Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Sunday, February 17, 2013

మా ఊరి జాతర








 3 సం కి ఒకసారి సంక్రాంతి సమయం లో మా ఊరికి పక్కఊరి కోడలు ,మా ఊరి ఆడపడుచు అని చెప్పుకునే 
" గొల్లాలమ్మ " అమ్మవారిని ని తీసుకువస్తారు . 3 నెలలపాటు మా అమ్మవారికి  మా ఊరిలోనే బస , కనుమ తర్వాతి రోజు అమ్మావారిని మా ఊరివారంతా కలిసి అత్తవారింటిలో దించి వస్తారు  మరి పండగ ఒట్ఠి మనమే చేసుకుంటే ఎలాగా అందుకే చుట్టుపక్కల ఊరిలో ఉన్న మా ఊరి ఆడపడచులంతా (కూతుళ్ళు , చెల్లెళ్ళు , మనవరాళ్ళు ) వస్తారు , పండగకని ఇంటికొచ్చిన ఆడపడుచులు , కొత్తళ్ళుళ్ళు సందడితోను ,పంట చేతికొచ్చి రైతులు ,అందరూ సంతోషంగా ఉంటారు .ఇంకా ఈ జాతర కోసం పగటి వేషగాళ్ళని  , గారడి వాళ్ళ ని  , బేండ్ వాళ్ళ ని అందరినీ తెప్పిస్తారు , ఇలా వేషగాళ్ళని పిలవటం తో వాళ్ళకి కూడా కాస్త డబ్బులు చేతికొచ్చి వాళ్ళకి పండగొచ్చినట్లే    ఇంక అమ్మవారిని అత్తారింటికి పంపే ముందురోజు నుంచే జాతర మొదలవుతుంది . అంటే మా ఊరిలో ఒకటి కాదు రెండు పండగలు జరుగుతాయన్నమాట , అబ్భబ్భభ్బభ్భా ఎంథ బాగుంటుందో నేను చెప్పలేను ..మీరే చూడండి ..

సంక్రాంతి ముగ్గు
(ఫొటోకి ఫోజనుకుంటా మా చెల్లికి అంత సీను లేదని నా నమ్మకం , వాళ్ళమ్మ ,అదే మా పిన్ని పెట్టుంటుంది )

ఇది ఖచ్చితంగా మా చిన్న పిన్ని పెట్టిన ముగ్గే
(చుక్కలు లేకుండా ఏంటేంటో డిజైనులు పెట్టేస్తుంది)

చెప్పాగా నా గెస్సింగు రైటో రై్టు 
ఇలా అత్తరింటికి వెడుతూ
ఇంటికి వచ్చిన అమ్మవారికి పసుపు నీటితో కాళ్ళు కడిగి స్వాగతం 






ఇంటికి వచ్చిన ఆడపడుచుకి వస్త్రాలు
(నెలకొకసారి వస్తేనే బట్టలు పెట్టకపోతే ,ఆడపడుచు  లు నానా గొడవ చేస్తుంది .మరి అమ్మవారు 3 సం కి ఒక్కసారే వస్తుంది మరి పెట్టకపోతే ఇంకేమన్నా ఉందా ) 

ఈమె ఎల్లారమ్మ (మా ఊరి కోడలు ) 





తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
(ప్రభాత వేళ మా ఇంటిముందు, బాగుంది కదూ  )





గరగ నృత్యం (ఆ తలపై ఉన్నవాటినే గరగ అంటారు ,అమ్మవారి ప్రతిరూపం )





పగటివేషగాళ్ళు
(మా ఊర్లో ఎవరైనా మోతాదుకు మించి పౌడరు రాసుకుంటే ఈ పేరు పెట్టే పిలుస్తాం  ;-) ) 



అమ్మో కాళిక 

కాళిక కూడా ఉండే బంటు 



వీరభధ్రుడు
వీళ్ళని చూస్తే నాకిప్పటికి భయమే , కెవ్వ్ ...బేర్ర్ ....బావుర్ 





అదుగదుగో పరిగెత్తుకుంటూ వస్తోంది (గొల్లాలమ్మా)
(వెనక్కి , ముందుకి -ముందుకి వెనక్కి పరిగెట్టించి పరిగెట్టించి ఊరందరికి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది )
(రామ డోలు మేళం)








మా ఇంటికొచ్చి  కోడినిస్తావా , మేకనిస్తావా అని అడుగుతోంది
(చాలా కష్టం , ఈ కోరిక మాత్రం తీర్చలేము తల్లీ  :( ) 

ఐతే నేను అసలు అత్తరింటికి  పోనే పోను
(ఇదో వంక , పుట్టింట్లో తిష్ఠవేయటానికి )

ఈ వేప దుంగ నే మా గొల్లాలమ్మవారు 

స్మైల్ ప్లీజ్
మా బాబయ్ టెక్నాలజీ వాడేస్తున్నాడు ;-)
మళ్ళీ మూడేళ్ళకి కానీ చూడలేము కదా 



అదన్నమాట సంగతి ...మొత్తానికి నేను వెళ్ళను వెళ్ళను అంటూనే పాపం మా గొల్లాలమ్మ అత్తరింటికి చేరింది ...ఇంక మీరు కూడా దయచేయండి ...థాంక్యూ ..నాతో పాటు మా అమ్మని సాగనంపినందుకు ...టాటా :)

అన్నట్టు చెప్పటం మర్చిపోయా ....

Photo Courtesy :Sasikala Rakuduti (My Yonger Sis )

Thank You Sasi :)

4 comments:

  1. sasi photos pampinapudu artham kaale .. now clear ga artham aindi :)

    and inko doubt.. sasi ' dayyam vastndi ' ani caption enudku petindi??

    ReplyDelete
  2. బావుందండీ మీ గొల్లాలమ్మ జాతర.మాకు ఉండేవి కట్లమ్మ,మరిడమ్మ,ముత్యాలమ్మ ముగ్గురమ్మల జాతర్లూ ఇలానే అయ్యేవి.రాత్రి మొదలయ్ ఏ తెల్లారు ఝాముకో ముగిసేవి భలే బాగుండేవి చూడ్డానికి.

    ReplyDelete
  3. మీ ఇంటి ముందు పిక్స్ అద్భుతః

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ మురళి గారు :)

      Delete