Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Saturday, May 25, 2013

జాగ్రత్త సుమా


హలో ...హాయ్ ఏంటి ఎక్కడికెళ్తున్నావ్ ..
( ఏట్లోకి )
ఫ్రెండి దగ్గరికా వీక్ డేస్ లో కాకపోతే నేనే డ్రాప్ చేసేవాడిని గా
 ఎండలో వెళ్తే గాగుల్స్ పెట్టుకో
(గుడ్డిదాన్ననుకుంటారేమో)
ఈ మధ్య అందరూ పెట్టుకుంటున్నారు ..
ఎందుకైనా మంచిది గొడుగు తీసుకెళ్ళు
(నవ్వుతారేమో)
ఈ మధ్య కాలం లో  గొడుగు వాడని వాడే లేడు
 బండి పై వెళ్తే హెల్మెట్ పెట్టుకో ..
( మరి నా జుట్టు ఊడితే)
జుట్టు మొలవడానికి మందులున్నాయ్, తల మొలవడానికి లేవు 
(ఈ లాజిక్ కూడా బాగుందే )..
స్పీడ్ 40 మించకు
 (అసలు స్పీడో మీటరే పనిచేయటంలేదు)
స్పీడో మీటర్ బాగుచేయించావా …
బ్రేక్ మీద ఒక చేయి వేసి ఉంచు ..
(మరి రెండో చేయి )..
ఇంకో చేతితో స్పీడ్ కంట్రోల్ చేయ్..
రోడ్డుకి ఎడమ వైపునే వెళ్ళు ..
( అసలు అటువైపు అంతా గోతులు , గొప్పులు )
రోడ్డు బాగోక పోతే ఆటో లో వెళ్ళు ..
ఆటోలో వెళ్తే వాడి నంబర్ SMS చేయ్
(వాడు ఫోన్ నంబర్ ఇస్తాడంటారా ? )
నేను చెప్పేది ఆటో నంబర్ .
ట్రైన్ లో వెళ్తే లేడీస్ కంపార్ట్మెంట్ మాత్రమే ఎక్కు..
(వాళ్ళ కన్నా మగాళ్ళే బెటర్ కాస్త కూర్చోటానికి ప్లేస్ ఇస్తారు )
సీట్ గురించి కాదు , సేఫ్టీ ఆలోచించు 
రద్దీ ఉంటే కాసేపు ఆగు ..
( ఇంకో గంటకి కానీ రాదు )
కొంపలంటుకుపోయే పనులేమున్నాయ్ కనక వెళ్ళగానే ఫోను చెయ్యి ..
( చెయ్యకపోతే )
నేను చేసినప్పుడైనా ఆన్సర్ చేయ్  
రోడ్డు మీద దొరికే గడ్డి , గాదాం తినకు ..
(నేనేమైనా జంతువునా )
ఏదైనా ఐతే నిన్ను వెటర్నరీ డాక్టర్ దగ్గరకి కూడా తీసుకెళ్ళను
 నాసిరకం వి ఏవీ కొనకు ..
(అదీ ఇదీ ఒకటే కదా )
నువ్వు రోడ్డుసైడు కొన్న ఆ  చెప్పులు రెండో రోజుకే తెగిపోతాయ్ వాటి గురించి నేను చెప్పే
ది . బాటాలో కొంటా అంటే వినవు కదా 
దాహంవేస్తే పిచ్చి నీళ్ళు తాగకు .. వాటర్ బాటిల్ కొనుక్కొ ..
(ఇంక నా వల్ల కాదు )
చిన్నోడి చేయి వదలకు ..
(వాడు పట్టుకోనివ్వాలిగా)
వాడు వదిలించుకున్నా , నువ్వు వదలకు 
తెలియని వాళ్ళతో పరిచయం పెంచుకోకు 
(నా మొహం లా ఉంది , అప్పుడే కదా వాళ్ళు పరిచయస్తులు అవుతారు)
ఎవర్ని పడితే వాళ్ళని నమ్మకు ..
(మిమ్మల్ని కూడా అలానే నమ్మాను : P)
అందరూ నాలా ఉండరు ….
నిజమే నిజమే …
మీకు మామీద ఉండే అంత కేరింగ్ మాత్రం ఎవరికీ ఉండదు :) ♥
 మీ ఇంట్లో ఉన్నారా ఇలాంటి వారు ?
పదే పదే జాగ్రత్తలు చెప్తుంటే  వినడానికి విసుగేసినా , ఆలోచిస్తే అర్ధమవుతుంది , ఆనందంగానూ ఉంటుంది ..


Friday, May 24, 2013

మా ఊళ్ళో ఈ వేసవి




కాకినాడ కాజా , కోటయ్య కాజా అంటారే అవి దొరికేది ఇక్కడే 

బంగారం కాదు సుమా ....

