Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Monday, December 12, 2011

దేశమును ప్రేమించు

ప్రతిరోజు  ప్రొద్దునే కాలేజి కి వెళ్ళడం ,ఎండలో నిల్చుని అరగంట పాటు ప్రార్ధన  గీతాలు పాడుకుని ,ఆ తర్వాత అన్ని పాఠాలు శ్రద్దగా విని ,బుర్ర బాగా వేడెక్కిన తర్వాత నెమ్మదిగా హాస్టల్ కి చేరటం . ఇదేనా జీవితం అబ్బ స్కూలు పిల్లల కన్నా దారుణంగా ఉంది, విసుగు పుడుతోందే ఈ రోజు సరదాగా ప్రార్ధన కి నామం పెడదామా అంది అమృత ..జాహ్నవితో ..హమ్మ బాబోయ్ మన "princee కి తెలిస్తే చంపేస్తాడు అంది .ఏం పర్లేదు రోజు చేస్తామా ఏంటి ,ఈ ఒక్కరోజేగా ఏమి కాదు అంది అమృత . ఆఖరికి ఇద్దరూ ప్రార్ధన డుమ్మా కొట్టేసారు  ,ప్రార్థన అంతా అయిన తర్వాత నెమ్మదిగా క్లాస్ కి   బయలుదేరారు .ఇంకో పది అడుగులు వేస్తే క్లాసు రూమ్ కి చేరేవాళ్ళే ఇంతలో  ఓయ్ అమ్మాయిలు ఇలా రండి అనే పిలుపు వినిపించింది ,వెనక్కి తిరిగి చూస్తే ఇంకేముంది "principal !! నెమ్మదిగా అడుగులేసుకుంటూ ఆయన దగ్గరకి వెళ్ళారు ,ఎందుకు ఆలస్యమయింది అడిగారు కేంటీన్‌ లో టిఫిను తింటుంటే ఆలస్యమైంది సార్ అన్నారు , అయినా కేంటీన్‌ ఎట్టిపరిస్థితులలో  ఉ "8.20 కల్లా మూసేస్తారు కదా మరి మీరు 9 వరకు ఏంచేసారు అడిగాడాయన , దేవుడా దొరికి పోయాం ఇప్పుడేచేస్తాం అనుకుంటూ తెల్ల మొహాలేసుకుని నిల్చున్నారు .ఇలా అబద్దం చెప్పి ఎగ్గోట్టే వాళ్ళకి  ఒక పనిష్మెంట్ ఉంది నాతో పాటు రండి అని తన ఆఫీస్ రూమ్‌ కి తీసుకెళ్ళాడు . కొంపతీసి గోడకుర్చీయో వేయమనో లేక తన ఇంటికి వెళ్ళి మేడం గారు చెప్పిన పన్లన్నీ చేయమనో చెప్పడు కదా అనుకుంటూ ఆయన వెనకాలే వెళ్ళారు . ఆయన తన బీరువా తీసి అందులో ఏదో పుస్తకం బయటకి తీసి వాళ్ళ చేతిలో పెట్టాడు ,ఇది చూస్తే మీరు చేయాల్సిన పనేంటో తెలుస్తుంది అని చెప్పాడు , తెరిచి చూస్తే అందులో జాతీయ గీతాలు ,దేశభక్తి గీతాలు ఉన్నాయి, అర్ధమయింది సార్ రోజు ఇవి పది సార్లు రాసి తీసుకురమంటారు అంతేగా సాయంత్రానికల్ల ఇచేస్తాము అన్నారు ఇద్దరు కోరస్ గా .వెంటనే ఆయన ఫకాలున ఒక్క నవ్వు నవ్వి నేను అంత సులువు గా ఎలా వదులుతాను మిమ్మల్ని ..మీరు రాయడం కాదు చేయాల్సింది వీటిని  మీరు నేర్చుకుని రోజు జరిగే ప్రార్థన లో పాడాలి అని చెప్పారు .అసలు ప్రార్ధనకి నిల్చోవడమే తప్ప ఎప్పుడు బుర్ర పెట్టి విన్నది లేదు ,ఇదేమి శిక్షరా బాబు, పైగా ప్రతిజ్ఞ మర్చిపోయి చాలా రోజులయింది అనుకుని మనసులోనే గొణుక్కుంటూ క్లాసుకు చేరుకున్నారు .ఆ విధంగా తర్వాతి రోజు నుంచి క్రమం తప్పకుండా దేశభక్తి గీతాలు  నేర్చుకోవడం పాడటం మొదలు పెట్టారు ,పది రోజులకే  అన్ని గీతాలు వచ్చేసాయి . కానీ క్లాసు లో అందరు వాళ్ళ అసలు పేర్లు వదిలేసి జాతీయగీతం , దేశభక్తి గీతం అని పేర్లు పెట్టి పిలవడం మొదలు పెట్టారు . ఎక్కడ చూస్తే అక్కడ ఆ పేర్లతో ఏడిపించడం లేదంటే నడిచేవాళ్ళు ఆగిపోయి పాట పాడటం చేసేవారు . పాపం ఆ అమ్మాయిలిద్దరు అసలు పేర్లు మర్చిపోయే స్థితికి వచ్చారు . ఈ విషయం ఆ నోట ఈ నోటా "principal గారికి తెలిసింది ,ఆయనకి కూడ జాలి అనిపించింది వాళ్ళిద్దరిని పిలిచి ఏమ్మా మిమ్మల్ని అందరు ఏడిపిస్తున్నారు కదా రేపటి నుంచి మీరు ప్రార్థన లో పాడటం మానేయండి అన్నాడు .లేదు సారు ముందు మాకు బాధగా అనిపించినా ఆ తర్వాత ఆ పాటల్ల్లో ఉన్న మాధుర్యం ,ఆనందం మాకు బాగుంది ,మేమిక్కడా ఉన్నన్నాళ్ళు ఈ పాటలు పాడుతూనే ఉంటాం , అంతేకాక మాకు పెట్టిన కొత్త పేర్లు కూడా బాగున్నాయ్ సర్ మాకు ఆ పేర్లతో పిలిపించుకోవడం గర్వంగా  కూడా ఉంది .మమ్మల్ని ఏడిపిస్తున్నాం అనుకుంటూ వాళ్ళు కూడా నేర్చుకున్నారు .ఇదే "continue చేద్దాం సర్ అన్నారు .మీరు వేసిన "శిక్ష" మాకు "శిక్షణ " అయింది.ఇదే క్రమశిక్షణ అందరికి అమలు చేయండి అని ఇద్దరు ఆయనకి నమస్కరించారు . "నేను చేసిన ఈ చిన్ని ప్రయత్నం చక్కని ఫలితాన్ని ఇచ్చింది "  అని మనసులో అనుకున్నారు "principal .కానీ అందరికి ఇలా మంచి మార్గాన్నిచూపే గురువులు దొరకక పోవచ్చు .

