Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Monday, March 19, 2012

నీ కంటి నీటి ముత్యమా

అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ...సైజు లో మనకన్నా చిన్నగా ఉన్నాయి కదా అని ఎవరిని ఇన్సల్టు చేయకూడదు అర్ధమైందా !!.....

అర్ధమైందమ్మా ....

కథ ఐపోయింది....

కథ కంచికి మనం నిద్రకి ...సరే ఇంక పడుకో ...

అమ్మ నేను నిన్ను ఒక కొచ్చెను వేస్తాను ....ఫీల్ అవ్వవు కదా !! అడగనా?

అడుగు నాన్నా ...ఫీల్ అవ్వను .

నిన్న నన్ను ఎందుకు కొట్టావ్ ? 

మేథ్స్ సరిగా చేయటం లేదు ..దిక్కులు చూస్తున్నావ్ అందుకే ...

నన్ను కొట్టినపుడు ..నేను బాగా ఏడ్చాను కదా ...నీకు కొంచం కూడా బాధగా అనిపించలేదా ?

నా బంగారం సారీ రా ...నాన్నా...

అమ్మా...ఏడుస్తున్నావా ..నువ్వు ...

అబ్బే....లేదే.... లేదురా ....నేను ఏడవటం లేదు నాన్నా ...(కళ్ళు తుడుచుకుంటూ )

సారీ అమ్మా ఇంకెప్పుడూ ...ఇలా అడగను ...(ఏడుస్తూ)

ఎందుకు ?

ఎందుకంటే నువ్వు ఏడిస్తే నేను చూడలేను ...నాకూ ఏడుపు వచ్చేస్తుంది అమ్మా ....సారీ  




Sunday, March 18, 2012

ఎదురుచూపులో ఇంత తీపని తెలియలేదు మునుపు



అప్పుడప్పుడూ ఫోను చేస్తావా....పోనీలే 

కనీసం నేను చేసినప్పుడైనా మాట్లాడు అని చిరుకోపంతో సాగనంపే ఆయన 

ఆత్మీయంగా ఆహ్వానించే అందమైన పెంకుటిల్లు ...






బంగారు వచ్చావా అని నవ్వుతూ చూసే బామ్మా,తాతయ్యల ఫోటో ...

దూరప్రయాణం చేసి వచ్చావు కాస్త సేద తీరు అనే తీయని కొబ్బరి నీళ్ళు ...

హాయిగా కావలిసనన్ని నీళ్ళు వాడుకో అని చల్లని నీరునిచ్చే బావి..... 

మా కష్టాలు నీకు వద్దు ....దీర్ఘసుమంగళీభవ,సుఖీభవ అని దీవించే నా సీతారాములు ....

అంతులేని గారం చేసే నాన్న(లు)....

అలకలు తీరుస్తూ అంతలోనే చిన్నగా కసిరే అమ్మ(లు)..

అక్క ...అ
క్కా అంటూ అటూ ఇటూ కూర్చుని కబుర్లు చెపుతూ ...చెల్లెళ్ళూ ,తమ్ముడూ....


ష్ఠా చమ్మా ఆడుతూ ..దొంగాటలాడుతూఅంతలోనే ..గొడవపడుతూ...

హాయిగా నవ్వుతూ అలా పెరటిలోకి నడిస్తేఇప్పటికైనా గుర్తొచ్చామా అని అడిగనట్లనిపించే సంపెంగలు , 
మల్లెలు , జాజులు ,గన్నేరులు .... పూచిన మొక్కలు 

అయ్యో నువ్వొచ్చేప్పటికి పువ్వులు లేవే అని జాలిగా చూసే పొగడ చెట్టు ,....

హమ్మయ్య వచ్చావా అని నిర్మలంగా నవ్వే ఇంటి ముందు చెరువు .....




నువ్వు కూడా నాలాగే కళ కళ లాడుతున్నావ్ అని నిండుగా రామచిలుకలతో నవ్వే రావిచెట్టు ..

పాములు వచ్చే లోగా కోసుకుపో అని విచ్చుకున్న మొగలి పువ్వు ...

గోధూళి వేళ ఇంటికి చేరే గోవులని ....గోపాలులని ...గోపికలని పలకరించి వచ్చేలోపు ...

అంతలోనే చీకటి పలకరిస్తే ....

చిరుగాలికి గల గల మనే ఆకుల సవ్వడి వింటూ....

ఆరుబయట వెన్నెల్లో మడతమంచమేసుకుని ...


అక్కడొకటి , ఇక్కడ ఇంకోటి అని అల్లరి ఆదిత్యతో చుక్కల లెక్కలు చూస్తుంటే...

ఆవకాయ్ అన్నం ఎవరికి కావాలోయ్ అని బాబాయ్ పిలిచే ఒక్క కేక కి 

ఉరుకుల పరుగులతో చేరుకుని కంచం ఖాళీ చేసి ..నాదంటే నాది అని ఆవకాయ్ ముక్క లాక్కొని ...

హే నేనే గెలిచా అని అనుకుంటూ ఉండగా(అలవాటుగా ఎప్పుడూ నేనే గెలుస్తా ).....

నాన్న విసనకర్ర్తతో నెమ్మదిగా వీచుతూ ఉండగా....

అమ్మ తన మనవడికి చెప్పే కథలు ,కబుర్లు ....జోల పాటలు హాయిగా వింటూ....

ఆవలింతలొచ్చి అలానే పడుకుంటే .....మంచి కలల నిద్రలే  


అయ్యో అప్పుడే తెల్లారిపోయిందే అనుకుని ...

ఆదరా బాదరా ఎర్ర బస్సెక్కి కోనసీమ అందాలు చూస్తూ ప్రయాణం ...
ఒరేయ్ అత్తొచ్చిందిరా ......అని తనపిల్లలని హడావుడి చేస్తూ ...