పచ్చి జీడి కాయలు 

ఆ పై వాటితో ఇవి కలిపి మా అమ్మ కూర వండిది ,
రామా ....ఏం చెప్పను సొర్గానికి కూతవేటు దూరం 
అప్పుడే కోసి బుట్టలో పెట్టాడు భలే ఫ్రెష్ ఫ్రెష్ కాయలు ,
పచ్చివే తినాలనిపించేంత గా ఉన్నాయి 


ఇవే అసలు ములక్కాడలు అంటే , దేశవాళీవి , చూడండి భలే ఉన్నాయ్ కదా 

ఇంతమంచి కూరలు అమ్ముతున్నవాడి షాప్ ఫోటో తీయకపోతే ,
నా కెమెరా కి అన్యాయం చేసినట్టు కదూ ...
ముచ్చట గొలిపే మొగలి పొత్తుకు ముళ్ళు ,వాసన ఒక అందం
ఫొటో తీసేలోపే నా చేతిని రెండు సార్లు దాని భాషలో ముద్దెట్టేసింది
(మనలో మనమాట మా వారు ఇది చూసి జాజి పువ్వా ? అని అడిగారు )

ఒకటో రెండో ఉంటాయిలే అని మా ప్రసాద్ చేత చెట్టెక్కిస్తే ,
అక్షయపాత్ర లోంచి తీసినట్టు  ఇన్ని కాయలు కోసాడు
అన్నీ మాగాయ్ పెట్టేసింది మా పిన్ని
ఎంతో ఉదారంగా ప్రసాద్ గాడి చేతిలో రెండు కాయలు పెట్టి పండగచేస్కోమంది 

మొన్ననే గా పెట్టావ్ మళ్ళీ ఇదేంటి ...అనుకోకండి
మా ఊరి ఎల్లాలమ్మ
(గ్రామ దేవత )

ఆమె ఆసీనురాలు కావటానికి అన్నీ సిద్ధం
పసుపు నీరు , చీర , పసుపు,కుంకుమ, హారతి, నైవేద్యం 

స్వాగతం 




ఇంకో గరగ వచ్చింది , ఇదే అసలు ఎల్లాలమ్మ

ఏమి నా భాగ్యము ఈ సారి రెండు రెండు అమ్మవార్లకి పానుపు వేసాము 


మా వాడు తనవంతు బాధ్యత చేసేసాడు :)

పండగొచ్చింది , పుల్ల ఐస్ తెచ్చింది
(పుల్లగా ఉండే ఐస్ కాదండోయ్ , పుల్లతో ఉండే ఐస్ )

గ్లాస్ లో పోసిస్తే తాగుతా కానీ , ఏంటిది అసియ్యంగా 


జీళ్ళు , ఖర్జూరాలు
(నోరూరుతోంది కానీ , నెత్తిమీద ఒక్కట్టిచ్చి" నీకంత అవసరమా "అంది నా అంతరాత్మ ,
 ఏం చేయను సిచ్యుయేషను బేడ్ ఆ టైం లో )

ఫొటో తీసే హడావుడిలో ఇవి కొనడం మర్చిపోయా :P 

"ఫొటోవులు తీయటమే కానీ కొనే మొహం లా ఉందా నీది "
అని చూస్తున్నవ్ కదూ ఆగు మళ్ళొస్తా
"చాల్లే సంబడం అందరూ చెప్పేదే" ఇది 

ఇదే ఎల్లాలమ్మ గుడి , ఏంటో ఈసారి " క్యూ " లో ఉన్నారు పద్దతిగా
ఏం మజా లేదు ఈ క్యూలో 








వీరభధ్రుడు ...తేడా వస్తే తాట తీసుడే 

ఈమే ఎల్లాలమ్మ , ఎంతో అందంగా , ప్రశాంతంగా ఉంది కదా
ఫొటో లో బానే ఉంటది , ఒక్కరూ వెళ్ళి చూడండి ...దెబ్బకి ఠా
కానీ చాలా మంచి అమ్మ 

హాయ్ రంగుల రాట్నం ...నేను ఎక్కుతా అంటే ,...
ఎగాదిగా చూసి ..డబల్ సీట్స్ లేవు అన్నాడు :'(
దొంగ డేష్ గాడు 

ఫొటో మాత్రమే తీస్తా ...ఏమనుకోకే ..

చాలా బొమ్మలు కొనేసా , ఫస్ట్ టైం నేను బేరం చేయలేదు తెలుసా
కానీ అన్నింటి మీదా 5 రూ తగ్గించి ఇచ్చాడు తెలుసా
(మా ఊరోడే అందుకే డిస్కౌంట్ )



వంటింటి సాధనాలు ....
ఖోపం బాగా వస్తే వీటిలో కొన్ని ఆయుధాలుగా కూడా వాడొచ్చు ;-)
(ఈ సలహా ఆడవాళ్ళకు మాత్రమే )

నేను కొనుక్కున్న వాటిలో ఒకటి ఇది 

రావులపాలెం  అరటిగెలలు 

బోడసుకుర్రు రేవు 

చాలా బాగుంది కదా ,
 ఈ ఫోటో నేను తీసా , నేను తీసా అని నేను మా వారు కొట్టుకుంటున్నాం

ఎవరు తీసారో మీరైనా చెప్పగలరా ? 






ఎన్ని ఫొటోలు తీసినా తనివి తీరదు 







                                                                         
అలా చల్లగాలికి బయటికి వెడితే ,
అక్కడ తెలిసున్న తాత కూర్చోండని ఈ కొబ్బరి చాప ఇచ్చాడు
భలే ఉంది కదా 




తాటి కల్లు రెఢీగా ఉంది , ఎవరైనా రెడీ గా ఉన్నారా
(ఇది మగవారికి మాత్రమే :P)




ఈ సారి పెద్దగా కాకపోయిన , కొంత వరకు నా సమ్మర్ హాయిగా గడిచిపోయింది... మరి మీరెలా ఎంజాయ్ చేస్తున్నారు