 |
| కాకినాడ కాజా , కోటయ్య కాజా అంటారే అవి దొరికేది ఇక్కడే |
 |
| బంగారం కాదు సుమా .... |
 |
| పచ్చి జీడి కాయలు |
 |
ఆ పై వాటితో ఇవి కలిపి మా అమ్మ కూర వండిది ,
రామా ....ఏం చెప్పను సొర్గానికి కూతవేటు దూరం |
 |
అప్పుడే కోసి బుట్టలో పెట్టాడు భలే ఫ్రెష్ ఫ్రెష్ కాయలు ,
పచ్చివే తినాలనిపించేంత గా ఉన్నాయి |
 |
| ఇవే అసలు ములక్కాడలు అంటే , దేశవాళీవి , చూడండి భలే ఉన్నాయ్ కదా |
 |
ఇంతమంచి కూరలు అమ్ముతున్నవాడి షాప్ ఫోటో తీయకపోతే , నా కెమెరా కి అన్యాయం చేసినట్టు కదూ ... |
 |
ముచ్చట గొలిపే మొగలి పొత్తుకు ముళ్ళు ,వాసన ఒక అందం
ఫొటో తీసేలోపే నా చేతిని రెండు సార్లు దాని భాషలో ముద్దెట్టేసింది
(మనలో మనమాట మా వారు ఇది చూసి జాజి పువ్వా ? అని అడిగారు ) |
 |
ఒకటో రెండో ఉంటాయిలే అని మా ప్రసాద్ చేత చెట్టెక్కిస్తే ,
అక్షయపాత్ర లోంచి తీసినట్టు ఇన్ని కాయలు కోసాడు అన్నీ మాగాయ్ పెట్టేసింది మా పిన్నిఎంతో ఉదారంగా ప్రసాద్ గాడి చేతిలో రెండు కాయలు పెట్టి పండగచేస్కోమంది |
 |
మొన్ననే గా పెట్టావ్ మళ్ళీ ఇదేంటి ...అనుకోకండి
మా ఊరి ఎల్లాలమ్మ
(గ్రామ దేవత ) |
 |
ఆమె ఆసీనురాలు కావటానికి అన్నీ సిద్ధం
పసుపు నీరు , చీర , పసుపు,కుంకుమ, హారతి, నైవేద్యం |
 |
| స్వాగతం |
 |
| ఇంకో గరగ వచ్చింది , ఇదే అసలు ఎల్లాలమ్మ |
 |
| ఏమి నా భాగ్యము ఈ సారి రెండు రెండు అమ్మవార్లకి పానుపు వేసాము |
 |
| మా వాడు తనవంతు బాధ్యత చేసేసాడు :) |
 |
పండగొచ్చింది , పుల్ల ఐస్ తెచ్చింది (పుల్లగా ఉండే ఐస్ కాదండోయ్ , పుల్లతో ఉండే ఐస్ ) |
 |
| గ్లాస్ లో పోసిస్తే తాగుతా కానీ , ఏంటిది అసియ్యంగా |
 |
జీళ్ళు , ఖర్జూరాలు
(నోరూరుతోంది కానీ , నెత్తిమీద ఒక్కట్టిచ్చి" నీకంత అవసరమా "అంది నా అంతరాత్మ ,
ఏం చేయను సిచ్యుయేషను బేడ్ ఆ టైం లో ) |
 |
| ఫొటో తీసే హడావుడిలో ఇవి కొనడం మర్చిపోయా :P |
 |
"ఫొటోవులు తీయటమే కానీ కొనే మొహం లా ఉందా నీది " అని చూస్తున్నవ్ కదూ ఆగు మళ్ళొస్తా "చాల్లే సంబడం అందరూ చెప్పేదే" ఇది |
 |
ఇదే ఎల్లాలమ్మ గుడి , ఏంటో ఈసారి " క్యూ " లో ఉన్నారు పద్దతిగా ఏం మజా లేదు ఈ క్యూలో |
 |
| వీరభధ్రుడు ...తేడా వస్తే తాట తీసుడే |
 |
ఈమే ఎల్లాలమ్మ , ఎంతో అందంగా , ప్రశాంతంగా ఉంది కదా ఫొటో లో బానే ఉంటది , ఒక్కరూ వెళ్ళి చూడండి ...దెబ్బకి ఠా కానీ చాలా మంచి అమ్మ |
 |
హాయ్ రంగుల రాట్నం ...నేను ఎక్కుతా అంటే ,...
