Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Sunday, January 8, 2012

రోడ్లు,భవనాలు

బాబోయ్ స్కూలుకి టైం అవుతోంది ...బంగారూ త్వరగా రారా మళ్ళీ గేటు మూసేస్తారు ....
మమ్మా ఇంకా 10 నిమిషాలు టైం ఉందిగా ....
అందుకని ఇంకా ఏమన్నా ఆలస్యం చేద్దామని ఉందా,నీ వేషాలు నా దగ్గర కాదు ఇంకెవరినైనా చూసుకో .ముందు పద

అబ్బా ఈ లిఫ్టు ఎప్పటికి వచ్చేనో ,హమ్మయ్య వచ్చేసింది ,పద త్వరగా.అయ్యో షూ లేసు కట్టుకోలేదురా ,ఒక్క సెకను ఆగు ...హా కట్టేసాను  పద.అయ్యో పెట్రోలు మర్చిపోయాను ,సాయంత్రం వచ్చేటప్పుడు గుర్తుచేయి నాన్నా ,మనం ఫిల్లింగ్ స్టేషను కి వెళ్దాము .
సరే మమ్మా...అనుకుంటూ నేను, మావాడిని స్కూలుకి దింపడానికి బయలు దేరాను ....ఒక పది అడుగులు బండి కదిలిందో లేదు ...చక్కగా రోడ్డు మొత్తం తవ్వి diversion బోర్డు పెట్టారు ..మళ్ళీ బండి దారి మార్చి వేరే వీధిలో కొంత దూరం వెళ్ళెప్పటికి మళ్ళీ అక్కడ కొత్త  గా పేద్ద బుల్ డోజరు ...రోడ్డుని తవ్వుతోంది హబ్బా మళ్ళీ దారి మార్చాలి ,
కొంచం వెనక్కి వెళ్ళి వేరే సందులో రయ్ రయ్ జుయ్ జుయ్ .. పీ... పీ .ఇక్కడ ట్రాఫిక్ లేదు,హమ్మయ్యా ,మళ్ళీ ఇదేంట్రా ...ఏదో బోర్డు మమ్మ్మీ ....D I V E R S I O N ...అమ్మా ది వెర్షన్‌ టా....కాదురా డైవర్షను ..మళ్ళీ మెయిన్‌ రోడ్డుకి వెళ్దాం చూద్దాం ఏం చేస్తాం ....

అరే ఎవడ్రా వాడు రాంగ్ డైరక్షను లో వస్తున్నాడు,పోలీసు ఏమీ అనడే , నేను అడగనా అమ్మా,నోరుమూసుకుని కూర్చో ,మనం కూడా వాడి రూట్లో నే వెళ్దాం పద .

అదీ సంగతి ...పోలీసు బాబు ఊరుకున్న కారణం అటువైపు రోడ్డు కూడా చక్కగా తవ్వి ఉంచారు ...


ఎట్టకేలకి స్కూలుకి చేరుకున్నాము,మళ్ళీ వెనక్కి వస్తూ ఆ దారి వద్దురా బాబూ ఖంగారు లేదు కదా చుట్టు తిరిగి వెళ్దాం అని వేరే రూటు పట్టి వెళ్తున్నా,సగందారి  లో మళ్ళీ అదే గొడవ ,తవ్వకాలు ,గోతులు ,బుల్ డోజరులు ఇది ఈ రోజు కొత్తగా  జరిగేది కాదు ,ఏడాది మొత్తం ఇదే పరిస్థితి

లక్ష్మి దేవి వచ్చినప్పటి నుంచి (శ్రావణమాసం నుంచి )దుర్గాదేవి వెళ్ళేవరకు మాకు వర్షాలతో హోరెత్తి పోతుంది తర్వాత దీపాలతో పాటు రోడ్లు వేస్తారు ,మళ్ళీ కార్తీక మాసం లో దీపాలతో పాటు రోడ్లు కూడా ఈ బుల్ డోజర్లతో కొట్టుకు పోతాయ్ .ఒకసారి గాస్ పైప్ లైను లని , ఒకసారి వాటర్ కని ,మరో సారి డ్రైనేజ్ కని నేలంతా తవ్వి తవ్వి ఆఖరున పేచ్ వర్కు చేసి పొతారు .మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి యధావిధి గోతులు ,గొప్పులు ,ఓపెన్‌ చేసి ఉంచిన మాన్‌హోల్సు ..ఈ అస్తవ్యస్త జీవనం ప్రతి సంవత్సరం పునరావృతమవుతూనే ఉంటుంది (సత్యం సత్యం పునఃసత్యం ).ఈ మునిసిపాలిటీ వాళ్ళు మనకి మంచి చేస్తున్నారో ,చెడు చేస్తున్నారో అర్ధంకానీ అయోమయం లో ....

