Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Saturday, January 4, 2014

రంగులే రంగులు

ఎంట్రీ ఫ్రీ కదా అని ఏ ఎగ్జిబిషన్‌ కి పడితే ఆ ఎగ్జిబిషన్‌ కి వెళ్ళకూడదు ...

నిన్న జహంగీర్స్ ఆర్ట్ గ్యాలరీ కి వెళ్ళాం ..."Abstract పెయింటింగ్ ట 
రంగుల్లో షేడ్స్ తప్ప ఏమీ కనిపించలేదు /అర్థం కాలేదు ...
ఒకడైతే ఆ పెయింటింగ్స్ చూసి కళ్ళనీళ్ళు పెట్టేసుకుంటున్నాడు పాపం ఏం గుర్తొచ్చిందో !!!

చూస్తున్నవాళ్ళలో ఒక్కరి మొహం లో కూడా ఆనందం లేదేమే (మావారు )
ఏంటమ్మా ఈ పెయింటింగ్స్ అన్నీ ఒకలానే ఉన్నాయ్ (మా వాడు )
పిచ్చివాడా ...కళాపోషణుండాల్రా ....నే చెప్తా చూడు ...అదిగో ఆ కనిపిస్తోందే పింక్ కలర్ అది ఘాట్ రోడ్డు , ఆ పక్కన లేతనీలం సెలయేరు
బాగా నీలంగా ఉన్నది కొండేమో , కాదు ఆకాశం , కాదు కాదు అడవి ...
అనవసరంగా కష్టపడకండి ..పక్కరూమ్‌ చూద్దాం ...
ఇదేంటండీ అన్ని పెయింటింగ్స్ లోను మెడపట్టేసినట్టు వంకరగా ఉన్నాయ్ ,పైగా వీళ్ళకి మెదడే కనిపించటం లేదు (నేను)
అన్నీ ఒకడే వేసాడ్లే అందుకని ..
ఐతే ...నాన్నా మరేమో నేను వేసిన డ్రాయింగ్స్ కూడా ఇక్కడ పెట్టొచ్చన్నమాట ..
వద్దు నాన్నా అంత రిస్కొద్దు మనకి ..

ఏవండీ ఏంటిక్స్ కలెక్షన్‌ ట చూద్దామా ..అదెలాగుంటుందో ???
అమ్మా ఇవన్నీ మన దేవుడి మందిరం లో ఉన్నవే కొత్తగా ఏం లేవు 
ఉన్నాయ్ సరిగా చూడు ..అక్కడ కూర్చుని వాళ్ళకున్న 4 కళ్ళు మనమీద పడేసి చూస్తున్నారే ఆ అంకుల్స్ అంతా ఏంటిక్సే 
ఓహో ..మనం వాళ్ళని చూడటానికి వచ్చామా ..ఇంకా ఈ ఐడల్స్ ఏమో అనుకున్నా 

(ఏదో ఏంటిక్స్ ఎగ్జిబిషన్‌ పెట్టారు కానీ...
చూట్టానికి వచ్చిన పిల్లలు ఎక్కడ ముట్టుకుంటారో అని భయంతో అక్కడ ఉన్న జనాలు బీపీ లు తెచ్చేసుకుంటున్నారు పాపం )

అందుకే ఏదన్నా చూడాలన్నా , చేయాలన్నా దానిమీద కాస్త అవగాహన ఉండాలి ....

ఇంకా నయం ఎంట్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ....


కంగారు పడకండి కింద బొమ్మ నేనే వేసా ..హి హి హి



2 comments:

  1. హొ హోయ్...
    నిజంగా బాగుంది...
    మీరేసిన...సారీ...
    గీసిన బొమ్మ
    మరెందుకనో నాకు
    ఒక రంగుల భాండం చెదిరి...
    కళాఖండం మాదిరి...
    భలేగా వుంది...

    హి...
    హి...
    అభినందనలతో...

    ReplyDelete