Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Monday, March 19, 2012

నీ కంటి నీటి ముత్యమా

అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ...సైజు లో మనకన్నా చిన్నగా ఉన్నాయి కదా అని ఎవరిని ఇన్సల్టు చేయకూడదు అర్ధమైందా !!.....

అర్ధమైందమ్మా ....

కథ ఐపోయింది....

కథ కంచికి మనం నిద్రకి ...సరే ఇంక పడుకో ...

అమ్మ నేను నిన్ను ఒక కొచ్చెను వేస్తాను ....ఫీల్ అవ్వవు కదా !! అడగనా?

అడుగు నాన్నా ...ఫీల్ అవ్వను .

నిన్న నన్ను ఎందుకు కొట్టావ్ ? 

మేథ్స్ సరిగా చేయటం లేదు ..దిక్కులు చూస్తున్నావ్ అందుకే ...

నన్ను కొట్టినపుడు ..నేను బాగా ఏడ్చాను కదా ...నీకు కొంచం కూడా బాధగా అనిపించలేదా ?

నా బంగారం సారీ రా ...నాన్నా...

అమ్మా...ఏడుస్తున్నావా ..నువ్వు ...

అబ్బే....లేదే.... లేదురా ....నేను ఏడవటం లేదు నాన్నా ...(కళ్ళు తుడుచుకుంటూ )

సారీ అమ్మా ఇంకెప్పుడూ ...ఇలా అడగను ...(ఏడుస్తూ)

ఎందుకు ?

ఎందుకంటే నువ్వు ఏడిస్తే నేను చూడలేను ...నాకూ ఏడుపు వచ్చేస్తుంది అమ్మా ....సారీ  




Sunday, March 18, 2012

ఎదురుచూపులో ఇంత తీపని తెలియలేదు మునుపు



అప్పుడప్పుడూ ఫోను చేస్తావా....పోనీలే 

కనీసం నేను చేసినప్పుడైనా మాట్లాడు అని చిరుకోపంతో సాగనంపే ఆయన 

ఆత్మీయంగా ఆహ్వానించే అందమైన పెంకుటిల్లు ...






బంగారు వచ్చావా అని నవ్వుతూ చూసే బామ్మా,తాతయ్యల ఫోటో ...

దూరప్రయాణం చేసి వచ్చావు కాస్త సేద తీరు అనే తీయని కొబ్బరి నీళ్ళు ...

హాయిగా కావలిసనన్ని నీళ్ళు వాడుకో అని చల్లని నీరునిచ్చే బావి..... 

మా కష్టాలు నీకు వద్దు ....దీర్ఘసుమంగళీభవ,సుఖీభవ అని దీవించే నా సీతారాములు ....

అంతులేని గారం చేసే నాన్న(లు)....

అలకలు తీరుస్తూ అంతలోనే చిన్నగా కసిరే అమ్మ(లు)..

అక్క ...అ
క్కా అంటూ అటూ ఇటూ కూర్చుని కబుర్లు చెపుతూ ...చెల్లెళ్ళూ ,తమ్ముడూ....


ష్ఠా చమ్మా ఆడుతూ ..దొంగాటలాడుతూఅంతలోనే ..గొడవపడుతూ...

హాయిగా నవ్వుతూ అలా పెరటిలోకి నడిస్తేఇప్పటికైనా గుర్తొచ్చామా అని అడిగనట్లనిపించే సంపెంగలు , 
మల్లెలు , జాజులు ,గన్నేరులు .... పూచిన మొక్కలు 

అయ్యో నువ్వొచ్చేప్పటికి పువ్వులు లేవే అని జాలిగా చూసే పొగడ చెట్టు ,....

హమ్మయ్య వచ్చావా అని నిర్మలంగా నవ్వే ఇంటి ముందు చెరువు .....




నువ్వు కూడా నాలాగే కళ కళ లాడుతున్నావ్ అని నిండుగా రామచిలుకలతో నవ్వే రావిచెట్టు ..

పాములు వచ్చే లోగా కోసుకుపో అని విచ్చుకున్న మొగలి పువ్వు ...

గోధూళి వేళ ఇంటికి చేరే గోవులని ....గోపాలులని ...గోపికలని పలకరించి వచ్చేలోపు ...

అంతలోనే చీకటి పలకరిస్తే ....

చిరుగాలికి గల గల మనే ఆకుల సవ్వడి వింటూ....

ఆరుబయట వెన్నెల్లో మడతమంచమేసుకుని ...


అక్కడొకటి , ఇక్కడ ఇంకోటి అని అల్లరి ఆదిత్యతో చుక్కల లెక్కలు చూస్తుంటే...

ఆవకాయ్ అన్నం ఎవరికి కావాలోయ్ అని బాబాయ్ పిలిచే ఒక్క కేక కి 

ఉరుకుల పరుగులతో చేరుకుని కంచం ఖాళీ చేసి ..నాదంటే నాది అని ఆవకాయ్ ముక్క లాక్కొని ...

హే నేనే గెలిచా అని అనుకుంటూ ఉండగా(అలవాటుగా ఎప్పుడూ నేనే గెలుస్తా ).....

నాన్న విసనకర్ర్తతో నెమ్మదిగా వీచుతూ ఉండగా....

అమ్మ తన మనవడికి చెప్పే కథలు ,కబుర్లు ....జోల పాటలు హాయిగా వింటూ....

ఆవలింతలొచ్చి అలానే పడుకుంటే .....మంచి కలల నిద్రలే  


అయ్యో అప్పుడే తెల్లారిపోయిందే అనుకుని ...

ఆదరా బాదరా ఎర్ర బస్సెక్కి కోనసీమ అందాలు చూస్తూ ప్రయాణం ...
ఒరేయ్ అత్తొచ్చిందిరా ......అని తనపిల్లలని హడావుడి చేస్తూ ...

అంతలోనే ఆత్రంగా , ఆత్మీయంగా  ...నేను లేని 364 (1/2)రోజుల బాకీ ఈ ఒక్కపూట లో తీర్చుకోవలనే ఆరాటం అన్నా ,వదినలకి 

నాకు నచ్చేవి ఇప్పటికి గుర్తు పెట్టుకుని అవన్నీ ఒకేసారి అందిస్తూ ...

నేను మారినా ...వాళ్ళ అభిమానం ఇప్పటికీ మారదు ..

ఇంకాసేపు ఉండాలని ఉన్నా ...కోనసీమ అందాలను మిస్ అవుతున్నానే అని బాధ పడుతూ ...వెనుకకి తిరిగి చూడక 

చూస్తే వెనుతిరగలేక ....మళ్ళీ వస్తాగా అని ఆశతో ...

అమ్మ (ల), నాన్న(ల)తో ...పదిరోజులు పది అరక్షణాలుగా గడిపి ఎన్నో మధురస్మృతులను పదిలంగా దాచుకునే సమయం ......

ఈ సమయం కోసం వేసవి .....
వేసవి కోసం మేము ....
మా కోసం మా ఊరు , ఇల్లు ఎదురుచూస్తూ ..............