Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Sunday, February 17, 2013

మా ఊరి జాతర








 3 సం కి ఒకసారి సంక్రాంతి సమయం లో మా ఊరికి పక్కఊరి కోడలు ,మా ఊరి ఆడపడుచు అని చెప్పుకునే 
" గొల్లాలమ్మ " అమ్మవారిని ని తీసుకువస్తారు . 3 నెలలపాటు మా అమ్మవారికి  మా ఊరిలోనే బస , కనుమ తర్వాతి రోజు అమ్మావారిని మా ఊరివారంతా కలిసి అత్తవారింటిలో దించి వస్తారు  మరి పండగ ఒట్ఠి మనమే చేసుకుంటే ఎలాగా అందుకే చుట్టుపక్కల ఊరిలో ఉన్న మా ఊరి ఆడపడచులంతా (కూతుళ్ళు , చెల్లెళ్ళు , మనవరాళ్ళు ) వస్తారు , పండగకని ఇంటికొచ్చిన ఆడపడుచులు , కొత్తళ్ళుళ్ళు సందడితోను ,పంట చేతికొచ్చి రైతులు ,అందరూ సంతోషంగా ఉంటారు .ఇంకా ఈ జాతర కోసం పగటి వేషగాళ్ళని  , గారడి వాళ్ళ ని  , బేండ్ వాళ్ళ ని అందరినీ తెప్పిస్తారు , ఇలా వేషగాళ్ళని పిలవటం తో వాళ్ళకి కూడా కాస్త డబ్బులు చేతికొచ్చి వాళ్ళకి పండగొచ్చినట్లే    ఇంక అమ్మవారిని అత్తారింటికి పంపే ముందురోజు నుంచే జాతర మొదలవుతుంది . అంటే మా ఊరిలో ఒకటి కాదు రెండు పండగలు జరుగుతాయన్నమాట , అబ్భబ్భభ్బభ్భా ఎంథ బాగుంటుందో నేను చెప్పలేను ..మీరే చూడండి ..

సంక్రాంతి ముగ్గు
(ఫొటోకి ఫోజనుకుంటా మా చెల్లికి అంత సీను లేదని నా నమ్మకం , వాళ్ళమ్మ ,అదే మా పిన్ని పెట్టుంటుంది )

ఇది ఖచ్చితంగా మా చిన్న పిన్ని పెట్టిన ముగ్గే
(చుక్కలు లేకుండా ఏంటేంటో డిజైనులు పెట్టేస్తుంది)

చెప్పాగా నా గెస్సింగు రైటో రై్టు 
ఇలా అత్తరింటికి వెడుతూ
ఇంటికి వచ్చిన అమ్మవారికి పసుపు నీటితో కాళ్ళు కడిగి స్వాగతం 






ఇంటికి వచ్చిన ఆడపడుచుకి వస్త్రాలు
(నెలకొకసారి వస్తేనే బట్టలు పెట్టకపోతే ,ఆడపడుచు  లు నానా గొడవ చేస్తుంది .మరి అమ్మవారు 3 సం కి ఒక్కసారే వస్తుంది మరి పెట్టకపోతే ఇంకేమన్నా ఉందా ) 

ఈమె ఎల్లారమ్మ (మా ఊరి కోడలు ) 





తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
(ప్రభాత వేళ మా ఇంటిముందు, బాగుంది కదూ  )





గరగ నృత్యం (ఆ తలపై ఉన్నవాటినే గరగ అంటారు ,అమ్మవారి ప్రతిరూపం )





పగటివేషగాళ్ళు
(మా ఊర్లో ఎవరైనా మోతాదుకు మించి పౌడరు రాసుకుంటే ఈ పేరు పెట్టే పిలుస్తాం  ;-) ) 



అమ్మో కాళిక 

కాళిక కూడా ఉండే బంటు 



వీరభధ్రుడు
వీళ్ళని చూస్తే నాకిప్పటికి భయమే , కెవ్వ్ ...బేర్ర్ ....బావుర్ 





అదుగదుగో పరిగెత్తుకుంటూ వస్తోంది (గొల్లాలమ్మా)
(వెనక్కి , ముందుకి -ముందుకి వెనక్కి పరిగెట్టించి పరిగెట్టించి ఊరందరికి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది )
(రామ డోలు మేళం)








మా ఇంటికొచ్చి  కోడినిస్తావా , మేకనిస్తావా అని అడుగుతోంది
(చాలా కష్టం , ఈ కోరిక మాత్రం తీర్చలేము తల్లీ  :( ) 

ఐతే నేను అసలు అత్తరింటికి  పోనే పోను
(ఇదో వంక , పుట్టింట్లో తిష్ఠవేయటానికి )

ఈ వేప దుంగ నే మా గొల్లాలమ్మవారు 

స్మైల్ ప్లీజ్
మా బాబయ్ టెక్నాలజీ వాడేస్తున్నాడు ;-)
మళ్ళీ మూడేళ్ళకి కానీ చూడలేము కదా 



అదన్నమాట సంగతి ...మొత్తానికి నేను వెళ్ళను వెళ్ళను అంటూనే పాపం మా గొల్లాలమ్మ అత్తరింటికి చేరింది ...ఇంక మీరు కూడా దయచేయండి ...థాంక్యూ ..నాతో పాటు మా అమ్మని సాగనంపినందుకు ...టాటా :)

అన్నట్టు చెప్పటం మర్చిపోయా ....