అంతలోనే ఆత్రంగా , ఆత్మీయంగా  ...నేను లేని 364 (1/2)రోజుల బాకీ ఈ ఒక్కపూట లో తీర్చుకోవలనే ఆరాటం అన్నా ,వదినలకి 

నాకు నచ్చేవి ఇప్పటికి గుర్తు పెట్టుకుని అవన్నీ ఒకేసారి అందిస్తూ ...

నేను మారినా ...వాళ్ళ అభిమానం ఇప్పటికీ మారదు ..

ఇంకాసేపు ఉండాలని ఉన్నా ...కోనసీమ అందాలను మిస్ అవుతున్నానే అని బాధ పడుతూ ...వెనుకకి తిరిగి చూడక 

చూస్తే వెనుతిరగలేక ....మళ్ళీ వస్తాగా అని ఆశతో ...

అమ్మ (ల), నాన్న(ల)తో ...పదిరోజులు పది అరక్షణాలుగా గడిపి ఎన్నో మధురస్మృతులను పదిలంగా దాచుకునే సమయం ......

ఈ సమయం కోసం వేసవి .....
వేసవి కోసం మేము ....
మా కోసం మా ఊరు , ఇల్లు ఎదురుచూస్తూ ..............

Saturday, February 11, 2012

నా బంగారు కి శుభాకాంక్షలు

ఏంటో మా ఇంట్లో అందరూ అల్లరి తో పుట్టారు ...అల్లరి చేస్తూనే ఉన్నారు , అందుకే అల్లరి అంటే భయం వేస్తోంది , మా బాబు ని తిట్టినప్పుడల్లా నన్ను నేను తిట్టుకున్నట్లే ఉంటుంది .అంతలోనే అల్లరి మాని కామ్‌ గా ఉంటే  ఏదో వెలితిగా ఉన్నట్లు ఉంటుంది . మా ఇంట్లో వీడి అల్లరి పుట్టి రేపటికి 6 సంవత్సరాలు పూర్తి అవుతుంది.వాడి గురించి ఎంతో రాయాలని ఉంది కానీ నా దిష్ఠే తగులుతుందని భయం తో ఏమి రాయలేను ..టెక్నాలజీ ఎంత మారినా ...తల్లి ప్రేమ లో మాత్రం మార్పు రాదు కదా !!!

వాడు పుట్టి 6 అవుతున్నా కూడా నిన్ననే పుట్టినట్లు ,,,,అంతలోనే ఎన్నో జన్మల అనుబంధం ఉన్నట్లు అనిపిస్తోంది , వాడి గురించి ఎంతో చెప్పాలని ఉన్నా కూడా , వాడి గురించి రాయాలంటే పేద్ద భాగవతం అవుతుంది అందుకే ఈ సారికి రాయటం లేదు . అంతే కాక వాడికి నచ్చినవి ఇవ్వకుండా నేను రాస్తూ ఉంటే ,వాడికే చికాకు రావచ్చు . అందుకే వాడికి ఈ రోజు  నచ్చినవే ఇద్దామని డిసైడ్ అయ్యాను .




 పొద్దునే లేవగానే నాన్నమ్మ ,తాతయ్య , పెదనాన్న , పెద్దమ్మ , అన్నయ్యలు ,బాబాయ్ ,పిన్ని , చెల్లాయ్ , అమ్మమ్మలు , తాతయ్యలు , పిన్నులు , మావయ్యలు అందరితో  ఫోను లో మాట్లాడి ...తర్వాత  నలుగులు , స్నానాలు తర్వాత కొత్త బట్టలు ...






ముందు జేజి గారి ఆశీస్సులు తీసుకోవాలి కదా ....





అందుకే మా ఇంటి దగ్గరున్న బాలాజి గుడికి వెళ్ళి బోల్డు దణ్ణాలు పెట్టేసుకుని .

ఈ సంవత్సరం నుంచైనా నాకు అల్లరి తగ్గాలి అని వాడు .

నా కుటుంబ అంతా బాగుండాలి అని నేను ...

వీళ్ళిద్దరిని  భరించే సహనం ఇక మీదట కూడా ఇలానే ఉండేలా నీ వరాలని రెన్యువల్  చేయి స్వామీ అని మా వారు


ఇలా అందరం ఎవరి గోల లో వాళ్ళు దేవుడిని ఖంగారు పెట్టేసి ఆయన ఎవరిని దీవించాలి అని అనుకునే లోగా పూజారి గారి ని ఖంగారు పెట్టేసేసి ...కాసేపు గుడి ఆవరణ లో కూర్చుని ప్రసాదాలు తినేసి ఇంటికి వచ్చేయాలి .




ఆ తర్వాత మా వాడికి నచ్చిన బ్రేక్ ఫాస్ట్ ...........


ఇడ్లీ తినమంటే తెగ టైం పట్టేస్తుంది ...ఇదైతే ఫటా ఫట్ ధనా ధన్‌ .....


ఆ తర్వాత మధ్యాహ్న భోజనానికి అన్నీ తినలేడు కదా అందుకే ...కొంచం కొంచం


ముందు తిన్నా తినక పోయినా వాడికి నచ్చిన బొమ్మలు ఇచ్చి ఆ తర్వాత కార్టూన్‌ పెడితే  అప్పుడు వాడు బుద్దిగా ఒక చోట కూర్చుని తింటాడు కదా అందుకే

 

ఇప్పుడు చకచకా తినేస్తాడు ...

తర్వాత స్కూల్  కి వెళ్ళి మొక్క నాటాలి, ఫ్రెండ్స్ కి చాకీస్ పంచాలి  .


ఆ తర్వాత మా హాల్ ని ఇలా బెలూన్ల తో .....కేక్ తో డెకొరేట్ చేసి 



తర్వాత వాడి ఫ్రెండ్స్ గాంగ్ ని పిలిస్తే 




మరి వాళ్ళని ఊరికే పిలిచి క్లాప్స్ అంటే ఊరుకుంటారా? మరి వాళ్ళకి కూడా మా వాడు మెనూ సెట్ చేసాడు .....అవి ఏంటంటే

       

అంతేనా ..మరి మంచి మంచి గిఫ్టులిచ్చి వాళ్ళని సంతోషపెట్టి ...