                  పోనీ సమ్మర్ లో అయినా ప్రశాంతత ఉంటుందా అంతే అది కూడా కరువై పోయింది తెల్లవారకుండానే  డ....డ ...డ డ ...........డా డా డా........అంటు పునాదులు తవ్వ్డ డానికి బుల్ డోజర్లు వచ్చేస్తాయి ..ఈ సారి రోడ్లు తవ్వడానికి కాదు ,పేద్ద పేద్ద అపార్ట్మెంట్లు ,భవనాలు కట్టడానికి వేసవి కాలం లోనే పునాదులు తవ్వి మొదలు పెడతారు.లేదంటే వర్షాల వల్ల పనులు ఆగిపోతాయని ,సూర్యుడితో పనిలేకుండా పనిచేస్తూ ఉంటారు .మాకు అర్ధరాత్రి వరకు మోత మోతే ,పోనీ అపార్ట్ మెంట్   ఏమైనా గట్టిగా ఉంటుందా అంటే కట్టిన నాలుగు నెలలకే గోడలు బీటలు వారి ఉంటాయ్ .అంతే కాక వాడు తవ్విన దుమ్ము,ధూళి వల్ల ఇల్లంతా మట్టి మట్టి రోజూ తుడుచుకోవడమే పని .ఉదయమే చక్కటి గాలి కోసం తలుపు తీస్తే చక్కగా అతడజను తక్కువ కాకుండా తుమ్ములొస్తాయ్ దుమ్ము వల్ల .సింగిల్ బెడ్రూం ప్లేసులో డబుల్ బెడ్రూం కట్టేసి ఇక్కడి ప్రజా ప్రవాహానికి తెగమేలు చేసేస్తున్నారు .కిచెను లోంచి హాల్లోకి దూకి అక్కడి నుంచి ఫేసు లెఫ్ట్  టర్నింగు ఇచ్చుకుంటే అక్కడ మాస్టర్ బెడ్రూం కనిపిస్తుంది ..అక్కడే ఉన్న డబుల్ కాట్ బెడ్ ఎక్కి అక్కడ ఎదురుగా ఉన్న డోరు తీసుకుని ఒక్క జంప్ చేస్తే ఒక మాదిరి మనిషి పట్టే ఒక రూం ఉంటుంది అదే బాత్రూం అన్నమాట ,మళ్ళీ సేమ్‌ రూట్ లో హాల్లోకి వచ్చి రైటుకి సేమ్‌ ప్రోసెస్ లో జంపు చేస్తే ఒకరు పడుకోవడానికి ఎక్కువగా ఇద్దరికి ఇరుకుగా ఉండే రూమే రెండో బెడ్రూం లేదంటే స్టోర్ రూం గా వాడుకోవచ్చు ఒకవేళ ఆ ఇల్లు పెద్దదిగా ఉంది అని ఎవరైనా అనుమానంగా పొరబడితే కనుక .ఇంక  బాల్కనీ గురించి ఆలోచన వద్దు అస్సలొద్దు .అల్మారాలంటే ఏమిటీ ? అని బిల్డరు అడిగే పరిస్థితి.మోసాలు చేసి  డబ్బులు గుంజే బిల్డర్లు కొందరైతే  ....ఫ్లాట్లు అమ్ముడవక పాట్లు పడే వాళ్ళు ఇంకొందరు   .
మధ్యలో అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు లోన్లు ఇస్తామని చెప్పి అసలు కన్నా వడ్డీ ఎక్కువగా గుంజే బ్యాంకు వాళ్ళు, ఎవరిని నమ్మలో తెలియని అయోమయ స్థితిలో ఫ్లాటు కొనాలా వద్దా ,అని తెగ ఆలోచించి బుర్రలు పగలగొట్టుకునే జనాలు,మళ్ళీ లోనులు తీర్చలేక,ఆ బాధలు ఆర్చేవారు లేక పట్నాల్ల్లో జన జీవనం కట్ కటా...

ప్రతి మనిషీ మరిఒకరిని దోచుకునేవాడే ..తనభాగ్యం తన సౌఖ్యం చూసుకునే వాడే 
కాంచ వోయి నేటి దుస్థితి ..ఎదిరించలేని ఈ పరిస్థితి 

("ఎదిరించవోయి" నే కాని ఇది నా లైను గా అందుకే మార్చేసా) ..స్వర్గీయ అల్లు రామలింగయ్య గారు అన్నట్లు ......ఏం చేస్తాం బొంబాయ్ లో అంతే బొంబాయ్ లో అంతే ...

హమ్మో స్కూలు టైం అయింది మళ్ళీ రూటు ప్లాను చేసుకోవాలి


2 comments:

  1. అల్లు గారు బహుస AP పైన అభిమానం తో Bombay లో అంతే అని ఉంటారు గాని...నిజానికి AP లోనూ అంతే అమ్మ....వాళ్ళు( Corporation వాళ్ళు ) ఇలా (?).. కాకుండా అలా(?)... చేస్తే బాగుండు అని మనకు అర్ధమౌతుంది ...కాని ఎందుకోమరి పెద్ద పెద్ద ఇంజినీర్లు వాళ్ళకు మాత్రం తెలియదు...బహుస Contractor ఇచ్చే money గురించి మనకు తెలియనట్లే కాబోలు !!

    ReplyDelete