Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Thursday, November 14, 2013

పొరుగింటి ముచ్చట్లు- అద్భుతః




ఈ మధ్య మా బిల్డింగ్ లో వంటిల్లుకి ఏదో వాస్తులోపం వచ్చింది ..
రోజూ ఉ.మ .సా అనే క్రమ పద్దతిలో ప్రతి ఒక్కరు (పాల ) గిన్నెలు మాడ్చి మాడ్చి తమ అంకిత భావాన్ని వ్యక్తం చేస్తున్నారు .
పొద్దున్నే అగరుధూపాలు , కాఫీ గుభాళింపులు కోసం  కాకుండా, ఈ రోజు గిన్నె మాడ్చేపుణ్యం ఎవరు కట్టుకోబోతున్నారా అని చూసే రోజులొచ్చాయ్ .

ఒకరు నాది ఆడజన్మే సినిమాలోని సావిత్రి ని చూపిస్తే , మరొకరు మల్లెపూవులోని శోభన్ బాబు ని చూపిస్తున్నారు .
భలే భలే బాగయ్యిందిని గంతులేసి దావత్ పెట్టుకునేంతలోనే అన్ని సినిమాల్లోనూ ఒకేలా కనిపించే బాబూమోహన్‌ గారొచ్చారు మా వంటింటికి ...
మా గిన్నె మాత్రం... చూసావా పక్కింటి వాళ్ళని చూసి నవ్వితే ఇలానే ఉంటుంది బుచికి బుచికి అని పళ్ళికిలించింది  . :'( ..
ఘోరాతిఘోరమైన విషయం  ..మీసాల్లేని మిలట్రీ ఆఫీసర్ లాంటి ఆయనగారు  ఇంట్లో కంప్యూటర్ గేమ్స్ ఆడే సమయం లో జరిగింది .....

తిక్కరేగిందంటే నిన్ను ఉద్యోగం లోంచి తీసేస్తా అని అరుస్తూ మేనేజర్ ని బెదిరించే బక్క గుమాస్తా లాగ మా ఆయన తిట్టే  తెలుగు తిట్లకో ,  లేక fair & lovely రాసినా తెల్లబడని నా మాడిన గిన్నె కోసమో ..
లేక తనరంగుతో పోటిపడే ఈ గిన్నె చూసి పనిమానటమో , జీతం డబల్ చేయమనో చక్కగా శాంతంగా అడిగే మా పనమ్మాయ్ కోసమో నా బాధ కాదు .
ఇంకా ఎంతమంది నా గ్రూప్ లో బాకీ ఉన్నారా అని నా బాధ ...

అంతలోనే ఒక శుభవార్త తెలిసింది ..

క్రమబధ్ధమైన జీవితం ,ఒక పద్దతైన జీవనవిధానం దానికి కావలసిన ingredients,
మరియూ మనం చేసేదే కరెక్ట్ అని ఇతరులను ఒప్పించే విధంబెట్టిదనిన అంటూ ..
చెంగల్‌పట్ట్ శాంతారం లాంటి భర్త తో ఎలా నెగ్గుకు రావాలి ...
కనిపించినప్పుడల్లా కొత్తగా స్కూల్లో చేరిన వాచ్ మెన్ కొట్టే స్కూల్ గంట లాంటి నా ఫ్రెండ్ ని చూస్తే మేమే కాదు ..