వాళ్ళందరికీ టాటా చెప్పేసి ....
ఆనందం లో , కేరింతల్లో .....అలసి సొలసిపోయిన నా బంగారు తండ్రికి జోల పాడే టైం అయింది ...అంత త్వరగా పడుకుంటాడా మరి  ... మరి ఎలా ? దానికి ఒక చిట్కా ఉంది ...


చందమామ ఉండనే ఉన్నాడు ..అందులోను మా వాడు మాఘ పౌర్ణమి నాడు పుట్టిన నిండు...చంద్రుడు అందుకే వాడి పుట్టినరోజు రెండు సార్లు చేస్తున్నా..మా చందమామకి ...ఆ చందమామ ని చూపెడతా...అప్పుడు జోకొడాతా అంతే చక్కగా నిద్రపోతాడు ......

చందమామా చూసావుగా అచ్చు నీ లాంటి మా బాబు ని
నేల అద్దాన నీ బింబ మై పారాడు తుంది




అన్నట్లు చెప్పటం మర్చిపోయాను కదూ మా బంగారు పేరు "ఆదిత్య "

హమ్మయ్య ఇంక నేను ఇల్లు సర్దుకోవాలి మరి ...నేను వేసుకున్న ప్లాను ఫ్లాప్ అవకుండా చూడు దేవుడా




Thursday, February 2, 2012

ఇది అల్లరా ...కాదు కాదు కానే కాదు

నేను ఇప్పుడు ఒక మగానుభావును గురించి రాయబోతున్నాను .....వారు ఎవరంటే .....

మా......మా.........నేను స్కూల్ కి వెళ్ళను ,

 ఏం ఎందుకు వెళ్ళవు ? అడిగింది సదరు "మా" అనబడే వాళ్ళ అమ్మ .
ఆ టీచర్ కి ఇంగ్లిష్ రాదు మరి ఇంక నేను ఆమె దగ్గర ఏం నేర్చుకుంటాను చెప్పు ?
నీకు ఎలా తెలుసు ఆవిడకి రాదని ..
నన్ను ఒక్క కొచ్చెనేసింది దాంతో నాకు తెల్సిపోయింది ..ఏమిటా కొచ్చెను నాకు చెప్పు ...
"what is your fathers name? అని అడిగింది నాకెంత మంది ఫాదర్స్ ఉంటారని ఆవిడ ఉద్దేశ్యం? అలా అడిగింది అందుకే నేను స్కూల్ కి వెళ్ళను ..ఒరేయ్ అది fathers కాదురా "father's రా అంటే మీ నాన్న యొక్క పేరు ఏమిటి అని అర్ధం .వీడి తెలివి తేటలకి నా జోహార్లు ...అంతేకాదు కొత్త కొత్త పదాలు నేర్చుకోవడం ..అలాంటి మాటలు అనకూడదు అని వాళ్ళమ్మ కొడితే ..ఏడుస్తూ కూడా మళ్ళీ అవే మాటలు మాట్లాడుతూ ఏడవటం , దెబ్బలైనా తింటాను కానీ అల్లరి మానను అనుకునే రకం . ఒక సారి బాత్రూం లోకి వెళ్ళి తలుపు గడియపెట్టేసుకున్నాడు . బయట నుంచి వాళ్ళమ్మ స్టూలు వేసుకుని లోపలికి వంగి తీసింది లేకపోతే వాడు కాసేపట్లో ఆరునొక్క రాగం అందుకునేవాడే .ఒకరోజు ఏమైందో మరి నా మీద ప్రేమెక్కువై నా కుడిచేతి బొటనవేలు లటుక్కున కొరికేసాడు , ఏం చేస్తాం వాడి అల్లరి కి నేను కూడా ... :'( మా బాబాయ్ పెళ్ళి అయింది ఎవరైనా పిల్లలు ఆటలు ఆడుతూనో ఎవరితోనో దెబ్బలాడుతూనో ఉంటారు , వీడు మాత్రం పెళ్ళి బాజాల దగ్గర కూర్చుని ఎలా వాయిస్తున్నారో చూసేవాడు , అంతే కాక చెట్టు బెరడు ని మెడలో వేసుకుని ,రెండు పుల్లలు చేతి తో పట్టుకుని నోటితో సౌండ్ చేస్తూ వాయించేవాడు .

 వాడికి స్నానం చేయిద్దామనే నీళ్ళు తోడుతూ నేను నూతిలో పడ్డాను , నేనే వచ్చి నిన్ను కాపాడేవాణ్ణి కానీ  నేను స్నానం చేయటానికి రెడీ గా ఉన్నాను కదా ఓన్లీ నా ఒంటిమీద అండర్ వేర్  మాత్రమే ఉంది అందుకే రాలేదు అందరూ షేమ్ షేమ్‌ అంటారు అని అన్నాడు , అప్పటికి వాడి వయసు బహుసా ఆరేడేళ్ళు .

తర్వాత వాడితో పాటుగా అల్లరి పెరుగుతూ అది ఆగడాల లిస్ట్ లోకి చేరిందిట , ఎందుకంటే ఆ టైం లో నేను వాడితో పాటు లేను .

తర్వాట వాడు చాలా పెద్దవాడయ్యాడు ఎంత అంటే  పీజీ చేసేంత ..అంతేకాదు పీజీ అంటే మా బాబాయ్ పరిభాషలో "పందిరి గుంజ" అని కూడా అర్ధం (పందిరి కి వేసే వెదురు గడంత ) నిజంగానే వాడు అంత పొడుగు కూడా ఉంటాడు .వాడి తో పాటు బద్దకం కూడా బాగా పెరిగింది . కానీ వాళ్ళమ్మకి సాయం చేయడం లో మాత్రం ఉండేది కాదు . అదొక్కటే వీడి లో నాకు కనబడే మంచి .

