Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Friday, July 5, 2013

హలో సెగట్రీ ...


ఎప్పుడు బట్టలు ఉతుకుదామన్నా ఈ నీళ్ళు ఆగిపోతాయ్.. ఖర్మ ఖర్మ ఇప్పుడు ఈ వాచిగాడిని బతిమాలుకోవాలి
హలో వాచ్ అన్నయ్యా ..
నీళ్ళాగిపోయాయి కాస్త టాంక్ నింపమ్మా ,

ఏంటీ నీళ్ళురావటం లేదా
,
మీకొక్కరికేనా ?
ఏమో నాకేంతెలుసు
..
ఓ పని చెయ్ నీ కింద
ఫ్లాట్ వాళ్ళని , ఆ పక్క వాళ్ళని , ఈ పక్కవాళ్ళనీ అడుగూ రాకపోతే అప్పుడేస్తా మోటరు ..

ఓరినీ పొగరు తగలెయ్యా
..
నీ మొహమండా, దొంగ ….నోడా అవసరం నాది

కింద
ఫ్లాట్ కి ఫోను చేస్తాను , హలో భాభీ మీ ఇంట్లో నీళొస్తున్నాయా ..

రావటంలేదండీ చాలా సేపైంది ఈ వాచ్ మెన్
ని  వేయమన్నాను ఇంకా వేయలేదు కాబోలు .

వాడి కి బాగా పొగరులా ఉందే అసలు మర్యాద
లేకుండా మాట్లాడుతున్నాడు , పైగా నన్ను ఫ్లాట్ వాళ్ళందరికీ ఫోను చేసి కనుక్కోమంటున్నాడు , ఎక్కడినించి తెచ్చారో గానీ చంపుకుతింటున్నాడు .

అవునా అలా అన్నాడా
రెండు తిట్టకపోయారా . "

ఇప్పుడు తిడతాను


హలో వాచ్ గా
..
నీళ్ళు రావటంలేదు మోటర్ వెయ్యి ,

వేస్తాగానీ అసలు కనుక్కున్నారా లేదా
?

ఆ కనుక్కున్నాను ఎవరికీ రావటంలేదు
, అయినా నీకెంత
పొగరు కాకపోతే నాకు పని చెప్తావ్, బుధ్ధిలేదా , బత్తమీజ్  కహీకా .. టప్ .. ఫోను పెట్టేసాను లేదంటే వాడు నన్ను తిరిగి తిట్టినా తిడతాడు .

One fine S
unday morning .. (అదే తెల్లారినతర్వాత …)


 
పొద్దున్నే 9. 30 కి టింగ్ ఢాం (మా కాలింగ్ బెల్ అలానే మోగుతుంది లెండి )ఎవడికో ఇంత పొద్దునే కొంపమునిగింది అనుకుంటూ తలుపుతీసి చూస్తే .. ఎదురుగా బుద్ధిమంతుడు బలరామయ్య రూపంలో బలవంతంగా ఆముదం తాగిన ఫేసుతో ఎదురుగ్గా వాచ్ బాబుతిట్లకి  మొహం వాచిన వాడిలా నాకేసి క్రూరంగా , దీనంగా , బాధగా , ఖోపంగా చూస్తున్నాడు . నా మొహం అన్ని ఆల్ఫాబెట్స్ ఆకారాలలో తిరిగి Q (?) దగ్గరకొచ్చి ఆగిపోయింది .

ఏం
మేడం నాగురించి కంప్లైంట్ చేసారు సెగట్రీ కి ..

నేనా
.. సెగట్రీ కా . ...చా గుణింతం హడావుడిగా ..లేదే ..!!!

నిన్న
రాత్రి నించి సెగట్రీ , వాళ్ళ వైఫుట్రెజరీ అందరూ ఒకరి తర్వాత ఒకరొచ్చి నన్ను తిట్టారు , నా సీట్లో నేను కూర్చోవటం లేదని ఊరంతా తిరుగుతున్నానని కూడా చెప్పారట కదా ...

ఏంటి
ఇది కూడా నేనే .... ...

ఎవరదీ
..వెనకాల నించి మా చెంగల్ పట్ శాంతారాం గారు విచ్చేసారు , ఏంటీ పొద్దున పొద్దునే వీడి నిజరూప దర్శనాలు ?

నేను
సెగట్రీకి కంప్లెంట్ ఇచ్చానని వచ్చి గొడవ చేస్తున్నాడు ...నేను సెగట్రీని చూసి 20 రోజులైంది (ఉత్తుత్తి ).

లేదు
సర్ మేడం అందరిచేతా నన్ను తిట్టిస్తున్నారు ..

లేదని
చెప్తోంది కదా అసలు సెగట్రీ ఎవరో మాకు తెలియనే తెలియదు కానీ నువ్వెళ్ళు పొద్దున్నే గోల పెట్టకు ,.

అదికాదు
సర్ నా ఉద్యోగం పోతుంది :'(

అయినా
ఇంత పొద్దున్నే గొడవకొచ్చావ్ , ఇప్పుడు పోతుంది నీ ఉద్యోగం , బుద్ధిలేదు నీకు ..బత్తమీ...

