోయి సెగట్రీ పెళ్ళాం తో చెప్పి నాకేం తెలియదంటావేమే ,
నాకేం
తెల్సు , మీకెంత తెల్సో నాకూ అంతే తెల్సు .

సర్సరే కాస్త జాగ్రత్త ..వాచ్ గాడు కొంచం డేంజరుగాడిలా ఉన్నాడు .మీరు మరీను మీకు అందరూ అలానే కనిపిస్తారు ,అందరూ వెధవలే ఉంటారా ఏంటీ !!!!  :/మీది మరీ పిచ్చిభయం .
అయినా
రేపటినించీ కొత్తోడు వస్తున్నాడట లెండి .


ఎందుకైనా
మంచిది సాయంత్రం వాడితో చెప్తాలే , మేం కాదు నీ గురించి కంప్లెంట్ ఇచ్చింది అని ..

సరే
మీ ఇష్టం

.................................


one fine sunday
ఉదయం (వారం తర్వాత ) ...

ఓయ్ ..నా జీనియస్ మిస్టర్ పెళ్ళాం ఒకసారి ఇటొచ్చి పేపర్ చూడు ,

"
గొడవపడినందుకు పగబట్టి చంపిన వాచ్ మెన్ "
గజగజగజగజ ..దడ దడ దడ ...హేమింటండీ ఇది ..

మరదే సారి నించైనా నా మాటవిని బుధ్ధిగా ఉంటావా...

అలాగలాగే ప్రామిస్ ప్రామిస్ మిస్ ( ఉత్తుత్తి ;-) ) 

ఆ తర్వాత ఒక వారం పాటు దొంగదారి వెతుక్కుని తిరిగా

1 సం వేచిచూచాను ..వాచ్ యముడై వస్తాడేమో అని భయం భయం గా ...లక్కీ ...రాలేదు :D



Saturday, May 25, 2013

జాగ్రత్త సుమా


హలో ...హాయ్ ఏంటి ఎక్కడికెళ్తున్నావ్ ..
( ఏట్లోకి )
ఫ్రెండి దగ్గరికా వీక్ డేస్ లో కాకపోతే నేనే డ్రాప్ చేసేవాడిని గా
 ఎండలో వెళ్తే గాగుల్స్ పెట్టుకో
(గుడ్డిదాన్ననుకుంటారేమో)
ఈ మధ్య అందరూ పెట్టుకుంటున్నారు ..
ఎందుకైనా మంచిది గొడుగు తీసుకెళ్ళు
(నవ్వుతారేమో)
ఈ మధ్య కాలం లో  గొడుగు వాడని వాడే లేడు
 బండి పై వెళ్తే హెల్మెట్ పెట్టుకో ..
( మరి నా జుట్టు ఊడితే)
జుట్టు మొలవడానికి మందులున్నాయ్, తల మొలవడానికి లేవు 
(ఈ లాజిక్ కూడా బాగుందే )..
స్పీడ్ 40 మించకు
 (అసలు స్పీడో మీటరే పనిచేయటంలేదు)
స్పీడో మీటర్ బాగుచేయించావా …
బ్రేక్ మీద ఒక చేయి వేసి ఉంచు ..
(మరి రెండో చేయి )..
ఇంకో చేతితో స్పీడ్ కంట్రోల్ చేయ్..
రోడ్డుకి ఎడమ వైపునే వెళ్ళు ..
( అసలు అటువైపు అంతా గోతులు , గొప్పులు )
రోడ్డు బాగోక పోతే ఆటో లో వెళ్ళు ..
ఆటోలో వెళ్తే వాడి నంబర్ SMS చేయ్
(వాడు ఫోన్ నంబర్ ఇస్తాడంటారా ? )
నేను చెప్పేది ఆటో నంబర్ .
ట్రైన్ లో వెళ్తే లేడీస్ కంపార్ట్మెంట్ మాత్రమే ఎక్కు..
(వాళ్ళ కన్నా మగాళ్ళే బెటర్ కాస్త కూర్చోటానికి ప్లేస్ ఇస్తారు )
సీట్ గురించి కాదు , సేఫ్టీ ఆలోచించు 
రద్దీ ఉంటే కాసేపు ఆగు ..
( ఇంకో గంటకి కానీ రాదు )
కొంపలంటుకుపోయే పనులేమున్నాయ్ కనక వెళ్ళగానే ఫోను చెయ్యి ..
( చెయ్యకపోతే )
నేను చేసినప్పుడైనా ఆన్సర్ చేయ్  
రోడ్డు మీద దొరికే గడ్డి , గాదాం తినకు ..
(నేనేమైనా జంతువునా )
ఏదైనా ఐతే నిన్ను వెటర్నరీ డాక్టర్ దగ్గరకి కూడా తీసుకెళ్ళను
 నాసిరకం వి ఏవీ కొనకు ..
(అదీ ఇదీ ఒకటే కదా )
నువ్వు రోడ్డుసైడు కొన్న ఆ  చెప్పులు రెండో రోజుకే తెగిపోతాయ్ వాటి గురించి నేను చెప్పే
ది . బాటాలో కొంటా అంటే వినవు కదా 
దాహంవేస్తే పిచ్చి నీళ్ళు తాగకు .. వాటర్ బాటిల్ కొనుక్కొ ..
(ఇంక నా వల్ల కాదు )
చిన్నోడి చేయి వదలకు ..
(వాడు పట్టుకోనివ్వాలిగా)
వాడు వదిలించుకున్నా , నువ్వు వదలకు 
తెలియని వాళ్ళతో పరిచయం పెంచుకోకు 
(నా మొహం లా ఉంది , అప్పుడే కదా వాళ్ళు పరిచయస్తులు అవుతారు)
ఎవర్ని పడితే వాళ్ళని నమ్మకు ..
(మిమ్మల్ని కూడా అలానే నమ్మాను : P)
అందరూ నాలా ఉండరు ….
నిజమే నిజమే …
మీకు మామీద ఉండే అంత కేరింగ్ మాత్రం ఎవరికీ ఉండదు :) ♥
 మీ ఇంట్లో ఉన్నారా ఇలాంటి వారు ?
పదే పదే జాగ్రత్తలు చెప్తుంటే  వినడానికి విసుగేసినా , ఆలోచిస్తే అర్ధమవుతుంది , ఆనందంగానూ ఉంటుంది ..