కొన్ని రోజులు పాటు వాళ్ళింట్లో ఉండటానికి వెళ్ళాను ,నా ప్రోజెక్ట్ అక్కడే పూర్తి చేద్దామని , కానీ వాడు నాకూ , వాళ్ళ చెల్లికి కాళరాత్రులు చూపించాడు . పగలంతా  మొద్దు లా నిద్రపోయి ..మధ్యాహ్నం 1 కి లేచి అప్పుడు అన్నతిని , మళ్ళీ పడుకుని రాత్రుళ్ళు లేచి కూర్చునే వాడు అంతే వాడు అప్పుడు వాడి గోల మొదలుపెట్టేవాడు కాసేపు కంప్యూటర్ లో పాటలు ...మాకు పాట్లు ఆపరా అంటే ఇంకా సౌండు పెంచేవాడు , తిడితే వాడి దగ్గర  ఉన్న             మౌత్ ఆర్గాన్‌ తీసుకొచ్చి వాయించేవాడు అదేదో మమ్మల్ని ఆనందింప చేయడానికి అనుకుంటున్నారేమో మహ గొప్పగా వాయిస్తాడు అనుకుంటే పొరపాటు ...బాబోయ్ వాడి సంగీతం వినేకంటే డిడి8 సప్తగిరి లో వచ్చేవ్యవసాయ దారుల కార్యక్రమం పప్పు రొయ్యల పెంపకం , వరి నాట్లు వేయటం ప్రసారాలు చూస్తూ హాయిగా బాధ తెలియకుండా సునాయాసంగా ప్రాణాలు వదిలేయచ్చు . ఎలాగోలా వాడిని బ్రతిమాలి పానీపూరీ లు తినిపిస్తామని మాట ఇచ్చి వదిలించుకునేవాళ్ళం .మేము ఎంత తెలివి తక్కువ వాళ్ళ మంటే  వాడి వెపన్శ్ దాచేయాలి అని కూడా మాకు తట్టేది కాదు అంతలా వాడి వాయిద్యాలతో మా బుర్రలు మట్టి కొట్టుకు పోయేలా, తుప్పు పట్టి పోయే్లా  చేసేవాడు . ఒకరోజు మా ఖర్మ కాలి వాడి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు  , మా వీధి లో ఏక్ తార లు అమ్మేవాడు వచ్చాడు , అంతే ఇంక చూసుకోండి మా సామి రంగా అంటూ వాడి దగ్గర్ కొనేసేసి ... రాత్రుళ్ళు ఈ కొత్త వాయిద్యం తో వాయిస్తూ మా చెవులు చిల్లులు పడేలా ..సాక్షాతూ పిశాచాలే వచ్చి తమ స్వహస్తాలతో వాయిస్తున్నారా!! అన్నంత మధురంగా వాయించేవాడు .ఒకసారి కోపం వచ్చి విరగొట్టేసాము , మా గ్రహచారం గడ్డితిని మళ్ళీ ఆ ఏక్ తారా లు అమ్మేవాడు దాపురించాడు , ఈ సారి ఒకటికి రెండు కొన్నాడు , ఏదో సినిమాలో తనికెళ్ళ భరణి "పాత సామానులు కొంటాం "  అని ఎంట్రీ ఇచ్చినట్లు కొత్త ఏక్ తారా కొనాలని అనుకున్నప్పుడల్లా వచ్చేవాడు , వాడికి మా వాడు డైలీ కస్టమర్ అయ్యాడు .చిన్నప్పుడు మా బాబాయ్ పెళ్ళి లో నేర్చుకున్న సంగీతం ఇప్పుడు ఉపయోగ పడిందన్న మాట వాడికి .

ఒకసారి వాళ్ళ నాన్నమ్మ కొన్ని రోజులు ఇక్కడ గడిపి వెళ్ళింది , ఆవిడ అటు వెళ్ళిందో లేదో వాళ్ళమ్మని ఇంక      మీ అత్తగారు జంప్ కదా షురూ చేయ్ తీన్‌ మార్ అని , అసలు వీడి బుర్రలో ఏం తిరుగుతూ ఉంటుందో అర్ధమయ్యేది  కాదు .

టివీ ఆన్‌ చేసి కూర్చునేవాడు చదువులు చెడతాయని వాళ్ళ నాన్న కేబుల్ పెట్టించలేదు ఈ ఉద్ధండుడు మేడెక్కి ఏదో మతలబు చేసి కేబుల్ టివి ప్రసారాలు మచ్చలు కానీ చుక్కలు కానీ లేకుండా వచ్చేటట్లు చేసాడు , అంతే కాదు ఎపుడైనా సిగ్నల్ పోయి రాకపోతే ఆ దుర్మార్గుడు నన్ను మేడపైకి పంపి సరిచేయమనే వాడు ఎక్కడం దిగడం ..సరిగా వచ్చేంతవరకు ఇదే పని :'(.ఈ హడావుడి లో వాళ్ళ నాన్నకూడా అసలు విషయం మర్చిపోయి తనుకూడా కొడుకుతో పాటు టివి చూడటం మొదలు పెట్టాడు .

ఒకసారి మేమందరం కూర్చుని అత్త కోడళ్ళ డైలీ సీరియల్ చెత్తగా ఉన్నా మా కళ్ళన్నీ టివీ కి అప్పచెప్పి చూస్తున్నాం . సడన్‌ గా మాకు ఎలుక చచ్చిన కంపు కొటటం మొదలయింది , దెబ్బకి మేము ఆ సీరియల్ నుంచి బయటకి వచ్చి ఎక్కడబ్బా ఆ వాసన  అని తెగ వెతకడం మొదలు పెట్టాము , వెతకగా వెతకగా అది చెప్పుల స్టాండు నుంచి వస్తోందని తేలింది , బాగా పరిశీలిస్తే తెలిసింది మా బంగారయ్య వేసుకున్న సాక్స్ ల నుంచి అని ఫైనల్ నిర్ణయానికి వచ్చాము , గత నెల రోజులుగా మార్చకుండా వాడుతున్నాడట , పైగా కొత్తవే మొన్ననే నెల క్రితమే మార్చాను అన్నాడు . వాడి సాక్సులు ఉతికితే వాషింగ్ మెషీన్ ఎక్కడ పాడవుతుందో అని భయంతో వాళ్ళమ్మ అందులో కూడా వేయనివ్వకుండా విడిగా ఉతకమనేది , అవి నాన బెట్టిన బకెట్ కి పట్టిన వాసన వేడి నీళ్ళు వేసి  కడిగితే కానీ పోదేమో అని అనుమానం కూడా ఉంది . కానీ వాడు అసలు ఉతుకుంటే గా(ఎందుకంటే వాడి సాక్సులు ముట్టుకునే ధైర్యం మా ఇంటి పనమ్మాయికి కూడా లేదు ).మరి . ;-).