నువ్
ముయ్ ముందు ..
నేను
సెగట్రీ తో చెప్తా కానీ , నువ్వెళ్ళు

అలాగే
సర్ ..నమస్తే ..

నీకసలు
బుద్ధుందా .. నేపాలీ గాడితో నీకేంటసలు , ఎప్పుడోప్పడు కోపం వచ్చి వచ్చి నీ పీక పిసికి చంపేస్తాడు .

అరే
ఎలా కనిపెట్టారు .వాడు నేపాలీ గాడని

వాడి
50-50 కళ్ళు చూస్తే తెలియటం లేదు
..

అబ్బ
మీరు భలే తెలివైనవారండీ ..

అసలు
విషయం చెప్పు ..నువ్వు అసలు సెగట్రీ కి కంప్లెంట్ ఎందుకు చేసావ్ ?
నేనా
కంప్లైంటా ..అసలు నేను అసలు మాట్లాడందే ..ఉండండీ కిందావిడ కానీ చెప్పిందేమో అడుగుతాను , నాకీ పిచ్చి గోలేంటో అర్ధం కావటం లేదు .

హ్ల్లో
హ్లో ..భాభీ ..సారీ పొద్దునే డిస్ట్రబ్ చేసాను ..

 :) :) :)

పొద్దున్నే
వాచ్ బాబు వచ్చి గొడవ చేసాడు నేను కంప్లెంట్ ఇచ్చానని , సెగట్రీ గారిని కలవందే నేను
నేను
నిన్నకిందకి వెళ్తే వాడు లేడు , తర్వాత నేను, మావారు కలిసి బాగా తిట్టాం వాడిని , తర్వాత మన పెద్దాయన కూడా తిట్టాడు .
అవునా
..నా దగ్గరకొచ్చి గొడవ అసలు విషయం సెగట్రీ గారితో ఎలాగైనా చెప్పాలి .
నాకు
చెప్పారుగా నేను చూసుకుంటాను ..మా వారితో చెప్తాను .
మళ్ళీ
పాపం మీవారికెందుకు అనవసర గొడవ . నేనే మా వారితో చెప్తాలెండి సెగట్రీ గారితో చెప్పమని .
మళ్ళీ
మీ వారొచ్చి మా వారితో చెప్పటమెందుకు , నే చెప్తాలెండీ
మా
వారు మీ వారితో ఎందుకు చెప్తారు , సెగట్రీ కి కదా చెప్పేది ..
అదేనండీ
నేను చెప్పేది
మరి
మీ వారెందుకు మధ్యలో ..
ఎందుకంటే
సెగట్రీ మా వారే కాబట్టి ...
అయ్యా
..కెవ్వ్ ..అవునా ..నేనింకా మీ ఎదురు ఫ్లాట్ ఆయన సెగట్రీ అనుకున్నానండీ ..
హుం
..మా వారు సెగట్రీ అయ్యి 6 నెలలు అయ్యిందండీ ...
అయ్యో
అవునాండీ చారీ  :P
హేమండీ
...హి హి హి మరేమో ..నేలపైన నా గోటితో రకరకాల పిచ్చి గీతలు గీసేస్తూ (ముగ్గులు పెద్దగా రావు )...ఒక పక్క నా చీరకొంగు చింపే ప్రయత్నం చేస్తూ ...అబ్బ చిరగదేం ..దీన్నీ ...మరేమోనండీ ..

వింటున్నా ., నీ తొందర దొంగలు దొయ్యా , పోయి పోయి సెగట్రీ పెళ్ళాం తో చెప్పి నాకేం తెలియదంటావేమే ,
నాకేం
తెల్సు , మీకెంత తెల్సో నాకూ అంతే తెల్సు .

సర్సరే కాస్త జాగ్రత్త ..వాచ్ గాడు కొంచం డేంజరుగాడిలా ఉన్నాడు .మీరు మరీను మీకు అందరూ అలానే కనిపిస్తారు ,అందరూ వెధవలే ఉంటారా ఏంటీ !!!!  :/మీది మరీ పిచ్చిభయం .
అయినా
రేపటినించీ కొత్తోడు వస్తున్నాడట లెండి .


ఎందుకైనా
మంచిది సాయంత్రం వాడితో చెప్తాలే , మేం కాదు నీ గురించి కంప్లెంట్ ఇచ్చింది అని ..

సరే
మీ ఇష్టం

.................................


one fine sunday
ఉదయం (వారం తర్వాత ) ...

ఓయ్ ..నా జీనియస్ మిస్టర్ పెళ్ళాం ఒకసారి ఇటొచ్చి పేపర్ చూడు ,

"
గొడవపడినందుకు పగబట్టి చంపిన వాచ్ మెన్ "
గజగజగజగజ ..దడ దడ దడ ...హేమింటండీ ఇది ..