మేము , మా బిల్డింగ్ పిల్లలు ఎంతో ప్రేమగా పెంచుకునే మా బిల్డింగ్ కుక్క రణ్‌బీర్  కూడా రాష్ట్ర విభజన మీటింగ్ కి తనని ఎవరో  పిలిచినట్టు పరుగులంగించుకుంటాడు .
అలాంటి రణ్‌బీర్ ఈ మధ్య మన్ను తిన్న పాములా పడుకోవడమే కాదు , పాపం రంగు తగ్గిన నల్లప్యాంట్ లా తయారయ్యాడు .
ఇది శుభవార్తా ...నీ బొంద ...అనకండి అసలు శుభవార్త ఇప్పుడు చెప్తా ..
మా సదరు క్లాస్ టీచర్ కాంతామణి గారు కూడా మా కోవలోకి వచ్చే ప్రయత్నం లో
 చక్కగా పేదరాశి పెద్దమ్మ టైప్ లో ..
కిటికీలు కడుగుతూ పొయ్యిమీద రెండు లీటర్ల పాయసం పెట్టి మర్చిపోయింది ..
(కొడుకు పుట్టినరోజు సందర్భంగా మా అందరకీ ఇద్దామనుకుందిట పాపం )
కిటికీలని తెల్లగా చేసింది కానీ ....పాపం గిన్నెని నల్లగా చేసింది ..
ఆ పాయసం మా ఇంటి పాత పనిమనిషి జుట్టులా నల్లగా నిగ నిగలాడుతోంది ...(మొన్న వాళ్ళింటికి వెళ్తే ఆ పాయసం గిన్నె చూపించింది) .
చూస్తూ చూస్తూ పాడేయలేక ..ఫ్రిజ్  లో దాచి రోజూ కొంచం కొంచం తింటూ , మా రణ్‌బీర్ కి కూడా పెడుతోందిట .
భలే భలే  రణ్‌బీర్ కి బాఘా తిక్క కుదిరిందనిపించింది ..
లేదంటే ఏదైనా పెడ్తే ...ఛీ నువ్వు నీ తొక్క లో తోటకూర పులుసు , ముద్ద పప్పు  వంటలు యక్ నాకొద్దు అని ముఖం , ముక్కు వంకర్లు తిప్పే గురుడు పార్లే -జి పెట్టినా ఆవురావురు మంటూ తింటున్నాడు . ...
అదీ శుభవార్త ...
పాలు స్టవ్ మీద పెట్టి 3-4 గంటలు షాపింగ్ చేసొచ్చే అ(మాయ)క డాక్టర్ అనూ నో  , పాలు స్టవ్ మీద పెట్టి మాడినా వాసన  రాకుండా బెడ్రూం తలుపులు వేసుకుని మరీ నిద్రపోయే సైలెంట్ (కిల్లర్ ) శైలజానో , పొయ్యి వెలిగించంగానే సిమ్‌ లోనే పెట్టాలి అనుకుంటూ హై లో పెట్టే నేనో , గిన్నె పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు ..బిగ్‌బాస్ ఐపోతే మళ్ళీ రాదు అని  తిట్టినా గుసగుస లాడినట్లుండే  మా ఛాయా నో గిన్నె మాడ్చేస్తే తప్పుకాదు కానీ ..

ఇలాంటి పద్ధతైన మనిషి చేస్తే తప్పే కాదా ....తప్పా?? కాదా?? 

నిజానికి నా ఫ్రెండ్ కాబట్టి ఆనందించకూడదు కానీ .
పొరుగిల్లు ముచ్చట్ట్లు ఎప్పుడూ అమృతప్రాయం కాబట్టి ఆనందించాలి ...తప్పదు ..
అందులోనూ "కామ్‌ గా ఉందికదా అని కోతితో కబుర్లు చెప్తే " ...
ఏం చేస్తుంది నాలానే పండగ చేస్కుంటుంది..
హుం హు ...అదిగో అప్పుడే మాడువాసన వస్తోంది ఎవరింట్లోదో కనుక్కునొస్తా ...టాటా

టిపణి (Tip ): నల్లని గిన్నెలు తెల్లబడాలంటే హార్పిక్ వాడండి ..(ఛీ యక్) ...నేను మాత్రం మట్టి , బూడిద వేసి తోమించాను. 



6 comments:

  1. హహహ... ఇలాంటావిడ మా ఇంటి పక్కనే ఒకరున్నారు.
    వారానికి మూడు సార్లు గిన్నెలు మాడ్చేస్తారండీ ;)

    ReplyDelete
    Replies
    1. హ హ హ ...మా అపార్ట్ మెంట్ మొత్తం ఇలాంటి వాళ్ళతో నిండి పోయింది ..
      మా పక్కింటాయనైతే భార్య గిన్నెలు మాడుస్తోందని , అతనే వంట మొదలెట్టాడు ఒకరోజు ..కుక్కర్ ఒక్కటే తెల్లగా ఉండేది అది కూడా మాడిందిట ..

      Delete
  2. very funny. నాకూ ఒక మాడిన గిన్నె ఉండేది. ఎవ్వరికీ చెప్పాలా.ఒక్కసారే జరిగింది అలా...అప్పటినుంచి....చాలా జాగ్రత్తగా ఉంటాను.

    ReplyDelete
    Replies
    1. నేను ఒకసారి కాదు ...చాలా సార్లు జాగ్రత్తగా ఉన్నాను అనూ గారు :D..
      కానీ ఏంటొ అలా అలవాటైపోయింది

      Delete
  3. కోక్ పోసి వేడీ చేస్తే మాడు గిన్నెలు వదులుతాయట. ఆ మధ్య కుమార్ గారు ప్రయత్నించి ఫోటోలు కూడా పెట్టారు. మీ బిల్డింగ్ జనాభాకి ఈ సలహా చెప్పండీ. కోక్ అమ్మకాలు బాగా పెరుగుతాయి. :)

    ReplyDelete
    Replies
    1. మీ ఐడియా బాగుంది ..మా జనాలు కోక్ తాగేసి కొత్త గిన్నె కొనుక్కునే రకాలు ...(నేను తప్ప ) ;-)

      Delete