ఒకరోజు మేమందరం చదువుకుంటూ పడుకునే రూమ్ సర్దుదామని అనుకున్నాను , వాళ్ళమ్మ చెపుతూనే ఉంది ఎందుకొచ్చిన గొడవ వాడితో సర్దకు అని , అయినా నేను వినలేదు , నేను సర్దటం మొదలు పెట్టాను , పురావస్తు శాఖ తవ్వకాలు మొదలు పెట్టినట్లు అయింది నా పని ఏవేవో పాత వైన వస్తువులు కనిపించకుండా పోయాయి, లేదా పోయాయి అనుకున్నవి దొరికాయి , ఎలాగైతేనేం మధ్యాహ్నానికి వాడి బుక్స్ రేక్ సర్దాను , సాయంత్రానికి బలాదూర్ తిరిగి వచ్చి గది లోకి వెళ్ళి దేని కోసమో కలగాపులగంగా వెతకటం మొదలు పెట్టాడు , ఏమిట్రా అని అడిగితే  పుస్తకం ఒకటి కనిపించటం లేదు అన్నాడు తీసి ఇచ్చాను , నేనే సర్దాను గందరగోళంగా ఉందని అన్నాను పేద్ద గొప్పగా అంతే కయ్ మని అరిచి నోటికొచ్చిన అరుపులన్నీ అరిచాడు , వాడికి అలాగుంటేనే ఇష్టమట అన్నీ చక్కగా కనిపిస్తూ ఉంటాయట . ఇలాంటి వాడిని ఏం చేయాలి , ఆ గదిలో ఆంజనేయ స్వామి పోస్టరు పెద్దది ఉండేది దానిని చూసినప్పుడల్లా నాకు అది ఖాళీ గా ఉన్నట్లు అనిపించేది కళ్ళు నులుముకుని చూస్తె  నార్మల్బ గా ఉండేది బహుసా వీడి గందరగోళాన్ని చూసి ఆ దేవుడే మాయమైపోయాడేమో అని నా డౌట్ ,  అప్పటినుంచి వాడి పుస్తకాల జోలికి నేను వెళ్ళలేదు , తర్వాత ఇంకో విషయం ఏంటంటే పాత న్యూస్ పేపర్లు కూడా అమ్మనివ్వ కుండా దాచి ఉంచాడు అవి మూటలు మూటలై పేద్ద గడ్డి మేటులయ్యాయి .

నాకేదైనా హెల్ప్ చేయరం అంటే చచ్చినా చేయను అనేవాడు , నేను నా నోటికొచ్చిన తిట్లన్ని తిట్టిన తర్వాత చేసేవాడు , ముందే చేసిఉంటే ఈ గొడవ ఉండేది కాదు కదా ? ఏమొ మరి ?

ఇల్లు మారారని తెలిసి రెండు నెల్లయింది,అలాగే లేటవుతోంది ఈ సారైనా చూద్దామని వెళ్ళాను , ఇల్లంతా బాగుంది వీళ్ళ బెడ్రూం లోకి వెళ్ళి చూసాను అన్ని నీట్ గా సర్ది ఉన్నాయ్ కానీ ....చంద్రుడి లో మచ్చలా , తులసి వనం లో గంజాయి మొక్కలా ,బాపూ గారి సినిమా చూస్తుంటే మధ్యలో వచ్చే మాల్టోవా ఏడ్ లాగా  రెండు పెద్ద సైజ్  మూటలు కనిపించాయ్ ఏమిటవి అని అడిగితే మీరెవ్వరూ ముట్టుకోవటానికి వీల్లేదు అని ఏవో అమూల్యమైన వస్తువులన్ని ఉన్నట్లు బోడి గొప్పలు వీడూను అవే పాత పేపర్లు ,పుస్తకాలు , మా వారు అడగనే అడిగారు ఏమిటా మూటలు అని ఏమని చెప్తాం మరి ముసి ముసి నవ్వులు నవ్వుకుని వచ్చేసాము , అక్కడ ఓ మూలగా గిటారుని గిరాటు వేసినట్లు ఉంది అని చూసాను , ఏంటని అడిగితే ఈ సారి వాడు హింసించే పనిముట్టు ఇదే తెలిసింది  ఏక్ తారా లు అవి వాయించడం ఎప్పుడో మానేసాను అన్నాడు అంటే దాని అర్ధం ఇదా , మొత్తానికి మానలేదు , మారలేదు ..హమ్మయ్య అదృష్టం కొద్దీ నాకు పెళ్ళైపోయింది లేదంటే మా ఊరు వచ్చి కూడా వాడి టాలెంట్ చూపించేవాడు .

 ఇప్పటికి నేనంటే అభిమానమే వెర్రి నాగన్న కి ఎప్పుడూ ఫోను చేసి కాసేపు మంచీ చెడూ మాట్లాడుతూ ఉంటాడు .

 వీడికి బలవ్వడానికి త్వరలో ఇంకో జీవి రాబోతోంది పాపం ఆ అమ్మాయిని ఆ దేవుడే కాపాడాలి , ఆ అమ్మాయి కి వీడిని మార్చుకునే ఓపిక ఉండాలి  ,లేకపోతే వీడి ని ఓర్చుకునే ధైర్యం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా వినాయకుడిని కోరుకుంటున్నాను .

