Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Saturday, December 10, 2011

స్నేహ బంధం




నాకు నా కుటుంబం పంచ ప్రాణాలైతే ...స్నేహితులు నా ఆరోప్రాణం ,నాకు ఊహ తెలిసిన నాటి నుంచి నేను నా స్నేహితులతో కలిసి పంచుకున్నా ఆననందాలెన్నో ఉన్నాయ్ . ఎవరికైన తల్లితండ్రి ,అక్క ,చెల్లి ,అన్న ,తమ్ముడు ..అంతెందుకు కుటుంబమే లేక పోవచ్చు , కానీ స్నేహితులు లేని మనిషే ఉండడు .వాళ్ళు సన్యాసులవని ..సన్నాసులవని కనీసం ఒక్క స్నేహితుడైనా ఉంటాడు . నాతో అల్లరి ..ఆనందం ...బాధ అన్నీ పంచుకున్నారు నా స్నేహితులు . నేను డిగ్రీ చదివేటప్పుడు ..నా ఫ్రెండ్సు పేరుకి హాస్టల్ లో ఉంటున్నా తెల్లవారితే మా అమ్మ చేసే రకరకాల "tiffins కోసం పేపర్ వాడికన్నా ముందు ఉండేవారు .మా అమ్మ ఊరికెళ్ళిందా ఇంకా మా వంటిల్లు సామ్రాజ్యం అంత వాళ్ళదే ..వాళ్ళు కూడా ఏవొ ప్రయోగాలు చేస్తూ నాకు సాయం చేసేవారు. సంక్రాంతి వస్తే వాకిలంతా ముగ్గుల మయం ,హోలి వచ్చిందంటే ఇల్లంతా రంగుల మయం .Exams వస్తున్నాయంటే రాముని గుడికి ,సాయిబాబా గుడి కి ,దుర్గాదేవి గుడి కి వెళ్ళి గాట్టిగా దేవుణ్ణి ప్రార్ధించేవాళ్ళం ,మరి వాళ్ళేగా మమ్మల్ని ఆదుకునేది . వాళ్ళు కూడా బాగా కరుణ వాన కురిపించేవారు,ఆ తర్వాత మొక్కులు తీర్చే ప్రహసనం .ప్రదక్షిణాలు చేసి ,దక్షిణలు ,దానాలు చేసి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చి గేటు తీస్తూనే అమ్మా అంటూ లోపలికి పరిగెట్టేవాళ్ళం అప్పటికే మా అమ్మ tiffins తో wait చేస్తూ ఉండేది . ఆ తర్వాత సినిమాల కెళ్ళి బుర్రలో ఉన్న చదువంతా వదిలేసి ఆ పాటలు నేర్చేసుకుని ఇంటికి చేరేవాళ్ళం . final year ప్రోజెక్ట్ time లో మాత్రం అర్ధరాత్రయినా తెగ చదివేసేవాళ్ళం ,ప్రిపేర్ చేసేవాళ్ళు ఒకళ్ళు, printouts కి ఒకళ్ళు,binding చేయించడానికి ఒకళ్ళు .మళ్ళి ఏమేం చదవాలో బుక్ లో point చేసేవాళ్ళు ఒకళ్ళు ఇలా అందరం మా పనులను divide చేసి షేర్ చేసుకునేవాళ్ళం .Exams అయ్యిన తర్వాత ఇంక మా అల్లరి ఆపడం మా ఇంటి ఓనర్ తరం కూడా అయ్యేది కాదు ,ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా మాతో చేరేవాళ్ళు .చదువును continue చేయాలని వేర్వేరు చదువులకై విడిపోయినా ఇప్పటికి మా స్నేహం మా నుంచి దూరం కాలేదు .మా ఊరు వెళ్తే మాలో ఏ ఒక్కరు కనిపించినా మిగిలిన వాళ్ళ గురించి అడుగుతారు అందరు. ఇంక నా pg రోజుల్లో కూడా అల్లరి చేసేవాళ్ళం,అప్పుడు నేను కూడా hostel లో ఉండేదాన్ని ,వారం తిరిగితే ఇంటికి పరుగు , మళ్ళీ వారానికి కాలేజికి .కొన్నాళ్ళకి ఇంటికి వెళ్తాం అంటే వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు ,అప్పుడు ఎవరో ఒకళ్ళ parents ఫోన్‌ చేసి మాట్లాడి permission ఇప్పించేవారు . ఏరోజైనా బయటకి వెళ్దామంటే మా "warden ని కూడా బయటకి తీసుకుపోయేవాళ్ళం .మాదో ఆవిడదో కాని అదృష్టం కొద్ది దాదాపు ఆవిడది మా వయసే కావడం.exams కి ముందు ఒక సినిమా ..."exams తర్వాత ఒక సినిమా ,"results తర్వాత ఒక సినిమా చూసేవాళ్ళం ,అదేం చిత్రమో marks బాగా వచ్చేవి ,class లకి బాగా attend అయ్యేవాళ్ళం ,చదువుని ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు ,అందుకే దేవుడు కూడా మాకు సాయం చేసేవాడు .నాకు "exams "tension ఎక్కువ ఉండేది ఆ సమయం లో నా పక్కనే ఉండి నా క్లాసు కాకపోయినా నా ప్రెండు మాత్రం నాతో పాటు చదువుతు కూర్చునేది .