Photo Courtesy :Sasikala Rakuduti (My Yonger Sis )

Thank You Sasi :)

Saturday, February 9, 2013

మా ఊరి వేసవి

                  మా ఊరి వేసవి 




ఇదే మా పొదరిల్లు
బాగుంది కదా , నాకు నచ్చుతుంది 

వేసవైనా సరే మా ఇంట్లో నీళ్ళ కాగులుండాల్సిందే
కాచేవాళ్ళు తక్కువ , ఖాళీ చేసే వాళ్ళు ఎక్కువ 






మా ఇంటిముందు చెరువు , కొబ్బరి తోట
రెండూ మావి కావు ...;-)



















                   మా ఇంటిపక్కనే  రామునిగుడి
               ఇది కూడా మాది కాదు , దేవుడిది 




 గుడిలో పూచే గన్నేరులు , కోయడానికి అందనంత దూరం లో 







నాకోసం ఒకటి రాలిందోచ్   :) 




ప్రశాంతమైన సాయంకాల వేళ
సాయంత్రమైతే చాలు ఎందుకో బెంగగా ఉంటుంది ...:(
నా సెలవుల్లో అప్పుడే ఓ రోజు ఐపోయిందని 




ఈ ఆట మీకు తెలుసా /గుర్తుందా ???



మా పనమ్మాయ్ పళ్ళాలు
ఇంటిముందు కళ్ళాపి అనే వంకతో మా ఇల్లు వాకిలి అంతా బంద బంద చేసి పోతుంది
ఆ పక్కనామె మా పళ్ళాలు గారి లోకల్ ఫ్రెండ్



ప్రతీఝాము కి కూసే మా ఇంటిపక్క అన్నారం  కోడి ,
అది పడుకోదు మమ్మల్ని పడుకోనివ్వదు
ఏదో ఒకరోజు మా పళ్ళాలు కి ఇచ్చేస్తా కూరొండుకుని తినేస్తుంది




చాకిరేవు బాన ఏమంది ....నీకు నాకు లడాయి లెమ్మంది
మా అందరి బట్టలు ఉతికి , నలిపి , చింపి , మా సూరమ్మ పోగులు పెట్టేది ఇక్కడే 




చెరువు అవతల నించి మా ఇల్లు ఎలా ఉంటుందా అని చిన్న ట్రయల్
ఎబ్బే సరిగా రాలేదు

మా ఇంటిపక్క పొగడచెట్టు ,
దానిష్టమొచ్చినపుడు పూస్తుంది 

పొగడపూలు ఎక్కువగా పూసేది శీతాకాలం లోనేట ...
కానీ నా కోసం మళ్ళీ పూసాయ్ ..

సన్నజాజులు ..ఇవి కూడా నాకోసమే 

మా తమ్ముళ్ళు ...నా సుపుత్రుడు
ఆ పచ్చచొక్కా వాడు (నా సుపుత్రుడు)  , తిక్కరేగి కేరమ్స్ అన్నీ గోడవతల పడేసాడు
ఇప్పుడు వాడిని దింపే పనిలో ఉన్నారు 
అప్పుడప్పుడు వేళకాని  వేళ వర్షం వస్తే ఇలా ఉంటుంది :) 



క్యూ


క్యూలో నిల్చుంటే నా టర్న్ వచ్చేపటికి లంచ్ బ్రేక్ రావడం 
నా టైం కి ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ లోకి మారటం 
మనం గుడ్డిగా నమ్మిన వాడే పేద్ద గుడ్డోడని తేలటం 
నా పేరుతో ఉన్న లెటర్స్ పక్కింటి ఎడ్రస్ కి రావటం 
హమ్మయ్య మనకీ ఆధార్ వచ్చిందనుకుంటే పేరు తప్పు పడటం 
హాయిగా రెస్ట్ తీసుకుందామంటే ఆ రోజు చుట్టాలు రావడం 
దాహం బాగా వేసిన రోజునే ఇంట్లో మంచినీళ్ళు రాకపోవటం….
బాగా నిద్ర వచ్చినపుడే మా నాన్న ఫోను చేయటం 
మంచి బిర్యాని తిందామనుకున్న రోజు ఆ బిర్యాని చెత్తగా ఉండటం 
సినిమా చూద్దామంటే అన్నీ చెత్త సిమాలుండటం
తెల్లగా ఉతికిన బట్టల్ని నా కొడుకు చక్కగా మురికి చేసి తేవడం
అవసరమైన పేపర్లన్నీ చింపేసి …."అవసరమా " అని మా వారు అడగటం
అన్నిటికన్నా ముఖ్యమైనది …
మా అపార్ట్ మెంట్ వాళ్ళంతా ఎంతో ఇష్టంగా అసహ్యించుకునే వాచ్ మెన్ ని మా సెగట్రీ ఉద్యోగం నించి పీకేయడం


ఎందుకు ఎందుకు ఎందుకు ఇన్ని కష్టాలు కట్టకట్టుకుని నాకే వస్తాయ్ ;-)