ఇంతకీ వాడెవరో చెప్పనే లేదు కదూ ...వాడు మా చిన్నమేనమామ కొడుకు , మా అమ్మకి ముద్దుల మేనల్లుడు అయిన మగానుభావుడు . వాడిపేరు అనంత్ శరత్ చంద్ర ...పేరుకి తగ్గట్లు వీడు రాత్రులే వెలుగుతూ (మోగుతూ )ఉంటాడు . మొన్న మా అల్లరి గురించి రాసినప్పుడు ..వాడి గురించి అసలు ఏమీ రాయలేదని ఫీల్ అయ్యాడు నీ యెంకమ్మ ఎందుకే అంత తక్కువ రాసావ్ అని అడిగాడు అందుకే మళ్ళీ ప్రత్యేకించి ఇలా రాస్తున్నా ....ఎంత రాసినా ఇంతకన్నా దారుణంగా నేను రాయలేను , కోరి కోరి నీకున్న ఇమేజ్ స్పాయిల్ చేసుకున్నావ్ రా శరత్ ...సారీ రా ఏం చేయను చెప్పు రాయడం మొదలు పెడితే నిజాలే బయటికి వస్తున్నాయి రా దున్నపోతా.అందుకే ఇంతటితో ఆపేస్తున్నా ....ఇంకోసారి సారీ :




Sunday, January 8, 2012

రోడ్లు,భవనాలు

బాబోయ్ స్కూలుకి టైం అవుతోంది ...బంగారూ త్వరగా రారా మళ్ళీ గేటు మూసేస్తారు ....
మమ్మా ఇంకా 10 నిమిషాలు టైం ఉందిగా ....
అందుకని ఇంకా ఏమన్నా ఆలస్యం చేద్దామని ఉందా,నీ వేషాలు నా దగ్గర కాదు ఇంకెవరినైనా చూసుకో .ముందు పద

అబ్బా ఈ లిఫ్టు ఎప్పటికి వచ్చేనో ,హమ్మయ్య వచ్చేసింది ,పద త్వరగా.అయ్యో షూ లేసు కట్టుకోలేదురా ,ఒక్క సెకను ఆగు ...హా కట్టేసాను  పద.అయ్యో పెట్రోలు మర్చిపోయాను ,సాయంత్రం వచ్చేటప్పుడు గుర్తుచేయి నాన్నా ,మనం ఫిల్లింగ్ స్టేషను కి వెళ్దాము .
సరే మమ్మా...అనుకుంటూ నేను, మావాడిని స్కూలుకి దింపడానికి బయలు దేరాను ....ఒక పది అడుగులు బండి కదిలిందో లేదు ...చక్కగా రోడ్డు మొత్తం తవ్వి diversion బోర్డు పెట్టారు ..మళ్ళీ బండి దారి మార్చి వేరే వీధిలో కొంత దూరం వెళ్ళెప్పటికి మళ్ళీ అక్కడ కొత్త  గా పేద్ద బుల్ డోజరు ...రోడ్డుని తవ్వుతోంది హబ్బా మళ్ళీ దారి మార్చాలి ,
కొంచం వెనక్కి వెళ్ళి వేరే సందులో రయ్ రయ్ జుయ్ జుయ్ .. పీ... పీ .ఇక్కడ ట్రాఫిక్ లేదు,హమ్మయ్యా ,మళ్ళీ ఇదేంట్రా ...ఏదో బోర్డు మమ్మ్మీ ....D I V E R S I O N ...అమ్మా ది వెర్షన్‌ టా....కాదురా డైవర్షను ..మళ్ళీ మెయిన్‌ రోడ్డుకి వెళ్దాం చూద్దాం ఏం చేస్తాం ....

అరే ఎవడ్రా వాడు రాంగ్ డైరక్షను లో వస్తున్నాడు,పోలీసు ఏమీ అనడే , నేను అడగనా అమ్మా,నోరుమూసుకుని కూర్చో ,మనం కూడా వాడి రూట్లో నే వెళ్దాం పద .

అదీ సంగతి ...పోలీసు బాబు ఊరుకున్న కారణం అటువైపు రోడ్డు కూడా చక్కగా తవ్వి ఉంచారు ...


ఎట్టకేలకి స్కూలుకి చేరుకున్నాము,మళ్ళీ వెనక్కి వస్తూ ఆ దారి వద్దురా బాబూ ఖంగారు లేదు కదా చుట్టు తిరిగి వెళ్దాం అని వేరే రూటు పట్టి వెళ్తున్నా,సగందారి  లో మళ్ళీ అదే గొడవ ,తవ్వకాలు ,గోతులు ,బుల్ డోజరులు ఇది ఈ రోజు కొత్తగా  జరిగేది కాదు ,ఏడాది మొత్తం ఇదే పరిస్థితి

లక్ష్మి దేవి వచ్చినప్పటి నుంచి (శ్రావణమాసం నుంచి )దుర్గాదేవి వెళ్ళేవరకు మాకు వర్షాలతో హోరెత్తి పోతుంది తర్వాత దీపాలతో పాటు రోడ్లు వేస్తారు ,మళ్ళీ కార్తీక మాసం లో దీపాలతో పాటు రోడ్లు కూడా ఈ బుల్ డోజర్లతో కొట్టుకు పోతాయ్ .ఒకసారి గాస్ పైప్ లైను లని , ఒకసారి వాటర్ కని ,మరో సారి డ్రైనేజ్ కని నేలంతా తవ్వి తవ్వి ఆఖరున పేచ్ వర్కు చేసి పొతారు .మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి యధావిధి గోతులు ,గొప్పులు ,ఓపెన్‌ చేసి ఉంచిన మాన్‌హోల్సు ..ఈ అస్తవ్యస్త జీవనం ప్రతి సంవత్సరం పునరావృతమవుతూనే ఉంటుంది (సత్యం సత్యం పునఃసత్యం ).ఈ మునిసిపాలిటీ వాళ్ళు మనకి మంచి చేస్తున్నారో ,చెడు చేస్తున్నారో అర్ధంకానీ అయోమయం లో ....