ఎగాదిగా చూసి ..డబల్ సీట్స్ లేవు అన్నాడు :'(
దొంగ డేష్ గాడు |
 |
| ఫొటో మాత్రమే తీస్తా ...ఏమనుకోకే .. |
 |
చాలా బొమ్మలు కొనేసా , ఫస్ట్ టైం నేను బేరం చేయలేదు తెలుసా
కానీ అన్నింటి మీదా 5 రూ తగ్గించి ఇచ్చాడు తెలుసా
(మా ఊరోడే అందుకే డిస్కౌంట్ ) |
 |
వంటింటి సాధనాలు ....
ఖోపం బాగా వస్తే వీటిలో కొన్ని ఆయుధాలుగా కూడా వాడొచ్చు ;-)
(ఈ సలహా ఆడవాళ్ళకు మాత్రమే ) |
 |
| నేను కొనుక్కున్న వాటిలో ఒకటి ఇది |
 |
| రావులపాలెం అరటిగెలలు |
 |
| బోడసుకుర్రు రేవు |
 |
చాలా బాగుంది కదా , ఈ ఫోటో నేను తీసా , నేను తీసా అని నేను మా వారు కొట్టుకుంటున్నాం
ఎవరు తీసారో మీరైనా చెప్పగలరా ?
|
 |
ఎన్ని ఫొటోలు తీసినా తనివి తీరదు
 |
అలా చల్లగాలికి బయటికి వెడితే ,
అక్కడ తెలిసున్న తాత కూర్చోండని ఈ కొబ్బరి చాప ఇచ్చాడు
భలే ఉంది కదా |
|
 |
తాటి కల్లు రెఢీగా ఉంది , ఎవరైనా రెడీ గా ఉన్నారా
(ఇది మగవారికి మాత్రమే :P)
|
ఈ సారి పెద్దగా కాకపోయిన , కొంత వరకు నా సమ్మర్ హాయిగా గడిచిపోయింది... మరి మీరెలా ఎంజాయ్ చేస్తున్నారు
nice pics
ReplyDeletethank u Mohana gaaru :)
Deleteఆ జీడి కాయలూ.. తాజా కూరగాయలూ, వంట సామానూ చూస్తే మాత్రం "అబ్బాహ్! ఈవిడ ఎంత అదృష్టవంతురాలో" అనిపించిందండి.
ReplyDeleteఫొటోస్ అన్నీ బావున్నాయి. కొన్ని కొన్ని మరీ బావున్నాయి :)
ఇక నా సమ్మర్ అయితే, హడావిడిగా సాగిపోతోందండీ :)
థాంక్యూ ప్రియా :)
Deleteమమ్మల్ని కూడా మీఊరు తీసుకుని వెళ్ళిపోయారు .ఫోటోలు బాగా తీశారు .మీబాబు బాగున్నాడు .
ReplyDeleteనా తరఫున , మా అబ్బాయి తరఫున థాంక్యూ నాగరాణి గారు ..
Deletevery good all chala bagundi.....................
ReplyDeleteథాంక్యూ శశి :)
Delete:P nee photography lo nee creative captions e highlight asalu .. " nenu kurchonaa ante, egadiga chusi, double seats levu anadu aa dash fellow" was a gud one vadins :)
ReplyDeleteథాంక్యూ శిరీ :)
Delete:P nee pics lo aa creative captions e highlight.. "nenu kurchona ante, egadiga chusi double seats levu anadu aa dash fellow " was a gud one vadins :)
ReplyDelete