ఇప్పుడు మన "National anthem మల్టీప్లెక్సులకే పరిమిత మయింది . ప్రైవేటు చదువులు, టెక్నో స్కూల్సు వచ్చిన ఈ కాలం లో కొందరి పుస్తకాలు చూస్తే ఆయా స్కూళ్ళ ను స్థాపించిన వాళ్ళ పేర్లు లేదా వాళ్ళకొచ్చిన రాంకులు,లేదా స్కూలు యొక్క రూల్సు  తప్ప   వేరే ఏమి కనిపించడం లేదు .ఇంక రోజు జరిగే ప్రార్ధన సంగతి సరే సరి .ఐ ఐ టి ఫౌండషన్‌ లు , ఎంసెట్ లు అంటూ పిల్లల్ని తెగ ఊదరకొడుతు ఉంటారు ,ఇంక చిన్నపిల్లల పరిస్థితి  అంతకన్నా అధ్వానం గా ఉంది ,రకరకాల కాంపిటీషన్లు అంటూ వాళ్ళకి పగలు రాత్రి తేడా తెలియకుండా అవుతోంది కానీ మనకి కొద్దో గొప్పో ఈ జాతీయ గీతాలు గుర్తు ఉండే ఉంటాయి అవి మనం అప్పుడప్పుడు వాళ్ళకి  నేర్పిస్తే కనీసం కొంతమందికైనా మన జాతీయ గీతాలు గుర్తుంటాయ్ ,అవి ఖాళీ సమయాలలో నేర్పిస్తూ ఉండండి .వాళ్ళ

1 comment:

  1. ananth sarath chandra.peddintiFebruary 8, 2012 at 10:19 AM

    Awesome raaa..... Aa sir ki call cheyya veee.. Ii blog oka print out theesi pampu..seriously he will be damn happy. Mee school lo notice board lo antinchey eerpaatu cheyyi. It will be a lesson to all the students... Nuvvu raase entertainment maathrame andaru chaduvuthunnaru... Adhe naaku kaastha baadha gaa vundhi... But u r toogood raaa.... Carry on. ..... Eeee hero ni pattinchukoku nuvvu raasthoo poo.

    ReplyDelete