                  పోనీ సమ్మర్ లో అయినా ప్రశాంతత ఉంటుందా అంతే అది కూడా కరువై పోయింది తెల్లవారకుండానే  డ....డ ...డ డ ...........డా డా డా........అంటు పునాదులు తవ్వ్డ డానికి బుల్ డోజర్లు వచ్చేస్తాయి ..ఈ సారి రోడ్లు తవ్వడానికి కాదు ,పేద్ద పేద్ద అపార్ట్మెంట్లు ,భవనాలు కట్టడానికి వేసవి కాలం లోనే పునాదులు తవ్వి మొదలు పెడతారు.లేదంటే వర్షాల వల్ల పనులు ఆగిపోతాయని ,సూర్యుడితో పనిలేకుండా పనిచేస్తూ ఉంటారు .మాకు అర్ధరాత్రి వరకు మోత మోతే ,పోనీ అపార్ట్ మెంట్   ఏమైనా గట్టిగా ఉంటుందా అంటే కట్టిన నాలుగు నెలలకే గోడలు బీటలు వారి ఉంటాయ్ .అంతే కాక వాడు తవ్విన దుమ్ము,ధూళి వల్ల ఇల్లంతా మట్టి మట్టి రోజూ తుడుచుకోవడమే పని .ఉదయమే చక్కటి గాలి కోసం తలుపు తీస్తే చక్కగా అతడజను తక్కువ కాకుండా తుమ్ములొస్తాయ్ దుమ్ము వల్ల .సింగిల్ బెడ్రూం ప్లేసులో డబుల్ బెడ్రూం కట్టేసి ఇక్కడి ప్రజా ప్రవాహానికి తెగమేలు చేసేస్తున్నారు .కిచెను లోంచి హాల్లోకి దూకి అక్కడి నుంచి ఫేసు లెఫ్ట్  టర్నింగు ఇచ్చుకుంటే అక్కడ మాస్టర్ బెడ్రూం కనిపిస్తుంది ..అక్కడే ఉన్న డబుల్ కాట్ బెడ్ ఎక్కి అక్కడ ఎదురుగా ఉన్న డోరు తీసుకుని ఒక్క జంప్ చేస్తే ఒక మాదిరి మనిషి పట్టే ఒక రూం ఉంటుంది అదే బాత్రూం అన్నమాట ,మళ్ళీ సేమ్‌ రూట్ లో హాల్లోకి వచ్చి రైటుకి సేమ్‌ ప్రోసెస్ లో జంపు చేస్తే ఒకరు పడుకోవడానికి ఎక్కువగా ఇద్దరికి ఇరుకుగా ఉండే రూమే రెండో బెడ్రూం లేదంటే స్టోర్ రూం గా వాడుకోవచ్చు ఒకవేళ ఆ ఇల్లు పెద్దదిగా ఉంది అని ఎవరైనా అనుమానంగా పొరబడితే కనుక .ఇంక  బాల్కనీ గురించి ఆలోచన వద్దు అస్సలొద్దు .అల్మారాలంటే ఏమిటీ ? అని బిల్డరు అడిగే పరిస్థితి.మోసాలు చేసి  డబ్బులు గుంజే బిల్డర్లు కొందరైతే  ....ఫ్లాట్లు అమ్ముడవక పాట్లు పడే వాళ్ళు ఇంకొందరు   .
మధ్యలో అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు లోన్లు ఇస్తామని చెప్పి అసలు కన్నా వడ్డీ ఎక్కువగా గుంజే బ్యాంకు వాళ్ళు, ఎవరిని నమ్మలో తెలియని అయోమయ స్థితిలో ఫ్లాటు కొనాలా వద్దా ,అని తెగ ఆలోచించి బుర్రలు పగలగొట్టుకునే జనాలు,మళ్ళీ లోనులు తీర్చలేక,ఆ బాధలు ఆర్చేవారు లేక పట్నాల్ల్లో జన జీవనం కట్ కటా...

ప్రతి మనిషీ మరిఒకరిని దోచుకునేవాడే ..తనభాగ్యం తన సౌఖ్యం చూసుకునే వాడే 
కాంచ వోయి నేటి దుస్థితి ..ఎదిరించలేని ఈ పరిస్థితి 

("ఎదిరించవోయి" నే కాని ఇది నా లైను గా అందుకే మార్చేసా) ..స్వర్గీయ అల్లు రామలింగయ్య గారు అన్నట్లు ......ఏం చేస్తాం బొంబాయ్ లో అంతే బొంబాయ్ లో అంతే ...

హమ్మో స్కూలు టైం అయింది మళ్ళీ రూటు ప్లాను చేసుకోవాలి


Wednesday, January 4, 2012

విచిత్రం










మా గణపతిని నిమజ్జనం చేయడానికి వెళితే అక్కడ కనిపించిన సాయి గణపతి














తామరాకు పై నీటిబొట్టు 





                       లిమ్కా అడిగితే నాకు ఇచ్చింది ఇదీ .....................          









కొల్హాపూర్ లో ఒక షాపు కి పెట్టిన బోర్డు ఇది  

Monday, January 2, 2012

నూతన సంవత్సర శుభాకాంక్షలు


నేను ఈ బ్లాగు మొదలు పెట్టి ..నాకు వచ్చిన రాతలు (కొన్ని కోతలు కూడా ఉన్నాయి మరి ) నా ఇష్టమొచ్చినట్లు నేను రాసుకోవడానికి ..నన్ను ఎంకరేజ్ చేసిన బ్లాగరు , జర్నలిస్టు ఒకరున్నారు ఎవరో తెలుసా ???