ఈ ఊరు వచ్చిన కొత్తలో అసలు ఎలారా దేవుడా అనుకుంటూ వచ్చాను ,పేద్ద సమస్య పనమ్మాయ్ దొరకడం ,మా పక్కింటామె చిటికెలో నా బాధ తీర్చేసింది ,తనను పరిచయం చేసుకుని ఒక తెలుగామెను కూడా పరిచయం చేసింది ."నీ ప్రెండు నా ఫ్రెండయితే నువ్వు నేను ఫ్రెండ్సే"గా అన్నట్లు అందరూ పరిచయమైపొయారు .కొద్దిరోజులకే అందరు మంచి దోస్తులైపోయాము.తెలియని ఊరు ,తెలియని భాష ఎలా నెట్టుకొస్తానో అని అమ్మ తెగ భయపడేది ఇప్పుడు నిశ్చింతగా ఉంది . అందరం వివిధ ప్రాంతాలు ,సంస్కృతులకు చెందినవాళ్ళమే . సాయంత్రాలు కలుసుకోవడం కాసేపు మాట్లాడుకోవడం కాసేపు జోక్స్ వేసుకోవడం ఇది మాకు రోజులో ఒక భాగం ఐపోయింది ,ఏదైనా సమస్య ఉన్నా,మనసు బాగోలేక పోయినా ఒకసారి మా ప్లేసుకి వెళ్ళి కూర్చుంటే చాలు వాళ్ళతో మాట్లాడుతూ ఆ విషయమే మర్చిపోతాము ,పరిష్కారం దొరికినా దొరకక పోయినా ధైర్యం మాత్రం వస్తుంది .మా మాటల్లో రాజకీయాలు ,పిల్లల చదువులు , సినిమాలు ..ఒకటేమిటి రకరకాల topics కలగాపులగం గా మాట్లాడేసుకుంటూ ఉంటాము .కొంత నవ్వులు ,కొంత ఓదార్పు ,కొంత వెటకారం ,చాలా మమకారం ఉన్నాయ్ మాలో. " పేరేదైనా టి.వి సీరియల్ ఏడుస్తూనే చూస్తాం " అన్నట్టు ఏదైన special ప్రోగ్రాం ఉంది అంటే అందరు కలిసి ఒకేచోట చేరుతాం .exams వస్తే మళ్ళి sharing మామూలే్. ఆ తర్వాత పిక్నిక్ లు .మధ్యలో గెట్ టు గెదర్ లు ,గుళ్ళో మహాప్రసాదాలు ,పుట్టినరోజు పార్టీలు ..మాకు కలవడానికి ఒక వంక కావాలి ,మాకు కులమతాల బేధం లేదు ,వాటితో మాకు పనిలేదు .మా వాళ్ళందరికి దూరంగా ఉంటున్నాం ,మాకు మేమే ఒక family అయిపోయాము .మా పిల్లలు వాళ్ళింట్లో ..వాళ్ళ పిల్లలు మా ఇంట్లో . ఈ స్నేహాన్ని కలకాలం ఇలాగే ఉంచాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. స్నేహితులు చాలా ఈజీగా దొరుకుతారు కానీ ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవడమే కష్టం ,స్నేహితులారా నేను తెలిసో తెలియకో మీ మనసుని బాధ పెడితే ఆ శిక్ష నాకు వేయండి మన స్నేహానికి కాదు . ఇదే నేను కోరుకునేది .

2 comments:

  1. antaa chusaanoy priya
    chaalaa baagaa raasaavu..eppudu BLOG open cheyaalsina daanavu !

    ok paravaaledu..aapakundagaa kashtapadu phalitam tappaka untundi congratulations baagaa paiki paiki raavaalani korutuuuuu mee akka..

    sunderpriya

    ReplyDelete