Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Saturday, May 25, 2013

జాగ్రత్త సుమా


హలో ...హాయ్ ఏంటి ఎక్కడికెళ్తున్నావ్ ..
( ఏట్లోకి )
ఫ్రెండి దగ్గరికా వీక్ డేస్ లో కాకపోతే నేనే డ్రాప్ చేసేవాడిని గా
 ఎండలో వెళ్తే గాగుల్స్ పెట్టుకో
(గుడ్డిదాన్ననుకుంటారేమో)
ఈ మధ్య అందరూ పెట్టుకుంటున్నారు ..
ఎందుకైనా మంచిది గొడుగు తీసుకెళ్ళు
(నవ్వుతారేమో)
ఈ మధ్య కాలం లో  గొడుగు వాడని వాడే లేడు
 బండి పై వెళ్తే హెల్మెట్ పెట్టుకో ..
( మరి నా జుట్టు ఊడితే)
జుట్టు మొలవడానికి మందులున్నాయ్, తల మొలవడానికి లేవు 
(ఈ లాజిక్ కూడా బాగుందే )..
స్పీడ్ 40 మించకు
 (అసలు స్పీడో మీటరే పనిచేయటంలేదు)
స్పీడో మీటర్ బాగుచేయించావా …
బ్రేక్ మీద ఒక చేయి వేసి ఉంచు ..
(మరి రెండో చేయి )..
ఇంకో చేతితో స్పీడ్ కంట్రోల్ చేయ్..
రోడ్డుకి ఎడమ వైపునే వెళ్ళు ..
( అసలు అటువైపు అంతా గోతులు , గొప్పులు )
రోడ్డు బాగోక పోతే ఆటో లో వెళ్ళు ..
ఆటోలో వెళ్తే వాడి నంబర్ SMS చేయ్
(వాడు ఫోన్ నంబర్ ఇస్తాడంటారా ? )
నేను చెప్పేది ఆటో నంబర్ .
ట్రైన్ లో వెళ్తే లేడీస్ కంపార్ట్మెంట్ మాత్రమే ఎక్కు..
(వాళ్ళ కన్నా మగాళ్ళే బెటర్ కాస్త కూర్చోటానికి ప్లేస్ ఇస్తారు )
సీట్ గురించి కాదు , సేఫ్టీ ఆలోచించు 
రద్దీ ఉంటే కాసేపు ఆగు ..
( ఇంకో గంటకి కానీ రాదు )
కొంపలంటుకుపోయే పనులేమున్నాయ్ కనక వెళ్ళగానే ఫోను చెయ్యి ..
( చెయ్యకపోతే )
నేను చేసినప్పుడైనా ఆన్సర్ చేయ్  
రోడ్డు మీద దొరికే గడ్డి , గాదాం తినకు ..
(నేనేమైనా జంతువునా )
ఏదైనా ఐతే నిన్ను వెటర్నరీ డాక్టర్ దగ్గరకి కూడా తీసుకెళ్ళను
 నాసిరకం వి ఏవీ కొనకు ..
(అదీ ఇదీ ఒకటే కదా )
నువ్వు రోడ్డుసైడు కొన్న ఆ  చెప్పులు రెండో రోజుకే తెగిపోతాయ్ వాటి గురించి నేను చెప్పే
ది . బాటాలో కొంటా అంటే వినవు కదా 
దాహంవేస్తే పిచ్చి నీళ్ళు తాగకు .. వాటర్ బాటిల్ కొనుక్కొ ..
(ఇంక నా వల్ల కాదు )
చిన్నోడి చేయి వదలకు ..
(వాడు పట్టుకోనివ్వాలిగా)
వాడు వదిలించుకున్నా , నువ్వు వదలకు 
తెలియని వాళ్ళతో పరిచయం పెంచుకోకు 
(నా మొహం లా ఉంది , అప్పుడే కదా వాళ్ళు పరిచయస్తులు అవుతారు)
ఎవర్ని పడితే వాళ్ళని నమ్మకు ..
(మిమ్మల్ని కూడా అలానే నమ్మాను : P)
అందరూ నాలా ఉండరు ….
నిజమే నిజమే …
మీకు మామీద ఉండే అంత కేరింగ్ మాత్రం ఎవరికీ ఉండదు :) ♥
 మీ ఇంట్లో ఉన్నారా ఇలాంటి వారు ?
పదే పదే జాగ్రత్తలు చెప్తుంటే  వినడానికి విసుగేసినా , ఆలోచిస్తే అర్ధమవుతుంది , ఆనందంగానూ ఉంటుంది ..


4 comments:

  1. బాగుందండీ! మీరు చాలా పోజిటివ్ గా ఆలోచిస్తారనుకుంటా .

    ReplyDelete
    Replies
    1. ఇలాంటి వారు తోడుగా ఉంటే ఆటోమేటిక్ గా మనం పాజిటివ్ గా ఆలోచించేస్తాం :)

      Delete
  2. పోస్ట్ బావుందండి ... ప్రియ గారు కొన్నిసార్లు చాదస్తంగా అనిపించినా దాని వెనుక ఉన్న ప్రేమని అర్ధం చేసుకోగలిగితే బావుంటుంది కదూ

    ReplyDelete
    Replies
    1. :)థాంక్యూ శైలబాల గారు

      Delete