మా నా చరణం -మీ పల్లవి గ్రూపు సహ అధ్యక్షురాలు శ్రీమతి జ్యోతి వలబోజు గారు ..జ్యోతి గారు ఒకటి కాదు రెండు కాదు రకరకాల బ్లాగులు నడుపుతున్నారు ...వంటలు ,సాహిత్యం , సంగీతం ,పాటలు , ఫొటోలు , గడినుడి , నాలాంటి బ్లాగర్లకు బ్లాగు గురించి గైడెన్సు ..అబ్బో నేను చెప్పలేను ఒక్కసారి ఆవిడ బ్లాగులను చూసి చుట్టిరండి ...హాస్చర్యపడిపోతారు మీరు ...మరి ఇన్ని ఉన్నాయ్ మరి ఎలా మేనేజ్‌ చేస్తున్నారో ..నేను ఒక్క బ్లాగు రాయడానికే నాకు కష్టంగా ఉంటే ...పాపం జ్యోతి గారు ఎంతో కష్టపడి మనకోసం ఇవన్నీ అందిస్తున్నారు కదా ..మరి ఆ కష్టం కాసేపు మర్చిపోయేలా ఆమె కోసం

జ్యోతి గారికి నచ్చిన పాటలు మనం కూడా చూసి , విందామా...చూస్తూ విందామా ....

మా ప్రియతమ NCMP గ్రూప్ సహా అధ్యక్షురాలు జ్యోతి గారికి కుడా నూతన సంవత్సర శుభాభినందనలతో ...మీకు నచ్చిన పాటలు



మరి వీళ్ళిద్దరికి నచ్చిన పాట లేనా ఇంకా గ్రూపు మెంబర్లకు లేవా అంటే .........ఉన్నాయ్ అవి కూడా ఉన్నాయ్ ...అందరికి నా అంటే మరీ ...అదీ ...మరేమో కొందరే తమకు నచ్చిన పాటలు చెప్పారు ...వాళ్ల పాటలను కూడా ఇస్తున్నాను.

ఏవి మరీ అంటే ................

ఇవిగో

ఈ పాటలు మన అందరికి మాతృసమానురాలైన సాయిబాల కోటంరాజు గారికి నచ్చినవి


chukkalatho cheppalani



మరో సభ్యులు సోమశేఖర్ పేరూరి గారికి నచ్చినవి


vinnavinchukona


kaluvaku chandrudu




ఈ పాటలు అనిల జైదీప్ గారికి నచ్చినవి





స్వాతి శ్రీనివాస్ కి నచ్చినవి


annaanaa bhamini



ఇవి తమ్ముడు సాయ్ సందీప్ కి నచ్చినవి





కమలా పరచ గారికి నచ్చినవి


జీవితమే సఫలము ..రాగసుధా భరితము


నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది


సడిసేయకో గాలి ..సడిసేయబోకే









శ్రీలక్ష్మి థమన్‌ గారికి నచ్చినవి



మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ......

చివరిగా ఓపిక తెచ్చుకుని నాకు ఇష్టమైన పాటలు ఇవి..

Sunday, January 1, 2012

వందనం ...అభివందనం

నాకు పాటలంటే చాలా చాలా ఇష్టం ...

పని చేస్తున్నా, ఖాళీ గా ఉన్నా .......  నా చెవులు ఎప్పుడు పాటలు వింటూ బిజీగానే ఉంటాయ్ .నాలా చాలా మంది మీలో ఉండేఉంటారు కదా.మరి ఇలాంటి వాళ్ళందరూ  ఒకే చోట చేరి ఆడుకుంటూ , పాడుకుంటూ ఉంటే ఎంతో సరదాగా,ఆనందంగా, అల్లరి అల్లరిగా ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది కదూ .మరి ఇలాంటి  గ్రూపుని ఒకే తాటి పై నడపాలంటే ఎంతో సహనం, ఓర్పు నిస్పక్షపాత వైఖరి,  ఉండాలి ..ఏ విషయమైనా సూటిగా,సున్నితంగా,ఎదుటివారికి బాధ కలిగించకుండా (నొప్పింపక, తానొవ్వక అన్నట్టు ) తెలిపే మాట తీరు ఉండాలి ...అందరినీ ఆకట్టుకునే స్నేహ భావముండాలి .ఆ ఇవన్నీ ఒకే వ్యక్తిలో ఉండాలంటే మాటలా....ఓ నలుగురిని కలిపితే ఒక్కకరిలో ఈ క్వాలిటీ  కనిపిస్తాయ్ అని ఇది చదివిన వారు అనే అవకాశం ఉంది ,కాని నేను అలాంటి వ్యక్తిని కలిసాను (చూడలేదు ).

ఆ వ్యక్తి ఎవరబ్బా????

నాచరణం -మీ పల్లవి అనే పాటల గ్రూపును ఫేస్బుక్ ద్వారా మొదలు పెట్టి  నాలాంటి  పాటల పిచ్చోళ్ళకి ,ఇంకా పాటల పిపాశు లకు  ఆనందాన్ని పంచుతున్న రచయిత, కార్టునిస్టు అయిన  శ్రీ రామకృష్ణ పుక్కళ్ళ గారే ఆ వ్యక్తి...



రామకృష్ణ గారు ఈ గ్రూపు ఒక్కటే కాదు ఇలాంటి చాలా గ్రూపులను ఎంతో విజయవంతంగా నడుపుతున్నారు ...ఒక విధంగా బహుముఖప్రజ్ఞాశాలి అనే చెప్పాలి ,

నేను నా బ్లాగు మొదలు పెట్టడానికి పరోక్షంగా వీరే కారణం ....ఈ గ్రూపు ద్వారా నాకు ఎంతో మంది స్నేహితులు పరిచయమయ్యారు ....

మరి ఇలాంటి మహోన్నత వ్యక్తికి ఏమిస్తే ఋణం తీరుతుంది ...అందుకే వారినే అడిగి వారికి నచ్చి,మెచ్చిన పాటలను నేను ఈ నూతన సంవత్సర కానుకగా ...............(జ్యోతి గారి అవిడియా ఇది  )



శ్రీ రామకృష్ణ పుక్కళ్ళ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో









tellavaarakamunde palle lechindi


gaalikadupu ledu