మరదే సారి నించైనా నా మాటవిని బుధ్ధిగా ఉంటావా...

అలాగలాగే ప్రామిస్ ప్రామిస్ మిస్ ( ఉత్తుత్తి ;-) ) 

ఆ తర్వాత ఒక వారం పాటు దొంగదారి వెతుక్కుని తిరిగా

1 సం వేచిచూచాను ..వాచ్ యముడై వస్తాడేమో అని భయం భయం గా ...లక్కీ ...రాలేదు :D



Saturday, May 25, 2013

జాగ్రత్త సుమా


హలో ...హాయ్ ఏంటి ఎక్కడికెళ్తున్నావ్ ..
( ఏట్లోకి )
ఫ్రెండి దగ్గరికా వీక్ డేస్ లో కాకపోతే నేనే డ్రాప్ చేసేవాడిని గా
 ఎండలో వెళ్తే గాగుల్స్ పెట్టుకో
(గుడ్డిదాన్ననుకుంటారేమో)
ఈ మధ్య అందరూ పెట్టుకుంటున్నారు ..
ఎందుకైనా మంచిది గొడుగు తీసుకెళ్ళు
(నవ్వుతారేమో)
ఈ మధ్య కాలం లో  గొడుగు వాడని వాడే లేడు
 బండి పై వెళ్తే హెల్మెట్ పెట్టుకో ..
( మరి నా జుట్టు ఊడితే)
జుట్టు మొలవడానికి మందులున్నాయ్, తల మొలవడానికి లేవు 
(ఈ లాజిక్ కూడా బాగుందే )..
స్పీడ్ 40 మించకు
 (అసలు స్పీడో మీటరే పనిచేయటంలేదు)
స్పీడో మీటర్ బాగుచేయించావా …
బ్రేక్ మీద ఒక చేయి వేసి ఉంచు ..
(మరి రెండో చేయి )..
ఇంకో చేతితో స్పీడ్ కంట్రోల్ చేయ్..
రోడ్డుకి ఎడమ వైపునే వెళ్ళు ..
( అసలు అటువైపు అంతా గోతులు , గొప్పులు )
రోడ్డు బాగోక పోతే ఆటో లో వెళ్ళు ..
ఆటోలో వెళ్తే వాడి నంబర్ SMS చేయ్
(వాడు ఫోన్ నంబర్ ఇస్తాడంటారా ? )
నేను చెప్పేది ఆటో నంబర్ .
ట్రైన్ లో వెళ్తే లేడీస్ కంపార్ట్మెంట్ మాత్రమే ఎక్కు..
(వాళ్ళ కన్నా మగాళ్ళే బెటర్ కాస్త కూర్చోటానికి ప్లేస్ ఇస్తారు )
సీట్ గురించి కాదు , సేఫ్టీ ఆలోచించు 
రద్దీ ఉంటే కాసేపు ఆగు ..
( ఇంకో గంటకి కానీ రాదు )
కొంపలంటుకుపోయే పనులేమున్నాయ్ కనక వెళ్ళగానే ఫోను చెయ్యి ..
( చెయ్యకపోతే )
నేను చేసినప్పుడైనా ఆన్సర్ చేయ్  
రోడ్డు మీద దొరికే గడ్డి , గాదాం తినకు ..
(నేనేమైనా జంతువునా )
ఏదైనా ఐతే నిన్ను వెటర్నరీ డాక్టర్ దగ్గరకి కూడా తీసుకెళ్ళను
 నాసిరకం వి ఏవీ కొనకు ..
(అదీ ఇదీ ఒకటే కదా )
నువ్వు రోడ్డుసైడు కొన్న ఆ  చెప్పులు రెండో రోజుకే తెగిపోతాయ్ వాటి గురించి నేను చెప్పే
ది . బాటాలో కొంటా అంటే వినవు కదా 
దాహంవేస్తే పిచ్చి నీళ్ళు తాగకు .. వాటర్ బాటిల్ కొనుక్కొ ..
(ఇంక నా వల్ల కాదు )
చిన్నోడి చేయి వదలకు ..
(వాడు పట్టుకోనివ్వాలిగా)
వాడు వదిలించుకున్నా , నువ్వు వదలకు 
తెలియని వాళ్ళతో పరిచయం పెంచుకోకు 
(నా మొహం లా ఉంది , అప్పుడే కదా వాళ్ళు పరిచయస్తులు అవుతారు)
ఎవర్ని పడితే వాళ్ళని నమ్మకు ..
(మిమ్మల్ని కూడా అలానే నమ్మాను : P)
అందరూ నాలా ఉండరు ….
నిజమే నిజమే …
మీకు మామీద ఉండే అంత కేరింగ్ మాత్రం ఎవరికీ ఉండదు :) ♥
 మీ ఇంట్లో ఉన్నారా ఇలాంటి వారు ?
పదే పదే జాగ్రత్తలు చెప్తుంటే  వినడానికి విసుగేసినా , ఆలోచిస్తే అర్ధమవుతుంది , ఆనందంగానూ ఉంటుంది ..