Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Saturday, February 9, 2013

మా ఊరి వేసవి

                  మా ఊరి వేసవి 




ఇదే మా పొదరిల్లు
బాగుంది కదా , నాకు నచ్చుతుంది 

వేసవైనా సరే మా ఇంట్లో నీళ్ళ కాగులుండాల్సిందే
కాచేవాళ్ళు తక్కువ , ఖాళీ చేసే వాళ్ళు ఎక్కువ 






మా ఇంటిముందు చెరువు , కొబ్బరి తోట
రెండూ మావి కావు ...;-)



















                   మా ఇంటిపక్కనే  రామునిగుడి
               ఇది కూడా మాది కాదు , దేవుడిది 




 గుడిలో పూచే గన్నేరులు , కోయడానికి అందనంత దూరం లో 







నాకోసం ఒకటి రాలిందోచ్   :) 




ప్రశాంతమైన సాయంకాల వేళ
సాయంత్రమైతే చాలు ఎందుకో బెంగగా ఉంటుంది ...:(
నా సెలవుల్లో అప్పుడే ఓ రోజు ఐపోయిందని 




ఈ ఆట మీకు తెలుసా /గుర్తుందా ???



మా పనమ్మాయ్ పళ్ళాలు
ఇంటిముందు కళ్ళాపి అనే వంకతో మా ఇల్లు వాకిలి అంతా బంద బంద చేసి పోతుంది
ఆ పక్కనామె మా పళ్ళాలు గారి లోకల్ ఫ్రెండ్



ప్రతీఝాము కి కూసే మా ఇంటిపక్క అన్నారం  కోడి ,
అది పడుకోదు మమ్మల్ని పడుకోనివ్వదు
ఏదో ఒకరోజు మా పళ్ళాలు కి ఇచ్చేస్తా కూరొండుకుని తినేస్తుంది




చాకిరేవు బాన ఏమంది ....నీకు నాకు లడాయి లెమ్మంది
మా అందరి బట్టలు ఉతికి , నలిపి , చింపి , మా సూరమ్మ పోగులు పెట్టేది ఇక్కడే 




చెరువు అవతల నించి మా ఇల్లు ఎలా ఉంటుందా అని చిన్న ట్రయల్
ఎబ్బే సరిగా రాలేదు

మా ఇంటిపక్క పొగడచెట్టు ,
దానిష్టమొచ్చినపుడు పూస్తుంది 

పొగడపూలు ఎక్కువగా పూసేది శీతాకాలం లోనేట ...
కానీ నా కోసం మళ్ళీ పూసాయ్ ..

సన్నజాజులు ..ఇవి కూడా నాకోసమే 

మా తమ్ముళ్ళు ...నా సుపుత్రుడు
ఆ పచ్చచొక్కా వాడు (నా సుపుత్రుడు)  , తిక్కరేగి కేరమ్స్ అన్నీ గోడవతల పడేసాడు
ఇప్పుడు వాడిని దింపే పనిలో ఉన్నారు 
అప్పుడప్పుడు వేళకాని  వేళ వర్షం వస్తే ఇలా ఉంటుంది :) 



10 comments:

  1. వావ్ మళ్ళీ ఊరు తీసుకెళ్ళిపోయారుగా నన్నూ(ఇంతకీ ఎక్కడో ఇది?)

    ReplyDelete
  2. sooper.. anniti kana, kodi ni koora vandukodaniki ichesta ani comment inka bagundi :P

    malli veldaam akdaki winter lo :)

    ReplyDelete
  3. భలే ఉందండీ :)

    ReplyDelete
    Replies
    1. థాంక్యు ప్రియ గారు

      Delete
  4. మీ ఊరు భలే ఉందండీ.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ మురళీ గారు

      Delete
  5. మీ ఇల్లు చాలా బాగుందండీ, ఇప్పుడే మీ బ్లాగు చూడటం. బాగున్నాయి మీ ఫోటోలు,మీ కబుర్లు..

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ చిన్ని గారు :)

      Delete